‘దండోరా’తో నటిగా గాయని అదితి భావ‌రాజు ఎంట్రీ

Singer Aditi Bhavaraju debuts as an actress with 'Dandora'
Spread the love

లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌ను స్థాపించి తొలి చిత్రం ‘క‌ల‌ర్‌ఫోటో’తో అందరి దృష్టిని ఆక‌ర్షించిన డైన‌మిక్ ప్రొడ్యూస‌ర్ ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్ప‌నేని.. ఆ త‌ర్వాత ‘బెదురులంక 2012’ వంటి సూప‌ర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన సంగ‌తి తెలిసిందే. మ‌రోసారి ఆయ‌న త‌న‌ స‌క్సెస్‌ఫుల్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తోన్న లేటెస్ట్ ఎగ్జ‌యిటింగ్ మూవీ ‘దండోరా’. ఈ చిత్రానికి ముర‌ళీకాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గ్రామీణ తెలంగాణ నేప‌థ్యంలో రూపొందుతోన్న‘దండోరా’లో బ‌ల‌మైన ప్రేమ క‌థాంశంతో పాటు క‌ఠిన‌మైన నిజాలను, స‌మాజంలో కొన‌సాగుతోన్న సామాజిక దుష్ప‌ప్ర‌వ‌ర్త‌ల‌ను ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇందులో శివాజీ, న‌వదీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో మెప్పించ‌నున్నారు. ఇప్పుడు టాలెంటెడ్ సింగ‌ర్ అదితి భావ‌రాజు న‌టిగా ఈ చిత్రంతో సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇస్తున్నారు. ఎన్నో చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్స్‌ను ఆల‌పించిన అదితి..‘దండోరా’ చిత్రంలో న‌టనా ప్ర‌తిభ‌ను ప్ర‌ద‌ర్శించ‌నుంది. ఆమె ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ‘దండోరా’ మూవీ ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. తెలంగాణ‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ప‌లు కీల‌క షెడ్యూల్స్‌ను పూర్తి చేశారు. ఇటీవ‌ల విడుద‌లైన మూవీ ఫ‌స్ట్ బీట్ టీజ‌ర్‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. దీంతో సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. రాబోయే రోజుల్లో సినిమా నుంచి మ‌రిన్ని ఆస‌క్తిక‌ర‌మైన విశేషాల‌ను తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు. మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్నఈ సినిమాకు మార్క్ కె.రాబిన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. వెంకట్ ఆర్.శాఖ‌మూరి సినిమాటోగ్రాఫ‌ర్‌గా, సృజ‌న అడుసుమిల్లి ఎడిట‌ర్‌గా, క్రాంతి ప్రియం ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా, రేఖా బొగ్గార‌పు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ఎడ్వ‌ర్డ్ స్టీవెన్‌స‌న్ పెరెజి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా, కొండారు వెంక‌టేష్ లైన్ ప్రొడ్యూస‌ర్‌గా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తిస్తున్నారు. బియాండ్ మీడియా నుంచి నాయుడు సురేంద్ర కుమార్‌, ఫ‌ణి కందుకూరి మీడియా మేనేజ్‌మెంట్ పిఆర్ వ‌ర్క్‌ను.. టికెట్ ఫ్యాక్ట‌రీ మార్కెటింగ్ వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.
న‌టీన‌టులు: శివాజీ, న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య‌, అదితి భావ‌రాజు త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం: బ్యాన‌ర్‌: లౌక్య ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, నిర్మాత‌: ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్ప‌నేని, ద‌ర్శ‌క‌త్వం: ముర‌ళీకాంత్‌, సినిమాటోగ్ర‌ఫీ: వెంక‌ట్ ఆర్‌.శాఖ‌మూరి, ఎడిట‌ర్‌: సృజ‌న అడుసుమిల్లి, సంగీతం: మార్క్ కె.రాబిన్‌, ఆర్ట్ డైరెక్ట‌ర్‌: క‌్రాంతి ప్రియం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ఎడ్వ‌ర్డ్ స్టెవెన్‌స‌న్ పెరెజి, కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: రేఖా బొగ్గార‌పు, లైన్ ప్రొడ్యూస‌ర్‌: కొండారు వెంక‌టేష్‌
పి.ఆర్‌.ఓ : నాయుడు సురేంద్ర కుమార్‌- ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా), మార్కెటింగ్: టికెట్ ఫ్యాక్ట‌రీ

Related posts

Leave a Comment