superstar Krishna special story : తెలుగు వీర లేవరా…!

తెలుగు వీర లేవరా...!

”సినిమాలంటే నాకు పిచ్చి ప్రేమ. నచ్చి చేసే పనే కదా..? అందుకే విసుగు రాలేదు. పైగా సినిమా సినిమాకీ వాటిపై ప్రేమ పెరిగింది..” – అంటారు కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ అంటేనే.. మంచితనానికి, మానవత్వానికి నిలువుటద్ధం. గుంటూరు జిల్లా తెనాలి మండలములోని బుర్రిపాలెంలో 1942 మే 31న ఘట్టమనేని వీర రాఘవయ్య చౌదరి – నాగరత్నమ్మలకు పెద్ద కొడుకుగా జన్మించిన ఘట్టమనేని కృష్ణ సూపర్ స్టార్ గా మారడానికి చేసిన కృషి అంతా ఇంతా కాదు. నటుడు, దర్శకుడు, నిర్మాత, స్టూడియో అధినేతగా తెలుగు సినీ కళామతల్లికి ఆయన అందించిన సేవలు మరపురానివి. కృష్ణ పూర్తిపేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. కృష్ణ 1970-80ల్లో తెలుగు సినిమా హీరోగా విశేష ప్రజాదరణ పొంది సూపర్ స్టార్‌గా ప్రఖ్యాతిగాంచారు. 1964కంటే ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన…