భగీరధకు భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందన

భగీరధకు భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందన

సీనియర్ జర్నలిస్ట్ ,రచయిత భగీరథను భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అభినందించారు . మహానటుడు, తెలుగు దేశం వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా రామారావు గారితో చేసిన ఇంటర్వ్యూలు, ఆయనతో వున్న అనుభవాలతో భగీరథ “మహానటుడు , ప్రజా నాయకుడు – ఎన్ .టి .ఆర్ ” అన్న పుస్తకాన్ని వెలువరించారు. ఈ పుస్తకాన్ని శుక్రవారం (19 ఆగస్టు-2022) రోజు వెంకయ్య నాయుడుని హైదరాబాద్ లో కలసి బహూకరించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు ఎన్ .టి .ఆర్ తో తనకున్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు . సినిమా రంగంలోనూ , రాజకీయ రంగంలోనూ ఎన్ .టి .ఆర్ చెరిగిపోని ముద్ర వేశారని , ఆయన ఎప్పటికీ స్ఫూర్తి ప్రదాత అని పేర్కొన్నారు. మహా నటుడు ,…

చంద్ర సిద్దార్థ సోదరులు…దర్శకుడు, ఛాయాగ్రాహకుడు రాజేంద్ర ప్రసాద్ ఇకలేరు

చంద్ర సిద్దార్థ సోదరులు...దర్శకుడు, ఛాయాగ్రాహకుడు రాజేంద్ర ప్రసాద్ ఇకలేరు

ప్రముఖ ఛాయాగ్రాహకులు, దర్శక – నిర్మాత రాజేంద్ర ప్రసాద్ నేడు తుదిశ్వాస విడిచారు. విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల మన్ననలు అందుకున్న ‘ఆ నలుగురు’ సహా తెలుగు చిత్రాలు తీసిన దర్శకులు చంద్ర సిద్ధార్థకు ఈయన సోదరులు. తెలుగు సినిమా ‘నిరంతరం’ (1995)కు రాజేంద్ర ప్రసాద్ దర్శక నిర్మాత రచయిత. ‘నిరంతరం’ సినిమా మలేషియాలోని కైరో చలన చిత్రోత్సవాలకు ఎంపిక అయ్యింది. పలువురి ప్రశంసలు అందుకుంది. హాలీవుడ్‌లో ‘మన్ విమన్ అండ్ ది మౌస్’, ‘రెస్డ్యూ – వేర్ ది ట్రూత్ లైస్’ ‘ఆల్ లైట్స్, నో స్టార్స్’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు అన్నిటికీ ఆయనే సినిమాటోగ్రఫీ, రైటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. తెలుగులో ‘మేఘం’, ‘హీరో’ సహా పలు చిత్రాలకు రాజేంద్ర ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా సేవలు అందించారు. హిందీ సినిమాలు కూడా…

స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాలి : ఆలేరు శ్రీ రామకృష్ణ విద్యాలయంలో ఘనంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవం!

స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాలి : ఆలేరు శ్రీ రామకృష్ణ విద్యాలయంలో ఘనంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవం!

యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు శ్రీ రామకృష్ణ విద్యాలయంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా జరిగింది. 75 మీటర్ల పొడవైన త్రివర్ణ పతాకంతో పాటు 75 పతాకాలను విద్యార్థులు చేతబూని పట్టణ వీథుల్లో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ బండిరాజుల శంకర్ మాట్లాడుతూ ఎందరో వీరులు ప్రాణాలర్పించి సంపాదించి పెట్టిన స్వాతంత్ర్యాన్ని తిరిగి కోల్పోకుండా కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి భారతీయునిపై ఉందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకర్షించాయి. కార్యక్రమంలో జయమ్మ, భిక్షపతి, పరమేశ్వరి, వాణిశ్రీ,, అన్నపూర్ణ, శ్రీధర్, భీమేశ్, విద్యార్థులు, పోషకులు పాల్గొన్నారు.

‘ఆజాది కా గౌరవ్ పాదయాత్ర’లో పాల్గొన్న సునీత రావు

'ఆజాది కా గౌరవ్ పాదయాత్ర'లో పాల్గొన్న సునీత రావు

శనివారం ఉమ్మడి నల్లగొండ జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం ఆజాది కా గౌరవ్ పాదయాత్ర యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం నుండి చౌటుప్పల్ వరకు పాదయాత్రలో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీతరావు పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా వజ్రోత్సవాలలో భాగంగా శనివారం పాదయాత్రలో పాల్గొనడం జరిగింది, ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ, హైదరాబాద్ ప్రెసిడెంట్ వరలక్ష్మి, స్టేట్ సెక్రెటరీ పావని జిల్లా వైస్ ప్రెసిడెంట్ పద్మ , లక్ష్మి, సుబాషిని, శభాన బుజ్జి ,అమృత, శ్రీ లత, అనిత, రాణి స్వప్న మొదలగువారు పాల్గొన్నారు,

కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడం మా ద్యేయం : యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ

కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడం మా ద్యేయం : యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ

యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆలేరు ఇందిర కాంగ్రెస్ భవన్ లో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ అధ్యక్షతన జిల్లా రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది, ఈ సందర్బంగా ప్రతి మండల పార్టీ అధ్యక్షురాలు మండల కమిటీలు, గ్రామ కమిటీలు బూత్ కమిటీలు వేయాలని సూచించడం జరిగింది, రాబోయే కాలం ఎలక్షన్ టైం కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని టిఆర్ఎస్-బిజెపిలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించి బిజెపి టిఆర్ఎస్ ప్రజలను మోసం చేసిన విధానాలను, పెంచుతున్న పెట్రోల్ గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరల గురించి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా చేస్తున్న మోసాన్ని గురించి గడపగడపకు తెలియజేయాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది,…

‘మీలో ఒకడు’ చిత్రానికి పాజిటివ్ టాక్ !

meelo okadu movie hero

టాలీవుడ్‌లో మ‌రో సినిమా హిట్ కొట్టింది. శ్రీమ‌తి చిన్ని కుప్పిలి సమర్పణలో శ్రీ సూర్యనారాయణ క్రియేషన్స్‌పై లయన్ కుప్పిలి శ్రీనివాస్ హీరోగా నటిస్తూ, నిర్మించిన‌ చిత్రం ”మీలో ఒకడు”. సీనియ‌ర్ న‌టుడు సుమ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. తాజాగా ఈ సినిమా (శుక్ర‌వారం) విడుద‌లై థియేట‌ర్‌ల‌లో సంద‌డి చేస్తోంది. ఫ‌స్ట్ డే ఈ మూవీ పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. హైదరాబాద్ మూసాపేట్ లక్ష్మీకళా థియేటర్ వద్ద ప్రేక్షకులు ప్రశంసల జల్లు కురిపించడంతో, చిత్రయూనిట్ టీం బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. రిలీజ్ అయిన అన్ని సెంటర్ ల నుంచి పాజిటివ్ సొంతం చేసుకోవ‌డంతో సినిమాను ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కు కుప్పిలి శ్రీనివాస్ ధ‌న్య‌వాదాలు తెలిపారు.యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ‘మీలో ఒకడు’ ఒక మంచి మెసెజ్ ఇచ్చిందంటూ సినిమాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. సెన్సార్ స‌భ్యులతో ప్ర‌శంస‌లు అందుకుని U/A…

బాలీవుడ్ లో కెరియర్ స్టార్ట్ చేసి టాలీవుడ్ లో బిజీ అయిన ‘మధు నంబియార్’

బాలీవుడ్ లో కెరియర్ స్టార్ట్ చేసి టాలీవుడ్ లో బిజీ అయిన 'మధు నంబియార్'

తెలుగు సినిమాల్లో ఏ పాత్ర ఇచ్చినా అందులో పూర్తిగా ఒదిగిపోతూ టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంటున్న నటుడు మధు నంబియార్. తాజాగా తను సైంటిస్ట్ పాత్రలో నటించిన చిత్రం “గంధర్వ”. యఎస్‌.కె. ఫిలిమ్స్, ఫ‌న్నీ ఫాక్స్ ఎంట‌ర్‌ టైన్‌మెంట్ పతాకంపై సందీప్ మాధ‌వ్‌, గాయ్ర‌తి ఆర్‌. సురేష్ జంట‌గా అప్స‌ర్ దర్శకత్వం లో సుభాని ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ నెల 8 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన అన్ని థియేటర్స్ లలో విజయవంతంగా ప్రదర్శింప బడుతున్న సందర్బంగా ఈ చిత్రంలో సైంటిస్ట్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించిన నటుడు మధు నంబియార్ పాత్రికేయ మిత్రులతో తన కెరీర్ గురించి.. ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి తెలియచేశారు. ఈ సందర్భంగా మధు నంబియార్ మాట్లాడుతూ.. నాకు చిన్నప్పటి నుండి సినిమాలు అంటే చాలా…

దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఘన నివాళి

YSR TELANGANA PARTY

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి 73వ జయంతి పురస్కరించుకుని హైద్రాబాద్ లోని రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బుద్వేల్, శివరాం పల్లి చౌరస్తాలోని దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు వైఎస్సార్ తెలంగాణ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మధు మోహన్ రెడ్డ్డి , రాజేంద్రనగర్ నియోజకవర్గం కన్వీనర్ రాఘవరెడ్డి, చేవెళ్ల నియోజకవర్గం కన్వీనర్ దయానంద్, రాష్ట్ర నాయకుడు సదాల శ్రీనివాస్ రెడ్డి, చైతన్య రెడ్డి, రవీందర్ గౌడ్, జహంగీర్, శానవ్వాజ్, అమీన్ భాయ్, యూనుస్ లు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం జీహెచ్ ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు చీరలు, ఆదర్శకాలనీ అంగన్ వాడీ సెంటర్ లో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోట్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్బంగా SHAHNAWAZ KHAN (rajendra nagar division president) మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి…

బాలమురళీ నాద మహోత్సవ్ 2022

బాలమురళీ నాద మహోత్సవ్ 2022

బాలమురళీ నాద మహోత్సవ్ 2022 డా.ఎం.బాలమురళీకృష్ణ యొక్క సంగీత మరియు జీవిత సంఘటనలను గుర్తుచేసింది. డా.ఎం.బాలమురళీకృష్ణ 92వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నైలో సంగీత విద్వాంసుల కలయిక జరిగింది. భారతీయ విద్యాభవన్ మరియు SSVM సంస్థలతో కలిసి Dr.M. బాలమురళీకృష్ణ మెమోరియల్ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రముఖ మృదంగం ఘాతకుడు డాక్టర్ T.K. మూర్తి, వయోలిన్ విద్వాన్ శ్రీ ఎం. చంద్రశేఖరన్ మరియు ఘటం శ్రీ విక్కు వినాయక్‌ రామ్ లను వరుసగా 2020, 2021 & 2022 సంవత్సరాలకు గాను డా.ఎం.బాలమురళీకృష్ణ నేషనల్ అవార్డ్ ఫర్ ఆర్టిస్టిక్ ఎక్సలెన్స్, మురళీ నాద లహరి బిరుదు మరియు ఒక్కొక్కరికి లక్ష రూపాయల నగదు పురస్కారం తో సత్కరించింది. ప్రముఖ సంగీత విద్వాంసుడు డా.టి.వి.గోపాలకృష్ణన్ అధ్యక్షత వహించిన బాలమురళి నాద మహోత్సవం కార్యక్రమంలో శ్రీ కె.ఎన్. రామస్వామి, డైరెక్టర్,…

షూటింగ్ పూర్తి చేసుకున్న” ద్రౌపది”( నాకు కూడా ఐదుగురే )

షూటింగ్ పూర్తి చేసుకున్న" ద్రౌపది"( నాకు కూడా ఐదుగురే )

చతుర శ్రీ సమర్పించు శ్రీ సంతోషి మా క్రియేషన్స్, శ్రీశ్రీశ్రీ మహమ్మాయి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రం “ద్రౌపది” తిన్నామా పడుకున్నామా తెల్లారిందావంటి హిట్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు రామ్ కుమార్ నేతృత్వంలో సాక్షి ప్రధాన పాత్రలో నూతన నిర్మాత బొడ్డుపల్లి బ్రహ్మచార్య నిర్మిస్తున్న ద్రౌపది చిత్రం ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రామ్ కుమార్ మాట్లాడుతూ పూర్తి కమర్షియల్ వ్యాల్యూ తో రూపొందించిన లేడీ ఓరియంటెడ్ సబ్జెక్టు ఇది ద్వాపర యుగములో అప్పటి పరిస్థితులను బట్టి ద్రౌపతి జీవన విధానం అందరికీ తెలిసిందే ఇప్పటి ఈ కలియుగంలో ఓ స్త్రీ ద్రౌపతిగా ఎలా మారింది ఆమె అలా మారటానికి ప్రేరేపించిన పరిస్థితి ఏంటి అనేది ఈ చిత్ర కథాశం .ఈ చిత్రంలో మూడు పాటలు ఉంటాయి ఈ…