నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఎంథాలజీ “మీట్ క్యూట్”. నాని సోదరి దీప్తి గంటా ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. సత్యరాజ్, రోహిణి, అదా శర్మ, వర్ష బొల్లమ్మ, ఆకాంక్ష సింగ్, రుహాని శర్మ, సునైనా, సంచిత పూనాచా, అశ్విన్ కుమార్, శివ కందుకూరి, దీక్షిత్ శెట్టి, గోవింద్ పద్మసూర్య, రాజా ప్రధాన పాత్రలు పోహిస్తున్న ‘మీట్ క్యూట్” ఎంథాలజీ ” నవంబర్ 25న సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపధ్యంలో ‘మీట్ క్యూట్” ‘మీట్ క్యూట్” ప్రీస్ట్రీమింగ్ సెలెబ్రెషన్స్ గ్రాండ్ గా జరిగాయి. హీరో నాని మాట్లాడుతూ.. ‘మీట్ క్యూట్” చాలా క్యూట్ ఎంథాలజీ. మీ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం వుంది. ఇందులో ఐదు కథలు వున్నాయి.…