ఎన్నో ఆశలు.. ఆశయాలతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామలు కొన్ని సినిమాలతోనే క్రేజ్ సొంతం చేసుకొని ఆ తర్వాత అడ్రస్ లేకుండా ఇండస్ట్రీలో మాయమవుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. తక్కువ సినిమాలతో క్రేజ్ తెచ్చుకొని ఆ తర్వాత ఊహించని విధంగా సినిమాలకు దూరమయిన వారూ ఉన్నారు. కొంతమంది పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెబితే.. మరికొంతమంది క్రేజ్ తగ్గి ఇక లాభం లేదనుకొని నిరాశతో సినిమాలకు బై బై చెప్పేశారు. కొందరైతే పరిశ్రమను విడిచిపెట్టలేక సహాయక పాత్రలు చేసుకుంటూ ఎలాగో అలా కెరీర్ ని నెట్టుకొస్తున్నారు. మరికొంతమంది మాత్రం అక్క, వదిన లాంటి పాత్రలు చేస్తూ కెరీర్ ని నెట్టుకొస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న హీరోయిన్ కూడా ఒకానొక సమయంలో వరుస సినిమాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. 2016వరకు సినిమాలు…
