తొలిచిత్రంతో ‘ఆర్య’తోనే దర్శకుడు తన ప్రతిభను నిరూపించుకున్న దర్శకుడు సుకుమార్. ఆ తరువాత జగడం, ఆర్య-2, 100 పర్సెంట్ లవ్, వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో చిత్రాలతో బ్రిలియంట్ దర్శకుడుగా పేరు పొందిన సుకుమార్, రంగస్థలం వంటి చిత్రంతో కమర్షియల్ కల్ట్ బ్లాక్‌బస్టర్‌తో అందరినీ నివ్వెరపరిచాడు. ఇక ‘పుష్ప’తో పాన్ ఇండియా సక్సెస్‌ను సాధించిన సుకుమార్ ‘పుష్ప-2’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాదు భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘పుష్ప-2’ చరిత్రను సృష్టించింది. తొలిచిత్రం ఆర్య నుంచి కొత్తదనం కోసం తపనపడుతూ, ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్ పీరియన్స్ అందించే సినిమాలు రూపొందిస్తూ తనకంటూ ఓ బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్నాడు, ముఖ్యంగా బాలీవుడ్‌లో పెద్ద స్టార్స్ సైతం సుకుమార్‌తో సినిమాలు తీయడానికి ఎంతో ఉత్సాహం చూపుతున్నారు. ఇలాంటి ఓ గొప్ప క్రియేటివ్ దర్శకుడికి నేడు బీఎన్ ఫిల్మ్ పురస్కారం ప్రకటించడం పట్ల టాలీవుడ్‌తో పాటు పలువురు తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
”ప్రతిష్టాత్మక గద్దర్ ఫిల్మ్ పురస్కారాల్లో బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు ప్రకటించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. నన్ను ఇంతటి ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేయడం ఆనందంగా ఉంది. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గద్దర్ ఫిల్మ్ అవార్డు జ్యూరీకి నా కృతజ్క్షతలు. తెలుగు సినిమా రంగంలో శిఖరం లాంటి బీఎన్ రెడ్డి గారి పేరు మీద ఉన్న అవార్డు అందుకోవడం మరింత గౌరవంగా అనిపిస్తుంది. నా చిత్రాల నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు, నా చిత్రాలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు నా హృదయపూర్వక కృతజ్క్షతలు” అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు దర్శకుడు సుకుమార్
బీఎన్ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను : దర్శకుడు సుకుమార్
