ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు – టి.జి.విశ్వప్రసాద్ ప్రముఖ దర్శకులు హరీష్ శంకర్ – అనిల్ రావిపూడి చేతుల మీదుగా గొప్ప ప్రారంభం!! ఫుడ్ ఇండస్ట్రీలో అనేక విప్లవాలు అలవోకగా ఆవిష్కరిస్తున్న “వంటల మాంత్రికుడు” కూచిపూడి వెంకట్ కిచెన్ కిరీటంలో మరో కలికితురాయి చేరింది. “ఉలవచారు, రాజుగారి తోట, కూచిపూడి పలావ్, రాజుగారి కోడి పలావ్, మారేడుమిల్లి” వంటి అద్భుత విజయాలతో ఫుడ్ ఇండస్ట్రీలో “సూపర్ స్టార్”గా వెలుగొందుతున్న కూచిపూడి వెంకట్ తాజాగా “చిట్టిముత్యాలు” పేరుతో మరో రెస్టారెంట్ కు శ్రీకారం చుట్టారు. స్వతహాగా ఆయన దర్శకుడు కావడంతో దీనికి “రొమాన్స్ విత్ రైస్” అనే ట్యాగ్ లైన్ పెట్టారు. హైదరాబాద్, హైటెక్ సిటీ సమీపంలో… మాదాపూర్, అయ్యప్ప సొసైటీలోని ఇమేజ్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన “చిట్టిముత్యాలు” (రొమాన్స్ విత్ రైస్) రెస్టారెంట్ ను ప్రఖ్యాత…