‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’లో నా కెరీర్ బెస్ట్ క్యారెక్టరైజేషన్ చేశా : హీరో నితిన్

Hero Nithin gave the best characterization of my career in 'Extraordinary Man'

టాలెంటెడ్, ఛ‌ర్మిస్మేటిక్ హీరో నితిన్ కథానాయకుడిగా వక్కంతం దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్‌, ఆదిత్య మూవీస్ అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, రుచిర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యాన‌ర్స్‌పై సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తోన్న ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’. డిసెంబర్ 8న రిలీజ్ అవుతున్న ఈ సిినిమా ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్‌లో … నిర్మాత ఎన్.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కి మమ్మల్ని సపోర్ట్ చేయటానికి వచ్చిన అభిమానులు, ప్రేక్షకులకు థాంక్స్. ఇప్పుడు సినిమా గురించి ఏం మాట్లాడను. రిలీజ్ తర్వాత మాట్లాడుతాను’’ అన్నారు. డైరెక్టర్ వక్కంతం వంశీ మాట్లాడుతూ ‘‘ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుంది. ఈ ఔట్ పుట్ ఇవ్వటానికి నేను, నితిన్ రెండేళ్లు కష్టపడ్డాం. నిజానికి కష్టపడ్డామని చెప్పకూడదు. ఎందుకంటే…