యూనివర్సల్ క్రియేటివ్ స్టూడియోస్, శ్రీకర్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై శేషు బాబు. సీహెచ్, కాసుల రామకృష్ణ నిర్మిస్తున్న సినిమా “అరి వీర భయంకర”. ఈ చిత్రానికి కిషన్ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్సాఖాన్, వైదిక, ఐశ్వర్య, కనిక మోంగ్యా, అర్చనా రాయ్, డెబొర, అమిత శ్రీ , శృతి రాజ్, సోమదత్త, నాగ మహేశ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో “అరి వీర భయంకర” సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో … నిర్మాత శేషు బాబు. సీహెచ్. మాట్లాడుతూ – ఈ రోజు పూజా కార్యక్రమాలతో మా అరి వీర భయంకర సినిమా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. మా యూనివర్సల్ క్రియేట్ స్టూడియోస్, రామకృష్ణ గారి శ్రీకర్ మూవీ మేకర్స్ తో కలిసి సినిమాను…