-తెలంగాణ బతుకమ్మకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వాయనాల కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాగాయని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క పూలను పూజించి ప్రకృతిని ఆరాధించే పండగ బతుకమ్మ పండగ అని ప్రజాగాయని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క అన్నారు. ప్రేమ సేవా సదనం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మలో వాయనాల కార్యక్రమంలో ఆమె పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.బతుకమ్మ పాటలు పాడి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈసందర్భంగా మాట్లాడారు. పూలను పూజించి ఆరాధించే తెలంగాణ బతుకమ్మకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందని తీరు తీరు పువ్వులతో పేర్చే బతుకమ్మ విశిష్టతను నిరంతరంగా చాటి చెప్పడానికి బహుజన బతుకమ్మ కార్యక్రమం చేపట్టామని అన్నారు.అక్టోబర్ 6 న ఉస్మానియా ప్రాంగణంలో ప్రారంభమైన బహుజన బతుకమ్మ 9 రోజులు,9 జిల్లాలలో జరిగి గురువారం యాదాద్రి…
Category: FILM NEWS
దీపావళికి రానున్న ‘బ్యాక్ డోర్’
పూర్ణ ప్రధాన పాత్రలో తేజ త్రిపురాన హీరోగా ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ‘బ్యాక్ డోర్’ చిత్రం సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని దీపావళి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి ‘క్లీన్ యు’ సెన్సార్ సర్టిఫికెట్ లభించడం విశేషం. ఈ సందర్బంగా నిర్మాత బి.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ…”బ్యాక్ డోర్’లో కుర్రకారును కట్టి పడేసే అంశాలతోపాటు…అన్ని వర్గాలవారిని అలరించే అంశాలు మెండుగా ఉన్నాయి. పూర్ణతోపాటు హీరో తేజ చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. త్వరలోనే థియేటర్ ట్రైలర్ రిలీజ్ చేసి దీపావళికి సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు. తను నటించిన ‘బ్యాక్ డోర్’ క్లీన్ యుతో రిలీజ్ కానుండడం పట్ల హీరోయిన్ పూర్ణ సంతోషం వ్యక్తం చేశారు.ఈ చిత్రానికి కో-డైరెక్టర్: భూపతిరాజు…
18న ‘ఆరాధన’ 26వ వార్షికోత్సవం
విశిష్టమైన కార్యక్రమాల ద్వారా ఉన్నతమైన సేవలను అందిస్తూ హైదరాబాద్ కు చెందిన ‘ఆరాధన’ సంస్థ తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకుంటోంది. గత 25ఏళ్లుగా లెక్కకు మించి కార్యక్రమాలు నిర్వహించి వివిధరంగాలకు చెందిన ఎందరినో గుర్తించి సత్కరించి..అవార్డులను అందజేస్తూ వస్తోంది. అందులో భాగంగానే ఈనెల 18న తన 26వ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. ‘విజయంలో భార్యాభర్తల భాగస్వామ్యం’ పేరుతో నిర్వహించే ఈ వార్షికోత్సవం సోమవారం 18న హైదరాబాద్ లోని చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలో సాయంత్రం 6 గంటలకు జరగనుందని ‘ఆరాధన’ వ్యవస్థాపకులు, ప్రధానకార్యదర్శి లోకం కృష్ణయ్య తెలిపారు. ఈ సందర్బంగా నిర్వహించే వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా ప్రముఖ సాహితీవేత్త డా. ఓలేటి పార్వతీశం, సన్మాన కర్తలుగా సికింద్రాబాద్ ఉజ్జయని మహంకాళి దేవస్థానం కు చెందిన ప్రధానార్చకులు శ్రీ బి. రామతీర్థ శర్మ, శ్రీమతి బి. రాజ్యలక్ష్మి, సభాధ్యక్షులుగా లయన్స్…
ఆకాష్ పూరి ‘రొమాంటిక్’ నుంచి ‘పీనే కే బాద్’ లిరికల్ వీడియో సాంగ్ విడుదల
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన తనయుడు ఆకాష్ పూరి రొమాంటిక్ చిత్రం కోసం కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అనిల్ పాడూరి తెరకెక్కిస్తున్నారు. కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తున్నారు.రొమాంటిక్ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక నేడు పీనే కే బాద్ అంటూ మూడో పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను విడుదల చేశారు. బాధల్లో ఉన్నప్పుడు, మద్యం సేవించిన అనంతరం ఉండే ఆ ఎనర్జీని చూపించేలా ఈ పాట సాగుతుంది. పాట థీమ్‌కు తగ్గట్టుగా ఓ పబ్‌లో ఈ పాటను షూట్ చేశారు. క్లబ్‌లో ఈ పాటను షూట్ చేస్తున్న సమయంలోనే అద్భుతమైన ఆదరణ వచ్చింది.పాటను భాస్కర భట్ల, పూరి జగన్నాథ్ గారు ఎంతో హాస్యధోరణిలో రాసేశారు.…
ఇళయరాజా ‘మ్యూజిక్ స్కూల్’లో షాన్
వైవిధ్యమైన స్వరంతో పాటలు పాడుతూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ సింగర్ షాన్ ఇప్పుడు పాపారావు బియ్యాల దర్శకుడిగా పరిచయమవుతూ తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిస్తోన్న చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’ కోసం నటుడిగా మారారు. మాస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. తన విలక్షణ గాత్రంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సింగర్ షాన్ ‘మ్యూజిక్ స్కూల్’ దర్శక నిర్మాతలను కూడా ఆకట్టుకున్నారు. అయితే గాత్రంతోనే కాదు బాడీ లాంగ్వేజ్‌తోనూ. ఇళయరాజా స్టూడియోలో ఓ పాట పాడిన ఈ సింగర్‌ను చూసి, పాత్రకు సరిపోతాడని భావించి తమ సినిమాలో నటించాలని చిత్ర దర్శక నిర్మాతలు కోరారు. శర్మన్ జోషి, శ్రియా శరన్ నటిస్తున్న ఈ చిత్రంలో శ్రియ మాజీ ప్రేమికుడుగా షాన్ కనిపించబోతున్నారు. షాన్ ఈ సినిమాలో నటించడంతో పాటు సినిమాలో పాట…
జర్నలిస్టుల సమస్యలపై నిర్లక్ష్యం తగదు
టీయుడబ్ల్యుజె రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆగ్రహం జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యం తగదని, వివిధ వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్నట్లు గొప్పలు చెబుకుంటున్న పాలకులు జర్నలిస్టుల సంక్షేమాన్ని ఎందుకు విస్మరిస్తున్నారని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ), తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) నాయకత్వం ప్రశ్నించింది.ఆదివారం నాడు హైదర్ గుడ లోని సెంటర్ పార్క్ హోటల్ కాన్ఫరెన్స్ హాలులో టీయుడబ్ల్యుజె రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై దాదాపు 6 గంటల పాటు సమావేశం చర్చించింది. ముఖ్యంగా కోవిడ్ తో పాటు వివిధ సంఘటనల్లో అకాల మరణం చెందిన జర్నలిస్టుల కుటుంబాలు దీనస్థితిలో జీవితాలు గడుపుతున్నా బాధితులను ప్రభుత్వం పట్టించుకోక పోవడం విచారకరమని ఐజేయూ జాతీయ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి ఆవేదన…
‘గోర్ మాటి’ పాటని ఆవిష్కరించిన చంద్రబోస్
బంజారా బిగ్ సినిమాస్ పతాకంపై శంకర్ జాదవ్ , కరిష్మా, అదిరే అభి, సిరిరాజ్ ప్రధాన తారాగణంగా శంకర్ జాదవ్ దర్శకత్వంలో రేఖ్య నాయక్ రెండు బాషల్లో నిర్మిస్తున్న చిత్రం తెలుగులో రాజ్ పుత్ (బార్న్ ఆఫ్ వారియర్), బంజారాలో గోర్ మాటి (పవర్ ఆఫ్ యూనిటీ). ఈ చిత్రానికి సంబంధించిన పాటని గీత రచయిత చంద్రబోస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘ఇండియాలో 12 కోట్ల మంది బంజారాలు ఈ సినిమాను ఖచ్చితంగా చూడాల్సిన చిత్రం. కచ్చితంగా ఈ సినిమానిఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. దర్శకుడు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని ఆదరిస్తే ఇలాంటివి మరెన్నో చిత్రాలు వారు మీముందుకు తీసుకువస్తారు. ఈ సినిమా కచ్చితంగా హిట్ సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘జబర్దస్త్’…
లఖింపూర్ రైతు హంతకులను శిక్షించాలని మౌనదీక్ష
ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఉత్తర ప్రదేశ్ లఖింపూర్ రైతు హంతకులను శిక్షించాలని సోమవారం పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేపట్టిన మౌనదీక్షలో పాల్గొన్న పీసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు, యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి, మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు వరలక్ష్మి, ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు
భద్ర ప్రొడక్షన్ ‘తగ్గేదే లే’ ఫస్ట్ లుక్ విడుదల
టాలీవుడ్‌లో కొత్త బ్యానర్ ప్రారంభమైంది. నిర్మాతలు ప్రేమ్ కుమార్ పాండే, పీవీ సుబ్బారెడ్డి సంయుక్తంగా కలిసి ప్రారంభించిన భద్ర ప్రొడక్షన్‌ను ఈ రోజు ఎంఈఐఎల్ పీపీరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. భద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మొదటి చిత్రంగా తగ్గేదేలే.. అనే ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, దివ్య పిళ్లై, అనన్య సేన్ గుప్తా, రవి శంకర్, రాజా రవీందర్, నాగ బాబు, అయ్యప్ప శర్మ, పృథ్వీ తదితరులు నటించారు. భద్ర ప్రొడక్షన్ కంపెనీ లోగోను ఎంఈఐఎల్ పీపీరెడ్డి ఆవిష్కరించగా.. నిర్మాతలు ప్రేమ్ కుమార్ పాండే, పీవీ సుబ్బారెడ్డి తగ్గేదేలే ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.నిర్మాత ప్రేమ్ కుమార్ పాండే మాట్లాడుతూ.. ‘మంచి కథలను చెప్పేందుకు ఈ ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించాం. మన చరిత్రలో ఎన్నెన్నో కథలున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో కల్చర్ ఉంటుంది. మన…
‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు
హోరాహోరీగా సాగిన ఈ పోరులో మంచు కుటుంబానికే ‘మా’ పీఠం దక్కింది. ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపొందారు. విమర్శలు, వివాదాల మధ్య రసవత్తరమైన పోరు సాగిన ఎన్నికల్లో మొదటి నుంచి ఆధిక్యంలో ఉన్న ఆయన ప్రకాశ్‌రాజ్‌పై ఊహించని ఘన విజయం సాధించారు. జాయింట్ సెక్రటరీగా మంచు విష్ణు ప్యానల్‌కు చెందిన గౌతమ్ రాజు గెలుపుపొందగా, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి శ్రీకాంత్ అధిక ఓట్లతోవిజయాన్ని కైవసం చేసుకున్నారు. . వైస్ ప్రెసిడెంట్‌గా మంచు విష్ణు టీమ్ నుంచి పృథ్వీ రాజ్ విజయం సాధించారు. మొత్తం మీద ఈసీ మెంబర్స్ గా ప్రకాశ్ రాజ్ 11, మంచు విష్ణు 7 గెలుచుకున్నారు. ‘మా’ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నప్పుడే అందరిలో ఉత్కంఠ నెలకొంది. ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుండి జబర్దస్త్…
