భగీరధకు భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందన

భగీరధకు భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందన
భగీరధకు భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందన
Spread the love

సీనియర్ జర్నలిస్ట్ ,రచయిత భగీరథను భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అభినందించారు . మహానటుడు, తెలుగు దేశం వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా రామారావు గారితో చేసిన ఇంటర్వ్యూలు, ఆయనతో వున్న అనుభవాలతో భగీరథ “మహానటుడు , ప్రజా నాయకుడు – ఎన్ .టి .ఆర్ ” అన్న పుస్తకాన్ని వెలువరించారు. ఈ పుస్తకాన్ని శుక్రవారం (19 ఆగస్టు-2022) రోజు వెంకయ్య నాయుడుని హైదరాబాద్ లో కలసి బహూకరించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు ఎన్ .టి .ఆర్ తో తనకున్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు . సినిమా రంగంలోనూ , రాజకీయ రంగంలోనూ ఎన్ .టి .ఆర్ చెరిగిపోని ముద్ర వేశారని , ఆయన ఎప్పటికీ స్ఫూర్తి ప్రదాత అని పేర్కొన్నారు. మహా నటుడు , ప్రజానాయకుడు ఎన్ .టి .ఆర్ శత జయంతి సందర్భంగా ఆయన మీద ఓ పుస్తకాన్ని వెలువరించిన జర్నలిస్ట్ , రచయిత భగీరధను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందించారు .