* శ్రీరామ నవమి కానుకగా ‘రామబాణం’ నుంచి కొత్త పోస్టర్, గ్లింప్స్ విడుదల * త్వరలోనే థియేటర్లలో అలరించనున్న గోపీచంద్- శ్రీవాస్ హ్యాట్రిక్ ఫిల్మ్ ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్ సినిమాల తరువాత మాచో స్టార్ గోపీచంద్, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీవాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న హ్యాట్రిక్ ఫిల్మ్ ‘రామబాణం’. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల భారీస్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో గోపీచంద్ సరసన నాయికగా డింపుల్ హయతి నటిస్తుండగా, జగపతి బాబు, కుష్బూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. హిట్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ‘రామబాణం’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ సినిమాపై అంచనాలను…