ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మళ్ళీ రావా’, థ్రిల్లర్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విభిన్న కథలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో రూపుదిద్దుకున్న మూడో చిత్రం ‘మసూద’. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రంతో సాయికిరణ్‌ని దర్శకుడిగా పరిచయం చేశారు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా. నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ హారర్ డ్రామా.. విడుదలైన మొదటి ఆట నుండి పాజిటివ్ టాక్‌తో ప్రేక్షకుల నుంచి భారీ స్పందనను రాబట్టుకుంటోంది. రోజురోజుకూ కలెక్షన్స్ పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ చిత్రాన్ని ఎస్‌విసి బ్యానర్ ద్వారా తెలుగు రాష్ట్రాలలో విడుదల చేసిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. చిత్రయూనిట్‌తో హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో…
Category: MOVIE REVIEWS
‘శంకరాభరణం’ చిత్రానికి మరో అరుదైన గౌరవం !!
గోవాలో జరిగే 53వ IFFI – 2022 లో “శంకరాభరణం” చిత్రం Restored Indian Classics విభాగంలో ఎంపికయ్యంది. National Film Archives of India వారు మన దేశంలొని గొప్ప చిత్రాలను డిజిటలైజ్ చేసి , భద్ర పరిచే కార్యక్రమంలొ భాగంగా తెలుగులో విశేష ఆదరణ పొందిన, కళా తపస్వి శ్రి. కే. విశ్వనాథ్ దర్శకత్వంలో పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ ఏడిద నాగేశ్వరావు నిర్మించిన “శంకరాభరణం” చిత్రం చోటుచేసుకుంది . అలా చేసిన చిత్రాల్లో కొన్ని ఈ చిత్రోత్సవంలొ ప్రదర్శిస్తున్నారు . అందులో తెలుగుచిత్రం ‘శంకరాభరణం’ ఒకటి. ఈ ప్రదర్సనకి ఈ చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరావు కుమారుడు ఏడిద రాజా ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతారు.
అన్నయ్య చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు : పవన్ కళ్యాణ్
తెలుగు చలన చిత్రసీమలో శిఖర సమానులు, అన్నయ్య శ్రీ చిరంజీవి గారిని ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022’ పురస్కారం వరించడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో భాగంగా భారత ప్రభుత్వం ప్రకటించిన ఈ పురస్కారం అన్నయ్య కీర్తి కిరీటంలో చేరిన మరొక వజ్రం. ఈ ఆనంద సమయంలో నా మార్గదర్శి అన్నయ్య చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. నాలుగు దశాబ్దాలుపైబడిన అన్నయ్య సినీ ప్రస్థానం, తనను తాను మలచుకొని ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థానం సంపాదించుకోవడం నాతో సహా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. అంతర్జాతీయ చలన చిత్ర వేదికపై అన్నయ్య చిరంజీవి గారికి ఈ గౌరవం దక్కుతున్నందుకు ఎంతో ఆనందిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
Kiran Kumar Is Debuting As Director With Crime Thriller ‘Jaan Say’
Currently, Telugu Film Industry is in a new phase. Audiences are loving to watch movies with new stories made with good quality. New Directors who are coming with fresh subjects are creating good impact in Tollywood. S. Kiran Kumar is such a director who is not related to film industry is making his directorial debut out of pure passion towards cinema. Krithi Entertainment Productions is producing a film as Production No 1 titled ‘Jaan Say’. S Kiran Kumar is directing the film along with providing Story and Screenplay. YAS. Vishnavi…
నూతన దర్శకుడు కిరణ్ కుమార్ దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ‘జాన్ సే’
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ ఒక కొత్త ఫేజ్ లో ఉంది. కొత్త తరహా కథాంశాలతో క్వాలిటీ గా రూపొందుతున్న సినిమాలను ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. సినిమా పట్ల నిబద్దతతో ఫ్రెష్ సబ్జెక్ట్స్ తో వస్తున్న కొత్త దర్శకులు తమ సత్తా చాటుతున్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమతో ఎటువంటి సంబంధం లేని కేవలం సినిమా మీద ప్యాషన్ తో దర్శకుడిగా అడుగుపెడుతున్నారు ఎస్. కిరణ్ కుమార్. కృతి ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ No 1 గా ‘జాన్ సే’ టైటిల్ తో కిరణ్ కుమార్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం లో రూపొందిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ డ్రామా గా తెరకెక్కుతున్న జాన్ సే లో యువ జంట అంకిత్, తన్వి హీరో హీరోయిన్లు గా నటిస్తున్నారు. థ్రిల్లింగ్ అంశాలతో పాటు లవ్ స్టొరీ కూడా…
కె.జి.యఫ్, కాంతారా సినిమాలంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న ‘రణస్థలి’ ట్రైలర్
ధర్మ,బసవ & సురెడ్డి విష్ణు సమర్పణలో ఏ.జె ప్రొడక్షన్ పతాకంపై ధర్మ(హీరో)చాందిని రావు (హీరోయిన్ )ప్రశాంత్, శివ జామి, అశోక్ సంగా, నాగేంద్ర , విజయ్ రాగం నటీనటులుగా పరశురాం శ్రీనివాస్ దర్శకత్వములో అనుపమ సూరెడ్డి నిర్మించిన చిత్రం “రణస్థలి”.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 26 న గ్రాండ్ విడుదలకు సిద్దమైన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియో వారు రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ చేతుల మీదుగా “రణస్థలి” ట్రైలర్ ను విడుదల చేయించడం జరిగింది.. డీఫ్రెంట్ కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న రణస్థలి ట్రైలర్ చూస్తుంటే కె. జి. యఫ్, కాంతారా సినిమాలు ప్రేక్షకులకు ఎలాంటి వైబ్రేషన్ ఇచ్చిందో అలాంటి వైబ్రేషన్ ఈ రణస్థలిలో కనిపిస్తుంది. ఆ సినిమాల స్థాయిలో ఉహించుకొన్న విదంగానే ఈ సినిమా వుంటుంది. ఈసినిమాలో…
దర్శకుడు మదన్ కన్నుమూత
‘ఆ నలుగురు’ చిత్రంతో రచయితగా గుర్తింపు పొంది, ఆపై దర్శకుడిగా మారిన మదన్ (రామిగని మదన్ మోహన్ రెడ్డి) శనివారం నవంబర్ 20 తెల్లవారుజామున 1 గంట 41 నిమిషాలకి కన్నుమూశారు. తెలుగులో అనేక సినిమాలుకు దర్శకుడిగా వ్యవహరించిన మదన్ హఠాన్మరణం పాలవడంతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. మదన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో నాలగు రోజుల కిత్రం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. అయితే పరిస్థితి విషమించడంతో శనివారం తుదిశ్వాస విడిచారు. చిత్తూరు జిల్లా మదనపల్లె లో జన్మించిన మదన్ పూర్తి పేరు ఆర్.మదన్ మోహనరెడ్డి. రాజేంద్రప్రసాద్ హీరోగా రూపొందిన ఆ నలుగురు (2004) చిత్రంతో ఆయన రచయితగా పరిచయమయ్యారు. ఆ తర్వాత జగపతిబాబు, ప్రియమణి జంటగా నటించిన పెళ్లయిన కొత్తలో(2006), చిత్రంతో దర్శకుడిగా మారారు. ఉదయ్‌కిరణ్ హీరోగా…
సాయి ధన్సిక పుట్టినరోజు సందర్భంగా ‘దక్షిణ’ మోషన్ పోస్టర్ విడుదల
‘కబాలి’ ఫేమ్ సాయి ధన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతోన్న లేడీ ఓరియెంటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘దక్షిణ’. ఛార్మీ కౌర్ ప్రధాన పాత్రలో విజయవంతమైన మహిళా ప్రాధాన్య చిత్రాలు ‘మంత్ర’, ‘మంగళ’ తీసిన ఓషో తులసీరామ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రాన్ని కల్ట్ కాన్సెప్ట్స్ పతాకంపై అశోక్ షిండే నిర్మిస్తున్నారు. ఆదివారం (నవంబర్ 20న) సాయి ధన్సిక పుట్టినరోజు. ఈ సందర్భంగా మోషన్ పోస్టర్ విడుదల చేశారు. చిత్ర నిర్మాత అశోక్ షిండే మాట్లాడుతూ ”సాయి ధన్సిక, ఓషో తులసీరామ్ కలయికలో సినిమా చేయడం సంతోషంగా ఉంది. మా హీరోయిన్ సాయి ధన్సిక గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆవిడ పేరు చెబితే ‘కబాలి’ గుర్తుకు వస్తుంది. ఈ సినిమా తర్వాత ఆమెను ‘దక్షిణ’ ఫేమ్ ధన్సిక అంటారు. ఆవిడ రోల్ అంత పవర్ ఫుల్ గా ఉంటుంది.…
‘రణస్థలి’ సెన్సార్ పూర్తి
ధర్మ,బసవ & సురెడ్డి విష్ణు సమర్పణలో ఏ.జె ప్రొడక్షన్ పతాకంపై ధర్మ(హీరో)చాందిని రావు (హీరోయిన్ )ప్రశాంత్, శివ జామి, అశోక్ సంగా, నాగేంద్ర , విజయ్ రాగం నటీనటులుగా పరశురాం శ్రీనివాస్ దర్శకత్వములో అనుపమ సూరెడ్డి నిర్మించిన చిత్రం “రణస్థలి”.ఈ చిత్రం విజయవంతంగా షూటింగ్ పూర్తి చేసుకున్న మా సినిమాకు సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న సందర్బంగా.. చిత్ర నిర్మాత అనుపమ సూరెడ్డి మాట్లాడుతూ.. షూటింగ్ పూర్తి చేసుకున్న మా రణస్థలి చిత్రానికి సెన్సార్ సభ్యులు సినిమా చూసి క్లీన్ ఎ సర్టిఫికెట్ పొందటం ఎంతో ఆనందంగా ఉంది. సినిమా చూసిన సభ్యుల బృందం నాతోపాటు మా టీమ్‌తో మాట్లాడుతూ కొత్త డైరెక్టర్ అయినా పరశురాం గారు చాలా బాగా డైరెక్ట్ చేశారు, వయలెన్స్ బ్యాక్ డ్రాప్ తో చాలా బాగా తీశారు. డైలాగ్స్ చాలా…
తెలుగులో మలయాళ సంచలనం ‘జయ జయ జయ జయహే’
బేసిల్ జోసెఫ్, దర్శన రాజేంద్రన్ జంటగా విపిన్ దాస్ దర్శకత్వంలో రూపొందిన మలయాళ సినిమా ‘జయ జయ జయ జయహే’ ఈ మలయాళ సినిమాను 5 నుంచి 6 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు లక్ష్మీ వారియర్, గణేశ్ మీనన్. అక్టోబర్ 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 40 కోట్ల వరకూ వసూలు చేసింది. ఈ చిత్ర కథాంశంను పరిశీలిస్తే జయ తెలివైన మధ్యతరగతి అమ్మాయి. ఆమె తల్లిదండ్రులు కుమారుడి భవిష్యత్ కోసం ఖరీదైన స్కూల్ లో చేర్పిస్తారు. అయితే జయను మాత్రం తన ఆశలకు వ్యతిరేకంగా ఇంటి దగ్గరలో చేరుస్తారు. అందుకే తల్లిదండ్రులపై అప్పుడప్పుడు తిరుగుబాబు చేస్తూ ఉంటుంది జయ. దాంతో చదువు పూర్తి కాకముందే ఆమెకు పెళ్ళి చేయాలనుకుంటారు తల్లిదండ్రులు. పౌల్ట్రీ యజమాని రాజేష్ ను జయకు సరైన వరుడుగా…
