నేషనల్ క్రష్ రశ్మిక మందన్న పాన్ ఇండియా స్థాయిలో వరుస విజయాలు సాధిస్తోంది. తన అందం, నటన, ఆకర్షణతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. మరో హీరోయిన్ కు లేనంత క్రేజ్ ను సొంతం చేసుకుంటోంది రష్మిక. వెయ్యి కోట్ల రూపాయల సినిమాలను అలవోకగా అందుకుంటూ ఇండియన్ సినిమా క్వీన్ గా మారింది. రష్మిక నటించిన పుష్ప, పుష్ప 2, యానిమల్ చిత్రాలు బాక్సాఫీస్ రికార్డులు తిరగరాశాయి. లేటెస్ట్ గా ఛత్రపతి శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’ సినిమాలో యేసుబాయి పాత్రలో రష్మిక నటన ప్రతి ఒక్కరినీ మెప్పించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 600 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించింది. ఈ సక్సెస్ లు కొనసాగిస్తూ ప్రస్తుతం తన క్రేజీ లైనప్ కంటిన్యూ చేస్తోంది రష్మిక సల్మాన్ ఖాన్ సరసన సికిందర్, నాగార్జున, ధనుష్ హీరోలుగా దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న ‘కుబేర’ సినిమాలతో పాటు ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ లో నటిస్తోంది. ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా రష్మిక కెరీర్ లో మరో మైల్ స్టోన్ కాబోతోంది. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన రష్మిక నటిస్తున్న ‘సికిందర్’ సినిమా రంజాన్ ఈద్ పండుగ సందర్బంగా రిలీజ్ కు రెడీ అవుతోంది.
బ్లాక్ బస్టర్ మూవీస్ తో ఇండియన్ సినిమా క్వీన్ గా మారిన హీరోయిన్ రష్మిక మందన్న
