2023లో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా లెజెండరీ శ్రీ నందమూరి తారక రామారావు గారి ప్రతిష్ఠాపన మరియు ప్రారంభోత్సవం కోసం NJలోని ఎడిసన్ సిటీలో ఒక ప్రధాన భూమిని కేటాయించడానికి ఎడిసన్ సిటీ మేయర్ సమ్మతి తెలిపారని తెలియజేసేందుకు మేము సంతోషిస్తున్నాము. లెజెండరీ శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు సినిమా యొక్క అత్యంత ప్రసిద్ధ మరియు గౌరవనీయమైన వాళ్లలో నిస్సందేహంగా ఒకరు. అతని నాయకత్వం అతన్ని భారతదేశపు గొప్ప నాయకులలో ఒకరిగా చేసింది. ఇటీవల ఎడిసన్ నగరం ఒక నిర్దేశిత ప్రాంతంలో ప్రపంచ నాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేయడానికి చొరవ చూపింది. మెజారిటీ తెలుగువారు తమ US ప్రయాణాన్ని సిటీ ఆఫ్ ఎడిసన్ నుండి ప్రారంభించారు మరియు న్యూయార్క్ నగరంలో చాలా మంది తెలుగువారి పనికి ఆతిథ్యం ఇస్తున్నారు. లెజెండరీ శ్రీ ఎన్టీఆర్‌కి అక్కడ ఉన్న…
Category: MOVIE REVIEWS
శ్రీకాంత్ శ్రీరామ్ హీరోగా సైకాలాజికల్ థ్రిల్లర్ ప్రారంభం !!!
కె. యస్. ఆర్ ప్రజెంట్స్ ఉదయ్ & రవి క్రియేషన్స్ పతాకంపై శ్రీకాంత్ శ్రీరామ్ హీరోగా , హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్ గా , కమల్ కామరాజు, అజయ్ ఇతర పాత్రల్లో డాక్టర్ రవికిరణ్ గాడలే దర్శకత్వంలో డాక్టర్ ఉదయ్ కె. రెడ్డి పాల్వాయ్, డాక్టర్ శ్రీధర్ రెడ్డి కరెడ్డి లు నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని రామానయుడు స్టూడియో లో ఘనంగా జరుపుకుంది. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ సుధీర్ వర్మ క్లాప్ కొట్టగా జార్జి రెడ్డి హీరో సందీప్ మాధవ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకులు డాక్టర్ రవికిరణ్ గౌరవ దర్శకత్వం వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో… చిత్ర దర్శకుడు డాక్టర్ రవికిరణ్ గాడలె మాట్లాడుతూ…ఈ…
‘చెడ్డి గ్యాంగ్ తమాషా’ ట్రైలర్ విడుదల చేసిన బ్రహ్మానందం
అబుజా ఎంటర్టైన్మెంట్స్ మరియు శ్రీ లీల ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సి హెచ్ క్రాంతి కిరణ్ నిర్మాణ సారధ్యం లో, వెంకట్ కళ్యాణ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం చెడ్డీ గ్యాంగ్ తమాషా. గాయత్రి పటేల్ హీరోయిన్. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన హాస్యబ్రహ్మ పద్మశ్రీ బ్రహ్మానందం ట్రైలర్ ను విడుదల చేశారు. నిర్మాత క్రాంతి కిరణ్ మాట్లాడుతూ: సినీ నిర్మాత అనేవాడు రైతు లాంటి వాడు. మా డబ్బులతో మీకు వినోదాన్ని ఇచ్చే టందుకు కృషి చేస్తాము. మేము చేస్తున్న ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. సినిమా మిమ్మల్ని అలరిస్తుంది. అందరికి నచ్చే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి చెడ్డి గ్యాంగ్ తమాషా పార్ట్2 కూడా ఉంటుంది.ఆన్నీ కుదిరితే పార్టీ…
సత్యం రాజేష్ హీరోగా చిత్రం
తెలుగులో ఎన్నో చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న సత్యం రాజేష్ హీరోగా మధు సూదన్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా డిసెంబర్ 21న లాంఛనంగా ప్రారంభం కానుంది. ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా లో ఎమోషన్స్, లవ్, సెంటిమెంట్ ఉండబోతున్నాయి. రుద్రవీణ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న మధుసూదన్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండడం విశేషం. రియా సచ్చదేవా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో పలువురు నోటెడ్ ఆర్టిస్ట్స్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. త్వరలో ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ విడుదల కానున్నాయి. మంచి కథ కథనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని రూపొందిందబడుతుంది. ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు చిత్ర యూనిట్ త్వరలో తెలియజేయనున్నారు.
అంగరంగ వైభవంగా పదోవ ‘కుటుంబ కళోత్సవం’వార్షికోత్సవం
తెలంగాణ మూవీ, ఆర్టిస్ట్ యూనియన్ పదోవ ” కుటుంబ కళోత్సవం ” వార్షికోత్సవ ఉత్సవాలు కన్నుల పండుగగా ఆదివారం రవీంద్రభారతిలో నిర్వహించడం జరిగింది. సంస్కృత కార్యక్రమాలు,డాన్సులు, కళా పోషక నృత్యాలు తదితర కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా లాంగ్వేజ్,కల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ పాల్గొని ప్రసంగించారు…సినిమాకు కులం మతం, ప్రాంతాలు ఉండవని,ప్రజలకు వినోదాన్ని అందించే సాధనమే సినిమా అని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమా పరిశ్రమ పదికలాలపాటు కొనసాగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. కరోనా ఎఫెక్ట్ సినీ పరిశ్రమను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిందని, దీంతో ఆర్టిస్టులు ఆర్థిక సంక్షోభంలో సతమతమవుతున్నారని వివరించారు.ప్రస్తుతం సినిమా షూటింగులు చాలావరకు తగ్గిపోయాయని, దీనివలన ఆర్టిస్టులు ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాలు సినీ పరిశ్రమలను ఆదుకోవాలని,అప్పుడే జూనియర్…
సూపర్ స్టార్ కృష్ణకు ‘మా ఊళ్లో ఒక పడుచుంది’ చిత్రాన్ని అంకితం చేయడం అత్యంత ముదావహం!!
– ఏ.పి.సినిమాటోగ్రఫీ మినిస్టర్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ – ప్రపంచ సినిమా చరిత్రలో షూటింగ్ కంటే ముందు పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్నమొట్టమొదటి చిత్రం!! విజయ్ సినీ క్రియేషన్స్ పతాకంపై వీరు.కె.రెడ్డి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సోమా విజయ్ ప్రకాష్ నిర్మిస్తున్న వినూత్న కథాచిత్రం “మా ఊళ్లో ఒక పడుచుంది”. దెయ్యమంటే భయమన్నది ఉప శీర్షిక. షూటింగ్ కంటే ముందు ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని, ప్రపంచ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈనేథ్యంలో భారత్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఈ రికార్డును నమోదు చేసి, ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చేతుల మీదుగా ధృవీకరణ పత్రం అందజేసింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో జరిగిన ఈ వేడుకలో నిర్మాత సోమా విజయ్ ప్రకాష్, దర్శకులు వీరు కె.రెడ్డి, ప్రముఖ…
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై రాసిన ‘ది రియల్ యోగి’ పుస్తకాన్ని లాంచ్ చేసిన మెగా బ్రదర్ నాగబాబు
‘ది రియల్ యోగి’ పుస్తకాన్ని ఒక కామన్ పాయింట్ అఫ్ వ్యూలో కళ్యాణ్ బాబు గురించి రచయిత గణ అద్భుతంగా రాశారు. కళ్యాణ్ బాబు గురించి నేను ఏం అనుకుంటానో దగ్గరదగ్గరగా అలానే రాశాడు గణ. అందుకే ఈ పుసక్తం ఇంకా నచ్చింది” అన్నారు మెగా బ్రదర్ నాగబాబు. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై యువ రచయిత గణ రాసిన ‘ది రియల్ యోగి’ బుక్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. మెగా బ్రదర్ నాగబాబు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దర్శకులు మెహర్ రమేష్, బాబీ కొల్లి, తనికెళ్ళ భరణి, పుస్తక రచయిత గణ, శ్రీకాంత్ రిష, సాహి సురేష్ శైలా తాళ్లూరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ.. ‘ది రియల్ యోగి’ పుస్తకాన్ని చదివాను.…
Actress Anjalali : హీరోయిన్ అంజలి పెళ్లి వార్తల్లో నిజమెంత?!
నెటిజనులు ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వారు తెగ పోస్టులు పెడుతూ సోషల్ మీడియాని బాగా వేడెక్కిస్తున్నారు. ఆ పోస్టుల ద్వారా అందర్నీ ఆకర్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్ట్రా గ్రామ్, యూ ట్యూబ్.. ఇలా ఒకటా..రెండా ఎన్నో చోట్లా నచ్చిన పోస్టులను బాగా వైరల్ చేసేందుకు సోషల్ మీడియాని వాడేస్తున్నారు. ఇక అసలు విషయానికొద్దాం.. ‘సీతమ్మ’కు సినిమా కష్టాలు మళ్లీ మొదలయ్యాయట. ‘సీతమ్మ’ అంటే మీరు ఎవరో అనుకునేరు! అదేనండీ.. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ హీరోయిన్ అంజలి. ఇప్పుడు మనం మాట్లాడుకునున్నది కూడా ఆమె గురించే మరి! కథానాయిక అంజలికి పెళ్లైపోయిందని సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ తాజా కబురు బాగా వైరల్ కూడా అవుతోంది. ఇప్పుడు ఎక్కడ విన్నా.. ఎక్కడ చూసినా హీరోయిన్…
‘బలగం’ అందరూ మెచ్చే సినిమా అవుతుంది : స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు
దిల్‌రాజు ప్రొడక్షన్స్ శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మిస్తోన్న సినిమా ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ ప్రెస్ మీట్‌లో … స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘నేను నిర్మాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ స్టార్ట్ చేసిన్పపుడు కొత్తలో కొత్త దర్శకులను, ఆర్టిస్టులును, టెక్నీషియన్స్‌ని ఇంట్రడ్యూస్ చేశాం. తర్వాత ఏమైందంటే ఎదుగుతున్న క్రమంలో రాజుగారి దగ్గరికి వెళితే పెద్ద సినిమాలే చేస్తారు, ఇలాగే ఉంటారంటూ వార్తలు వచ్చి కొత్త కాన్సెప్ట్ సినిమాలకు బ్రేక్ వస్తుంది. మారుతున్న ట్రెండ్‌కి అనుగుణంగా ఉండాలనే ఉద్దేశంతోనే మా నెక్ట్స్ జనరేషన్ సినీ ఇండస్ట్రీలోకి వచ్చారు. అందులో భాగంగానే దిల్‌రాజు ప్రొడక్షన్ స్టార్ట్…
హీరో విజయ్ కోసం రంగంలోకి పవన్ కళ్యాణ్!!
తమిళ ఇండస్ట్రీలో అత్యధిక మార్కెట్ తో కొనసాగుతున్నహీరో ఎవరంటే.. విజయ్ అని ఇట్టే చెప్పేస్తారు. అంతటి క్రేజ్ అతడిది. అత్యధిక పారితోషికంతో తమిళ ఇండస్ట్రీలోతనకంటూ ఓ చెక్కుచెదరని మార్కెట్ ని సృష్టించుకున్నాడు. తమిళ హీరో విజయ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టాయి. అందుకే అతడి దృష్టి ఇప్పుడు తెలుగు మార్కెట్ పై పడింది. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి విజయ్ సిద్ధమవుతున్నట్టు తెలిసింది. టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తన తాజా చిత్రం ‘వారసుడు’ తన గత సినిమాలకు మించిన స్థాయిలో సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడని సమాచారం. ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ టాక్ బాగా వైరల్ గా మారింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రం కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను…
