హాజరైన గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ సినిమా రంగం మాత్రమే కాదు, ఏ రంగం లో అయినా పురస్కారాలు మంచి ప్రోత్సాహాన్ని అందిస్తాయని, బాధ్యతను మరింత పెంపొందిస్తాయని, అన్ని విధాలుగా రాణించేందుకు దోహదపడతాయని తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ అన్నారు. ప్రతిష్టాత్మక సినీ గోయర్స్ 52వ స్వర్ణోత్సవ ఫిలిం అవార్డుల వేడుకలు శుక్రవారం శిల్పకళా వేదిక లో అట్టహాసంగా జరిగాయి.ముఖ్యఅతిధిగా విచ్చేసిన గవర్నర్ తమిళి సై మాట్లాడుతూ సమాజం లో అత్యంత శక్తివంతమైన ప్రభావవంతమైన వినోద మాధ్యమం సినిమా అని, బాధ్యతాయుత సినిమాలు నిర్మించాలని కోరారు. దక్షిణాది రాష్ట్రాల్లో టాలీవుడ్ సినిమా కు ప్రత్యేక గుర్తింపు ఉందని, లక్షల మంది సినిమా రంగం లో ఉపాధి పొందుతున్నారని అభినందించారు. సమాజం లో నెలకొన్న పరిస్థితులను అధిగమించేందుకు సినిమా రంగం కృషి చేయాలనీ పిలుపునిచ్చారు.డాక్టర్…
Category: FILM NEWS
Happy birthday Vijay muppidi
Happy birthda Vijay muppidi Up Coming hero in TELANGANA
మెగాస్టార్ కు ఐదు దశాబ్దాల స్వర్ణోత్సవ సినీ గోయర్స్ పురస్కారం
రాఘవేంద్రరావు, ప్రకాష్ రాజ్, జయప్రదలకు స్వర్ణోత్సవ సినీ గోయర్స్ పురస్కారాలు నేడు సినీగోయర్స్ ఫిలిం అవార్డ్స్- కోట శ్రీనివాసరావు, రాజేంద్ర ప్రసాద్ లకు జీవన సాఫల్య పురస్కారాలు ప్రతిష్టాత్మక సినీ గోయర్స్ 52వ స్వర్ణోత్సవ సినిమా అవార్డ్స్ వేడుక శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు మాదాపూర్ శిల్పకళా వేదిక లో నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షులు డాక్టర్ పి.శ్రీధర్, ప్రధాన కార్యదర్శి బి.రామకృష్ణ తెలిపారు. తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ముఖ్య అతిధిగా పాల్గొంటున్నారు. పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె వి రమణాచారి, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొంటారని వారు వివరించారు. పాసులు ఉన్నవారికే ప్రవేశం అని, కోవిద్ నిబంధనల ప్రకారం మాస్కులు ధరించి హాజరు కావాలని కోరారు.…
‘మను చరిత్ర’ అందరికీ నచ్చే సినిమా : హీరో శివ కందుకూరి
‘చూసీ చూడంగానే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శివ కందుకూరి హీరోగాా నటించిన తాజా చిత్రం ‘మను చరిత్ర’. లవ్ అండ్ వార్ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ సినిమాను ప్రొద్దుటూరు టాకీస్ పతాకంపై నారల శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్నారు. భరత్ పెదగాని దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ‘మను చరిత్ర’ ప్రీ ఫేస్ పేరుతో టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘ఇంటెన్స్ లవ్ స్టోరీలతో వచ్చిన చిత్రాలు కచ్చితంగా హిట్ అవుతాయి. దేనితోనూ పోల్చను కానీ ఇటు వంటి కథలతో వచ్చిన చిత్రాలు హిట్ అవుతాయి. ఆర్ఆర్ లేకుండా ఈ చిత్రాన్ని నేను చూశాను. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌కు తగ్గట్టుగా భరత్ కథ రాసుకున్నాడు.…
ఘనంగా ‘వరుణ్ డాక్టర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్
‘రెమో’, ‘సీమ రాజా’, ‘శక్తి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘వరుణ్ డాక్టర్’. ఇప్పుడు తమిళ స్టార్ హీరో విజయ్ ‘బీస్ట్’కు దర్శకత్వం వహిస్తున్న నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన చిత్రమిది. కె.జె.ఆర్. స్టూడియోస్ అధినేత కోటపాడి జె. రాజేష్… గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్.కె. ప్రొడక్షన్స్‌తో సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయదశమి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్ 9న ‘డాక్టర్’ విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖ నిర్మాతలు ఏషియన్ సునీల్, సుధాకర్ రెడ్డి, ‘ఠాగూర్’ మధు ‘వరుణ్ డాక్టర్’ బిగ్ టికెట్‌ను ఆవిష్కరించారు. అనంతరం సినిమా భారీ విజయం సాధించాలని ఆకాంక్షించారు. హీరో శివ కార్తికేయన్,…
పద్మజ ఫిలిం ఫ్యాక్టరీ ప్రొడక్షన్ నంబర్-2 ప్రారంభం
పద్మజ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై తొలి ప్రయత్నంగా తీసిన ‘ఇక్షు’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగానే ఈ బ్యానర్ లో రెండో సినిమాను మొదలెట్టారు. ‘ఇక్షు’ చిత్రానికి దర్శకత్వం వహించిన వి వి రుషిక దర్శకత్వంలో నిర్మాత హనుమంత్ రావు నాయుడు నిర్మిస్తున్న ప్రొడక్షన్ 2 చిత్రం గురువారం హైద్రాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయింది. ఈ సందర్బంగా చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ‘ఎంఎల్ఏ’ ఫేమ్ దర్శకుడు ఉపేంద్ర క్లాప్ ఇవ్వగా, నిర్మాత డి ఎస్ రావు కెమెరా స్విచ్ ఆన్ చేయగా తొలి షాట్ కు చిత్ర దర్శకురాలు రుషిక గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కో ప్రొడ్యూసర్ సాయి కార్తీక్ మాట్లాడుతూ .. “దసరా నవరాత్రుల సందర్బంగా ఈ రోజు ఈ చిత్రాన్ని…
వాడి-వేడిగా ఊపందుకున్న ‘మా’ ఎన్నికల ప్రచారం
-రసవత్తర పోరులో ‘నేను సైతం.. ‘ అంటూ స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో మధు వింజమూరి -ఈసీ మెంబెర్ గా సీరియల్ నెం -31కి విలువైన ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థన ‘మా’ కోసం-మనకోసం’ మనమే అంటూ బరిలో ముందంజ అక్టోబర్ 10న జరగనున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎన్నడూ ‘మా’ ఎన్నికల్లో ఇలాంటి ఊపును చూడలేదు. ఇప్పుడు అందరి దృష్టి ‘మా’ ఎన్నికలపైనే ఉంది. ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల వ్యవహారం వాడి-వేడిగా రోజు రోజుకూ తీవ్రంగా వేడెక్కుతోంది. అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఇద్దరూ నువ్వా నేనా? అన్నట్టుగా పోటీ పడుతున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది ఉత్కంఠగా మారింది. ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు, మంచు విష్ణు ప్యానల్ సభ్యులు ఎవరికివారే…
పాలకొల్లులో పుట్టి ఫిలింనగర్ చుట్టి…
ఇదీ సురేష్ కొండేటి జీవన ప్రస్థానం : సినిమా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అన్నట్లుగా పాలకొల్లులో పుట్టి ఫిలిం నగర్ లో కాలుపెట్టి సినిమా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి సురేష్ కొండేటి. ‘సంతోషం’ సురేష్ అని పిలుచుకునే సురేష్ కొండేటి జీవిత ప్రస్థానాన్ని అవలోకిస్తే ఎన్నో మజిలీలు కనిపిస్తాయి. స్కూల్ డేస్ లో సూపర్ స్టార్ కృష్ణ అభిమాని అయిన సురేష్ ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా మారి హైదరాబాద్ లో అడుగుపెట్టి తన ‘సంతోషం’తో సినిమా పరిశ్రమకు సగం బలాన్ని అందిస్తున్న సురేష్ కొండేటి మూడు దశాబ్దాల అనుభవాన్నిమూటగట్టుకున్నారు. జర్నలిస్టుగా, పంపిణీదారుడిగా, నిర్మాతగా, నటుడిగా రాణిస్తున్న సురేష్ కొండేటి ఈ అక్టోబరు 6న పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా ప్రత్యేక…
నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ షూటింగ్ పూర్తి
నటసింహా నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతోన్న అఖండ మూవీ చిత్రీకరణ పూర్తయ్యింది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్లో సాంగ్ షూట్‌తో చిత్రీకరణను పూర్తిచేసింది యూనిట్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శర వేగంగా జరుగుతున్నాయి. అతి త్వరలో విడుదల తేదిని ప్రకటించనున్నారు చిత్ర యూనిట్. ఈ సందర్భంగా విడుదల పోస్టర్ లో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను, మిర్యాల రవీందర్ రెడ్డి, శ్రీదర్ షూటింగ్ విజయవంతం గా పూర్తయిందని సింబాలిక్ గా చూపిస్తున్నారు. ఈ పోస్టర్ ట్రెండింగ్ లో ఉంది. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రమిది. ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాలో బాలయ్యను ఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్తపాత్రలో చూపిస్తున్నందున ఈ సినిమాపై భారీ క్రేజ్ నెలకొనివుంది. ఈ సినిమాలో…
రవితేజ విడుదల చేసిన ‘నాట్యం’లోని ‘వేణువులో..’పాట
నాట్యంఅంటే ఓ కథను డాన్స్ ద్వారా అందమైన రూపంలో చెప్పడమే. అలాంటి ఓ అద్భుతమైన కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రంనాట్యం. ఈ మూవీ ద్వారా ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్యారాజు నటిగా, నిర్మాతగా పరిచయం అవుతున్నారు. రేవంత్ కోరుకొండ దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్, సాంగ్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా నాట్యం సినిమా నుండివేణువులో చేరని గాలికి సంగీతం లేదు…` అనే పాటను మాస్ మహారాజా రవితేజ విడుదలచేసి చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. కరుణాకర్ అడిగర్ల సాహిత్యం అందించిన ఈ పాటకు శ్రవణ్ భరద్వాజ్ మంచి ట్యూన్ కంపోజ్ చేశారు. అనురాగ్ కులకర్ణి శ్రావ్యంగా ఆలపించిన ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటోంది. నాట్యం చిత్రం అక్టోబరు 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాలో కమల్ కామరాజ్, రోహిత్ బెహల్, ఆదిత్య…
