జర్నలిస్టు రఘు అక్రమ అరెస్టుపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసిన జర్నలిస్టు సంఘాలు

పోలీసులపై చర్యలు తీసుకోవాలి. రఘును వెంటనే విడుదల చేసి కేసులు ఎత్తివేయాలని డిమాండ్జర్నలిస్టు రఘును అక్రమంగా, దౌర్జన్యంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిన పోలీసులపై పలు జర్నలిస్టు సంఘాలు మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశాయి. రఘుపై అక్రమ కేసులు బనాయించి తీవ్రవాదిలా అరెస్టు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్), టీ జర్నలిస్టుల ఫోరం నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, టీ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు పల్లె రవికుమార్, సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి తదితరులతో కూడిన ప్రతినిధి బృందం హెచ్చార్సీ కార్యదర్శి విద్యాదర్ భట్ కు ఫిర్యాదు పత్రం అందజేశారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టు రఘుపై అక్రమ కేసులు బనాయించి, అరెస్టు చేయడం, అందులో…

బాల్క సుమన్ తండ్రి స్వర్గీయ బాల్క సురేష్ చిత్ర పటానికి సీఎం కేసీఆర్ నివాళులు

జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం రేగుంట గ్రామంలోని చేన్నూరు శాసన సభ్యులు, విప్ శ్రీ బాల్కసుమన్ గారి ఇంటికి హైదరాబాద్ నుండి రోడ్డు మార్గంద్వారా చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకంట్ల చంద్రశేఖర్ రావు. ఇటీవల స్వర్గస్తులైన బాల్క సుమన్ గారి తండ్రి స్వర్గీయ బాల్క సురేష్ గారి చిత్ర పటానికి పూలుచల్లి నివాలులు అర్పించి, ఆయన కుటుంబసభ్యులను పరామర్షించిన రాష్ట్ర ముఖ్యమంత్రి. అనంతరం జిల్లాలో కరోనా పరీస్థితులను గురించి జిల్లా కలెక్టర్ జి. రవి గారిని అడుగగా, జిల్లాలో లాక్ డౌన్ వలన కేసులు చాలా తగ్గుముఖం పట్టాయని, లాక్ డౌన్ పటిష్టంగా అమలు చెస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. కార్యక్రమ ఏర్పాట్లను కమీషనర్ ఆఫ్ పోలీస్ వి. కమలాసన్ రెడ్డి, ఐజి వై. నాగిరెడ్డి, జగిత్యాల కలెక్టర్ జి. రవి, ఎస్పి శ్రీమతి సిందుశర్మ,…

వైఎస్ షర్మిల ఏర్పాటు చేయబోయే పార్టీకి హైదరాబాద్ జిల్లా సన్నాహక కమిటీ సభ్యునిగా మిడతనపల్లి విజయ్

బుధవారం లోటస్ పాండ్ లో వైఎస్ షర్మిల ఆధ్యర్యంలో జరిగిన రాష్ట్ర ముఖ్య కార్యకర్తల సమావేశంలో సూర్యాపేట జిల్లా మోతె మండలానికి చెందిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ అధ్యక్షులు మిడతనపల్లి విజయ్, త్వరలో షర్మిల ఆధ్యర్యంలో ఏర్పాటు చేయబోయే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ హైదరబాద్ జిల్లా సన్నాహక కమిటీ సభ్యునిగా వైఎస్ షర్మిల నియమించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ నన్ను హైదరాబాద్ జిల్లా సన్నాహక కమిటీ సభ్యునిగా నియమించిన షర్మిలమ్మ కు కృతజ్ఞతలు తెలిపారు. జూలై 8న మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ‌యంతి రోజున పార్టీ ఆవిర్భావించాల‌ని షర్మిలమ్మ నిర్ణయించార అని, అన్ని వ‌ర్గాల‌ బాగు కోసం స్థాపించ‌బోయే పార్టీకి సంబంధించి జెండా, అజెండా రూప‌క‌ల్ప‌న‌లో భాగంగా రాష్ట్రంలోని ప్ర‌జ‌లంద‌రి నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించాల‌ని భావించాము అని ఇందుకోసం రాష్ట్రంలోని పేద‌లు, యువ‌త‌,…

అందుకే.. ఈ బ్యూటీకి డేటింగ్‌పై నమ్మకం లేదట!

kiyara

కొత్తతరం అమ్మాయినైనా ప్రేమ విషయంలో ఆధునిక భావాల్ని వంటపట్టించుకోనని.. ప్రేమ, పెళ్లి విషయాల్లో తన ఆలోచనా విధానం పూర్తి సంప్రదాయికంగా ఉంటుందని చెప్పింది కియారా అద్వాణీ. ఆమె కథానాయికగా చేసిన హిందీ తాజా చిత్రం ‘ఇందూ కి జవానీ’. డేటింగ్‌ యాప్స్‌ నేపథ్యంలో నేటితరం యువతీయువకుల ఆలోచనారీతుల్ని చూపిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సందర్భంగా కియారా అద్వాణీ మాట్లాడుతూ .. తనకు డేటింగ్‌పై అస్సలు నమ్మకం లేదని చెప్పింది. డేటింగ్‌ యాప్స్‌ సంస్కృతిని నేను ఇష్టపడను. పాతకాలంలో మాదిరిగా స్వచ్ఛమైన, నిజాయితీతో కూడిన ప్రేమపట్ల నాకు విశ్వాసం ఉంది. ప్రేమ విషయంలో నేను పాత ఆచారాల్ని నమ్ముతాను. మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లాడి జీవితాంతం అతనితో కలిసి ఉండాలనుకుంటా’ అని చెప్పుకొచ్చింది కియారా అద్వాణీ. బాలీవుడ్‌తోపాటు ఇటు దక్షిణాదిన కూడా గుర్తింపు దక్కించుకున్న కథానాయిక కియారా…

ఏమాత్రం తీరిక దొరికినా దాన్నే ఆశ్రయిస్తా!

ShrutiHaasan

కథానాయిక శృతిహాసన్‌ సంగీతాభిరుచి గురించి అందరికి తెలిసిందే. స్వర రచనతో పాటు సొంత గళాన్ని వినిపిస్తూ.. ఈ సుందరి కొన్ని ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ రూపొందించి సత్తాచాటుకుంది. నటన, సంగీతం, గానంలో ప్రతిభను చాటుతూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఈ భామ పేరు తెచ్చుకుంది. సంగీతం మన మానసిక శక్తుల్ని పునరుత్తేజం చేసే ఓ దివ్యౌషదమని శృతిహాసన్‌ చెప్పింది… ‘ఏమాత్రం తీరిక దొరికినా సంగీతాన్ని ఆశ్రయిస్తా. మనసులోని ఆందోళనలన్నింటిని మటుమాయం చేసే శక్తి సంగీతానికి ఉంది. ఒకానొక సమయంలో నేను తీవ్రమైన డిప్రెషన్‌కు గురయ్యాను. మనసంతా ఒత్తిళ్లతో నిండిపోయి ఉండేది. ఏం చేయాలో తోచేది కాదు. అప్పుడు సంగీతం నాకు ఓదార్పునిచ్చింది. నేను సాధారణ స్థితికి చేరుకోవడానికి దోహదపడింది. భవిష్యత్తులో కూడా నా సంగీత ప్రయాణాన్ని కొనసాగిస్తా’ అని చెప్పుకొచ్చింది.

అలా చేయడం తమన్నాకు మాత్రమే సాధ్యమయింది!

thamanna-actress

టాలీవుడ్ లో 15 ఏళ్ల అనుభవం తర్వాత కూడా ఇన్ని అవకాశాలు అందుకోవడం తమన్నాకు మాత్రమే సాధ్యమవుతుంది. తమన్నాతో పాటు ఇండస్ట్రీకి వచ్చిన అనుష్క, త్రిష లాంటి వారు ఇప్పటికే బ్యాగ్ సర్దేసి అప్పుడప్పుడు తెరపై కనిపిస్తున్నారు. కానీ తమన్నా మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఇప్పటికీ వరుస అవకాశాలు అందుకుంటోంది ఈ మిల్కీ బ్యూటీ. తాజాగా సత్యదేవ్ లాంటి యంగ్ హీరోతో ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాలో నటిస్తుంది. ఇమేజ్ లో తన కంటే ఎన్నో రెట్లు తక్కువగా ఉన్న సత్యదేవ్ లాంటి అప్ కమింగ్ హీరోతో నటించడానికి ఎలాంటి ఈగో చూపించడం లేదు . అంతేకాదు వెబ్ సిరీస్ లతో కూడా బిజీ అయిపోయింది తమన్నా. ఇప్పటికే ‘లెవెన్త్‌ అవర్’ అనే వెబ్ సిరీస్ లో నటించింది తమన్నా. త్వరలోనే ఈ…

రాశీఖన్నా ఫిట్‌నెస్ విషయాలు ఇవే..!

శరీరం, మనసు రెండింటి మధ్య సమన్వయం కుదిరితేనే ఆనందమయ జీవనం సాధ్యమని..యాభైఏళ్ల వయసొచ్చినా వ్యాయామాన్ని వదిలిపెట్టనని క్రేజీ బ్యూటీ రాశీఖన్నా చెబుతోంది. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటం కోసమే తాను క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తానని చెప్పింది . స్వతహాగా ఫిట్‌నెస్‌ ప్రేమికురాలైన రాశీఖన్నా సోషల్‌మీడియాలో తరచు ఫిట్‌నెస్‌ వీడియోల్ని షేర్‌ చేస్తుంది. “ప్రతి పనిలో ఉత్తమమైన ప్రతిభ కనబరచాలన్నదే నా లక్ష్యం. అది సాధ్యం కావాలంటే శారీరకంగా కూడా శక్తివంతంగా ఉండాలి. ఎవరి మెప్పుకోలు కోసమో వ్యాయాయం చేయాలనుకోను. ఫిట్‌గా ఉంటేనే రోజువారి వ్యవహారాలు కూడా సౌకర్యవంతంగా అనిపిస్తాయి. కెమెరా ముందు కూడా అందంగా, ఆహ్లాదభరితంగా కనిపిస్తాం. మహిళలు ఎక్కువగా బరువులు ఎత్తకూడదనే అపోహ ఉంది. ఓ మోస్తరు బరువులు ఎత్తడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గడంతో పాటు ఎముకలు కూడా బలంగా తయారవుతాయి. శరీరఛాయ…

‘ఇదే నా బెస్ట్‌ టైమ్‌’ అంటోంది పూజా హెగ్డే!

టాలీవుడ్ లో వరుస సూపర్‌ హిట్స్‌ అందుకుంటూ మంచి ఫామ్‌లో ఉన్నారు పూజా హెగ్డే. ఆమె నటించిన ‘అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో’ హిట్స్‌గా నిలిచాయి. అందుకే ‘యాక్టర్‌గా ఇది నా బెస్ట్‌ టైమ్‌’’ అంటున్నారు పూజా హెగ్డే. అంతే కాదు ప్రస్తుతం ప్రభాస్‌తో ‘రాధే శ్యామ్‌’, అఖిల్‌తో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ చిత్రాలు చేస్తున్నారామె. హిందీలో .. సల్మాన్‌ ఖాన్‌తో ‘కభీ ఈద్‌ కభీ దీవాలీ’, రణ్‌వీర్‌ సింగ్‌తో ‘సర్కస్‌’ సినిమాలు చేస్తున్నారు. వరుస విజయాలు, వరుసగా పెద్ద సినిమాల్లో నటించడం గురించి పూజా హెగ్డే చెబుతూ.. ‘‘వృత్తిరీత్యా ఇది నా బెస్ట్‌ టైమ్‌ అనిపిస్తోంది. నేను ఎప్పటినుంచో పని చేయాలనుకుంటున్న అందరితో పని చేయగలుగుతున్నాను. నా కష్టానికి తగ్గ ఫలితం వస్తుందనిపిస్తోంది’’ అన్నారు. ‘మహానటి’తో తెలుగు ప్రేక్షకులను…

‘కళామతల్లి చేదోడు’ కార్యక్రమం ద్వారా 600 మంది సినీ వర్కర్స్ కు చేయూత

ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు గారు, చదవాలవాడ శ్రీనివాస్ గారు,యలమంచిలి రవి చంద్ గార్లు ఆధ్వర్యంలో “కళామతల్లి చేదోడు” కార్యక్రమం ఈ రోజు ఉదయం 9 గంటలకు ఫిల్మ్ ఛాంబర్ లో జరిగింది.ఈ కార్యక్రమంలో మహిళా వర్కర్స్ కి, డ్రైవర్స్ కి, జూనియర్ ఆర్టిస్టులు కి, ప్రొడక్షన్ వర్కర్స్ కి సుమారు ఆరువందల మందికి ఫుడ్ గ్రోసెరిస్ ఇవ్వటం జరిగింది. దాదాపు నెలకు సరిపడా నిత్య అవసరమ సామాగ్రి అయిన రైస్ బ్యాగ్, కంది పప్పు, రెండు ఆయిల్ పాకెట్స్, కంది పప్పు, గోధుమ పిండి, మినప గుండ్లు, పంచదార, ఎండుమిర్చి, గోధుమ రవ్వ, టీ పౌడర్, పసుపు, పెసర పప్పు, ఇడ్లీ రవ్వ, బొంబాయి రవ్వ, చింత పండు, రిన్ సోప్ లు, విమ్ బార్ లు, కోల్గేట్ పేస్ట్, జిరా, ఆవాలు, అన్ని రెండు…

లైంగిక వేధింపులే కాదు.. వర్ణ వివక్షను కూడా ఎదుర్కొన్నానంటోంది ఈ అమ్మాయి!?

aishwarya-Rajes

 ”నేను చూడడానికి  నల్లగా ఉన్నానని చాలా మంది ఎంతగానో అవహేళన చేశారు. `నువ్వు హీరోయిన్ మెటీరియల్ కాదు` అని ఓ ప్రముఖ దర్శకుడు సైతం అన్నారు. ఓ కమెడియన్ పక్కన వేషం ఇస్తాను.. చేస్తావా` అని ఎంతగానో బుజ్జగించాడు. కెరీర్ ఆరంభంలో నేనూ  ఇలా చాలా వేధింపులకు గురయ్యాను. లైంగిక వేధింపులతోపాటు నేను వర్ణ వివక్షను కూడా ఎదుర్కొన్నా. అలాంటి ఎన్నో వేధింపులను ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చాను” అంటోంది  కథానాయిక ఐశ్వర్యా రాజేశ్‌  తెలుగులో ఒకప్పటి కథానాయకుడు, నటుడు రాజేశ్‌ కుమార్తె. హాస్యనటి శ్రీలక్ష్మి మేనకోడలు. ఎనిమిదేళ్ల వయసులో తండ్రిని కోల్పోవడంతో ఐశ్వర్యా రాజేశ్‌ కుటుంబం కష్టాలు పడింది. అక్కణ్ణుంచి కఠోర శ్రమ, కృషి, పట్టుదలతో దక్షిణాదిలో కథానాయికగా ఇవాళ ఓ స్థాయికి చేరుకున్నారు. ఐశ్వర్య తెలుగులో `కౌశల్యా కృష్ణమూర్తి`, `వరల్డ్ ఫేమస్ లవర్` వంటి…