తెలంగాణ ఏర్పడ్డ తరవాత కెసిఆర్ ప్రభుత్వం రాష్ట్రంలోని వినియోగదారు లందరికీ నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బోట్ల పరమేశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… తెలంగాణ ఏర్పడే నాటికి స్థాపిత విద్యుత్ సామర్థ్యం 7,778 మెగావాట్లు కాగా, ప్రస్తుతం 18,453 మెగావాట్లుగా ఉంది. రాష్ట్రంలో ఇంధన రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం రూ.12,727 కోట్లు కేటాయించి, 2022 ఆర్థిక సంవత్సరం నుంచి రూ.1,500 కోట్లకు పెంచింది. విద్యుత్ తలసరి వినియోగం 2014`15లో 1,356 యూనిట్లుగా ఉంది. 2021`22 నాటికి ఇది 2,126 యూనిట్లకు పెరిగింది. దేశంలో తలసరి విద్యుత్ వినియోగం 1,255 యూనిట్లుగా ఉంది. గత 9 సంవత్సరాలలో అన్ని వర్గాలకు రూ. 39,321 కోట్లతో సరఫరా పంపిణీ వ్యవస్థలకు బలోపేతం చేయడంతో 2014లో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1110…