Dhanush Divorce: ఆ హీరోయిన్ల వల్లే ధనుష్‌-ఐశ్వర్యలు విడిపోయారు!?

Dhanush Divorce:

భార్య ఐశ్వర్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తరువాత తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ పేరు మరోసారి సంచలనమైంది. తన భార్య ఐశ్వర్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులకే కాదు కోలీవుడ్ కు ఊహించని షాక్‌ ఇచ్చారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఐశ్వర్య- ధనుష్‌లు18 ఏళ్ల తర్వాత తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మంచి స్నేహితులుగా, దంపతులుగా, ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులుగా, పరస్పర శ్రేయోభిలాషులుగా ఇంతకాలం కలిసి జీవిస్తున్న తాము ఇకపై భార్యభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. నిజానికి వీరిద్దరి మధ్య సుచీలీక్స్‌ వ్యవహారంతోనే కలహాలు మొదలయ్యాయని కోలీవుడ్‌ టాక్‌. తమిళనాట స్టార్‌ హీరోగా పేరు సంపాదించుకున్న ధనుష్‌ పేరు సుచీ లీక్స్‌లో బయటపడటం అప్పట్లో సెన్సేషన్‌కు దారితీసిన విషయం తెలిసిందే. 2017లో కోలీవుడ్‌ను ఊపేసిన అత్యంత వివాదాస్పద…