శివాజీ రాజా గారి అబ్బాయి విజయ్ రాజా మరియు తమన్నా వ్యాస్ హీరో హీరోయిన్లుగా రామ్స్ రాథోడ్ దర్శకత్వంలో జామి లక్ష్మీ ప్రసన్న సమర్పణలో జయ దుర్గాదేవి మల్టీ మీడియా పతాకం పై తూము నరసింహా పటేల్ మరియు జామి శ్రీనివాసరావు లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం వేయి శుభములు కలుగు నీకు`. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని తొలి పాటకు మిలియన్స్ లో వ్యూస్ లభించాయి. ఇటీవల ఈ చిత్రంలోని సెకండ్ సాంగ్‌ను ప్రముఖ నటుడు శివాజీరాజా విడుదల చేశారు. ఈ పాటకూ శ్రోతల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా శివాజీ రాజా మాట్లాడుతూ… చాలా పాజిటివ్ టైటిల్. సినిమా అంతా కూడా అదే పాజిటివ్ తో జరిగింది. దీనికి కారణం నిర్మాతలు. ఎంతో మంది నిర్మాతలను చూశాను నా కెరీర్…
Category: FILM NEWS
నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా శ్రీ వెకంటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో కొత్త చిత్రం
డైనమిక్ స్టార్, నందమూరి కథానాయకుడు కళ్యాణ్ రామ్‌తో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్‌రాజు, శిరీశ్ నిర్మాతలుగా ఓ కొత్త చిత్రం రూపొందనుంది. సోమవారం(జూలై 5) కళ్యాణ్ రామ్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. డిఫరెంట్ చిత్రాలకు కేరాఫ్ నందమూరి కళ్యాణ్‌రామ్.. సక్సెస్‌ఫుల్ చిత్రాలకు కేరాఫ్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(దిల్‌రాజు, శిరీశ్) ..వీరి కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రానికి కె.వి.గుహన్ దర్శకత్వం వహిస్తున్నారు. కళ్యాణ్‌రామ్, గుహన్ కాంబినేషన్‌లో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘118’ సూపర్ డూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది. మరో డిఫరెంట్ రోల్‌లో కళ్యాణ్‌రామ్‌ను చూపించడానికి గుహన్ సరికొత్త కథాంశంతో స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. కళ్యాణ్‌రామ్ నటిస్తోన్న 20వ చిత్రమిది. త్వరలోనే ప్రారంభం కాబోయే ఈ సినిమాలోని ఇతర నటీనటులు,…
Nandamuri Kalyan Ram birthday wishes poster and still from Bimbisara
Nandamuri Kalyan Ram birthday wishes poster and still from Bimbisara
‘రాజుకు నచ్చిందే రంభ’ ప్రారంభం
వి. చిన్న శ్రీశైలం యాదవ్ సమర్పణలో దేవరపల్లి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా రూపుదిద్దుకోనున్న చిత్రం ‘రాజుకు నచ్చిందే రంభ’. రావంత్, సలోనీ హీరోయిన్లుగా నటించనున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసరావు ర్యాలి దర్శకత్వంలో.. దేవరపల్లి అఖిల్, వల్లాల ప్రవీణ్‌కుమార్ యాదవ్ (వెంకట్) నిర్మించనున్నారు. ఈ చిత్రం ఆదివారం పూజా కార్యక్రమాలను జరుపుకుని రెగ్యులర్ షూటింగ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు ర్యాలి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ” రాజుకు నచ్చిందే రంభ చిత్రం పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఒక హీరోయిన్‌గా సలోనీ నటిస్తోంది. మరో హీరోయిన్‌ని త్వరలోనే ఎంపిక చేస్తాము. చిత్ర రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభించనున్నాం. చంద్రబోస్‌గారు, రామజోగయ్య శాస్త్రిగారు చాలా మంచి పాటలు ఇచ్చారు. రఘు కుంచెగారు అంతే అద్భుతంగా పాటలను కంపోజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. సాంగ్స్ రికార్డింగ్ త్వరలోనే మొదలవుతుంది. దర్శకుడిగా…
చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ ప్రెస్ మీట్
ప్రెసిడెంట్ అనిల్ కుమార్ వల్లభనేని కామెంట్స్.. ఈ సొసైటీకి మేము మా కమిటీ ఎంతో నిబద్ధతతో చిత్త శుద్ధితో పని చేస్తుంది…1991 లో గవర్నమెంట్ ఇచ్చిన ఈ ల్యాండ్ అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని 2005 లో మా చేతికి వచ్చింది.దాసరి పుట్టిన రోజు సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ 24 కోట్ల రూపాయల పన్నులను రద్దు చేశారురోశయ్య గారి చేతుల మీదుగా భూమి పూజ జరిగిందిజనరల్ బాడీ మీటింగ్ లు పెట్టీ ఎ ఫ్లాట్ కి ఎంత రేటు అని అందరికీ చేప్పాముఫ్లాట్స్ ను చిత్రపురీ సొసైటీ ఏలార్ట్ చెయ్యదు.కమిటీ ఎంత మంచి చేసిన ఎవరోకరు ఏదోకటి అంటూనే వుంటారుమా కమిటీ వచ్చిన తరువాత mig కన్స్ట్రక్షన్ ఆగకుండా పనులు చేయించాముMIG, douplex హౌస్ లు ఈ సంవత్సరం డిసెంబర్ లో ఇస్తాముచిత్ర పురి హౌసింగ్…
టాలీవుడ్ కి మరోసారి బాపుబొమ్మ
దర్శకులు బాపు గారు తాను దర్శకత్వం వహించిన సినిమాల్లోని హీరోయిన్లకు హీరోలతో పాటు సమానమైన అవకాశాలు ఇచ్చేవారు. బాపుగారి సినిమాల్లోని ‘పెళ్లిపుస్తకం’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన దివ్వవాణి మాత్రం తెలుగు వారందరికి ఇష్టమైన ముచ్చటైన బాపు బొమ్మ అని చెప్పాలి. కారణం ఏంటంటే బాపు గారు ఎందరో కథానాయికలను తనదైన శైలిలో పరిచయం చేసిన దివ్యవాణికి మాత్రం జీవితకాలం ప్రేక్షకుల మనసుల్లో తిష్ఠ వేసుకునే పాత్రను ఇచ్చారు. ఆమె నటకిరీటి రాజేంద్రప్రసాద్‌తో అనేక చిత్రాల్లో నటించినప్పటికి ‘పెళ్లిపుస్తకం’ లోని సత్యభామ పాత్ర మాత్రం ప్రత్యేకం. తెలుగు వారిళ్లలో పెళ్లి జరిగిందంటే అందరి లోగిళ్లలో వినిపించే పాట ‘‘శ్రీరస్తు శుభమస్తు’’. ఆ పాట హమ్ చేసి చేయగానే ఒక్కసారిగా మన మనసుల్లోకి దివ్యవాణి, రాజేంద్రప్రసాద్ వచ్చివెళ్తారు. ముచ్చటైన జంటకు సాక్షంగా వారివురి పాటని వినని పెళ్లిపందిరి లేదంటే అతిశయోక్తి…
కరోనా పై పద్యాలు
ఆమంచి జగదీశ్వర్,విశ్రాంత ప్రధానోపాధ్యాయులుసూర్యాపేట. cell: 9177858436 కనిపెంచిన చైనానేకనిపించని శత్రువోలే కబలించేగదాకనుగొను ప్రక్రియ చేయన్వినిపించెను మరణగంట విశ్వంబెల్లన్ మరణాల మహమ్మారిగాకరుణయే లేని పగతో కరిచెడి రీతిన్వీరులు నెందరినైననుబోరున విలపింపజేయ జోరుగ సాగెన్ అంతట ఇంతట తానైఎంతటి దేశ్జంబునైన ఎదురించుటలోశుంతైన జాలి చూపకఇంతింతై విశ్వమెల్ల విజృంభించెన్
Ravindra soori rathalu
Ravindra soori rathalu
యంగ్ హీరో నిఖిల్ చేతుల మీదుగా ప్రారంభమైన “త్రైతం” షూటింగ్
భగవద్గీత లోని “త్రైతం” సిద్ధాంతాన్ని తీసుకొని మనిషి వున్నాడు, దేవుడు వున్నాడు, అలాగే ఆత్మ కూడా ఉందనే కాన్సెప్ట్ తో హీరోయిన్ మౌర్యాని ప్రధాన పాత్రలో శుభలేఖ సుధాకర్, రాజేశ్వరి నాయర్ నటీనటులుగా వి.ఆర్.పి క్రియేషన్స్ పతాకంపై రవికుమార్.ఎస్ ను దర్శకుడిని పరిచయం చేస్తూ పసుపులేటి వెంకటరమణ నిర్మిస్తున్న లేడీ ఓరియంటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ “త్రైతం” ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన నిఖిల్ సినిమాకు క్లాప్ నివ్వగా చందు మొండేటి కెమెరా స్విచాన్ చేశారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలోచిత్ర దర్శకుడు రవికుమార్ మాట్లాడుతూ.. వి ఆర్ పి క్రియేషన్స్ లో వస్తున్న మూడవ సినిమాకు నేను దర్శకత్వం వహించడం అదృష్టం గా భావిస్తున్నాను. ఈ సినిమా పూజ కార్యక్రమానికి పిలవగానే…
జాతీయ స్థాయిలో ఇతర డిజిటల్ మాధ్యమాలకు గట్టిపోటీనిస్తోన్న ఏకైక తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’
మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా తెలుగు ప్రేక్షకులకు తిరుగులేని,నాణ్యమైన హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించడానికి రూపొందిన ఏకైక తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’. ప్రారంభం నుంచి ప్రేక్షకులు అంచనాలకు ధీటైన కంటెంట్‌ను అందిస్తూ వారి హృదయాల్లో తిరుగులేని స్థానాన్ని దక్కించుకుంటుంది. బ్లాక్‌బస్టర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, షోస్‌తో ఇతర డిజిటల్ మాధ్యమాలకు ‘ఆహా’ గట్టి పోటీనిస్తోంది. తెలుగు ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న నాగచైతన్య ‘లవ్‌స్టోరి’, అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’, నాగశౌర్య ‘లక్ష్య’ చిత్రాలతో పాటు అమలాపాల్, రాహుల్ విజయ్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘కుడిఎడమైతే’ ఆహాలోనే ప్రసారం కానుంది. ‘ఆహా’లో ప్రసారమైన ‘సామ్ జామ్’ వెబ్ షో సాధించిన తిరుగులేని విజయంతో మరిన్ని నాన్ ఫిక్షనల్ కంటెంట్ ‘ఆహా’లో ప్రేక్షకులను మెస్మైరైజ్ చేయడానికి సిద్ధమవుతోంది. అందులో భాగంగా లక్ష్మీ మంచు హోస్ట్…
