కార్తిక్ రాజు హీరోగా ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’ చిత్రం ఘనంగా ప్రారంభం

Karthik Raju's film 'Atlas Cycle Attagaru Petle' has a grand opening

యంగ్ టాలెంటెడ్ హీరో కార్తిక్ రాజు డిఫరెంట్ కథలతో ఆడియెన్స్‌ను మెప్పిస్తున్నారు. కౌసల్యా కృష్ణమూర్తి, అథర్వ లాంటి సినిమాలతో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న కార్తిక్ రాజు ప్రస్తుతం కొత్త మూవీని ప్రారంభించారు. రీసెంట్ సెన్సేషన్’అనగనగా’ ఫేమ్ కాజల్ చౌదరి హీరోయిన్‌గా, కార్తిక్ రాజు హీరోగా శ్రీ రామకృష్ణ సినిమా బ్యానర్ మీద గాలి కృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’. ఈ సినిమాకు రాజా దుస్సా దర్శకత్వం వహిస్తున్నారు. మల్లవరం వేంకటేశ్వర రెడ్డి , రూప కిరణ్ గంజి సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా కార్తికేయ శ్రీనివాస్, లైన్ ప్రొడ్యూసర్‌గా కీసరి నరసింహ (KNR), ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా సుబ్బు, ఆర్ట్ డైరెక్టర్‌గా రవి కుమార్ గుర్రం, మ్యూజిక్ డైరెక్టర్‌గా సురేష్ బొబ్బలి, గీత రచయితగా కాసర్ల శ్యామ్, కెమెరామెన్‌గా గంగానమోని…