వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న అరుణ్ విజయ్ హీరోగా సి.హెచ్. సతీష్ కుమార్ అసోసియేషన్‌తో శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్,మూవీ స్లయిడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్‌పై జి.యన్.కుమార వేలన్ డైరెక్షన్‌లో ఆర్.విజయ్ కుమార్ నిర్మాతగా రూపొందిన చిత్రం ‘ఆక్రోశం’. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ అండ్ ఎమోషనల్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘సినం’ను తెలుగులో ‘ఆక్రోశం’ పేరుతో డిసెంబర్ 16న భారీ లెవల్లో విడుదల చేయటానికి నిర్మాత ఆర్.విజయ్ కుమార్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్బంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో.. నిర్మాత సి.హెచ్.సతీష్ కుమార్ మాట్లాడుతూ ‘‘‘ఆక్రోశం’ మూవీ ..తల్లి, తండ్రి, భర్త, భార్య, కొడుకు.. ఇలా కుటుంబంలోని అన్ని ఎమోషన్స్‌ను బ్యాలెన్స్‌ను చూపిస్తూ అందరూ కలిసి చూసే విధంగా ఉంటుంది. దీంతో పాటు సినిమాలో మంచి…