ప్రభాస్ ‘రాధేశ్యామ్’ వాయిదా!

radheshyam

డార్లింగ్ ప్రభాస్ అభిమానులను తీవ్ర నిరాశపరుస్తూ ‘రాధేశ్యామ్’ వాయిదా పడింది. కరోనా.. ఒమిక్రాన్ తీవ్రత దృష్ట్యా చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మొత్తంమీద ‘రాధేశ్యామ్’ మూవీ టీమ్ ప్రకటన అభిమానులు గత కొన్నిరోజులుగా అనుకుంటున్నదే జరిగింది. ఒమిక్రాన్ వల్ల ఏర్పడిన ఆంక్షలు, పలు రాష్ట్రాల్లో థియేటర్లు మూసివేత వల్ల సినిమాను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించి కొత్త రిలీజ్ డేట్ త్వరలో చెబుతామని ప్రకటించింది.1970ల నాటి ప్రేమకథతో తీసిన ఈ సినిమాలో ప్రభాస్, పాలమిస్ట్ (హస్తరేఖా సాముద్రిక నిపుణుడు)గా నటించారు. పూజాహెగ్డే హీరోయిన్. కృష్ణంరాజు కీలకపాత్ర పోషించారు.ఈ సినిమాకు దక్షిణాదిలో జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించగా, తమన్ బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్ ఇచ్చారు. రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.ప్రభాస్ ప్రస్తుతం ‘సలార్’, ‘ఆదిపురుష్’ సినిమాలతో పాటు నాగ్…

అనసూయ భరద్వాజ్ ఆనందానికి హద్దులు లేవు!!

ATTACHMENT DETAILS Saved. anasuya_bharadwajs_first_look_as_alice_from_malayalam_movie_bheeshma_parvam_is_out_main

అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రంలో దాక్షాయణి గా అదరగొట్డిన యాంకర్ అనసూయ భరద్వాజ్ ఆ సినిమాతో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. తాజాగా ఈ హాట్ హాట్ బ్యూటీకి మలయాళం సినిమా నుంచి బంపర్ ఆఫర్ వచ్చింది. అది కూడా మమ్ముట్టి సినిమాలో రావడంతో అనసూయ ఆనందానికి హద్దులు లేవు. ఒక విధంగా చెప్పాలంటే ఇది అదిరిపోయే ఛాన్సే! మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి సరసన జంటగా నటించడమంటే మాటలుకాదు.. గ్యాంగ్ స్టర్ నేపధ్యంలో సాగే ఆ సినిమా పేరు ‘భీష్మ పర్వం’. షూటింగ్ తదితర కార్య క్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఫిబ్రవరి లో విడుదల చేయబోతున్నారు. ఇటీవల `పుష్ప`లో దాక్షాయణి పాత్రలో ఆకట్టుకున్న అనసూయ అంతకు ముందు సుకుమార్ `రంగస్థలంలో రంగమ్మత్తగా పాపులారిటీని సొంతం చేసుకుంది. నటిగా సిల్వర్‌ స్క్రీన్‌పై బిగ్‌ బ్రేక్‌ని…

నిజాయితీ పాలనకు నిదర్శనం బిజెపి ప్రభుత్వం : బిజెపి మహబూబ్‌నగర్ జిల్లా ఇంచార్జి ప్రేమ్ రాజ్ యాదవ్

ALER BJP NEWS

(టాలీవుడ్ టైమ్స్ ప్రతినిధి – ఆలేరు ) పాలనలో స్వార్దం లేకుండా నిజాయితీ గా పరిపాలన కొనసాగిస్తే దేశ ప్రజలు అంతే విధంగా బాగుంటారని బిజెపి మహబూబ్‌నగర్ జిల్లా ఇంచార్జి ప్రేమ్ రాజ్ యాదవ్ అన్నారు. ఆలేరు పట్టణంలో రెండు రోజుల బిజెపి రాజకీయ శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి మంగళవారం హాజరైన ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రధాని మోడీ దేశంలోని అన్ని రాష్ట్రాలకు సమానంగా నిధులను కేటాయిస్తూ నిజాయితీ పాలనకు నిదర్శనంగా నిలుస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోఅనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు కోసం కేంద్రం భారీగా నిధులు కేటాయిస్తున్నా కేసీఆర్ ప్రభుత్వం పధకాలకు తమ సొంత పేరు పెట్టుకొని ప్రజలకు అందిస్తుందని‌ చెప్పారు.మోడీ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు.తెలంగాణ లోని…

‘ఆచార్య ’లో తనదైన మార్క్ స్టెప్పులతో దుమ్ములేపిన మెగాస్టార్

megastar Acharya song

మెగాస్టార్ చిరంజీవి. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య‌’. శ్రీమ‌తి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలను జ‌రుపుకుంటోంది. ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల చేస్తున్నారు. సోమవారం ‘ఆచార్య’ సినిమాలోని మరో పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘సానా కష్టం వచ్చేసిందే మందాకిని..’ అంటూ సాగే ఈ స్పెష‌ల్ సాంగ్‌ను మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ రెజీనా క‌సాండ్ర‌ల‌పై చిత్రీక‌రించారు. టాలీవుడ్‌లో డాన్స్‌, ఇర‌గ‌దీసే స్టెప్పులంటే వెంట‌నే గుర్తుకొచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి. ఇక స్పెష‌ల్ సాంగ్‌లో ఆయ‌న డాన్సింగ్ పెర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న‌దైన మార్క్ స్టెప్పుల‌తో చిరంజీవి డాన్స్ అద‌ర‌గొట్టేశారు.…

ధనుష్ మొదటి తెలుగు సినిమా ఎందుకు మారింది ?

hero dhanush movie news

తమిళ హీరో ధనుష్ తెలుగులో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నటించబోతున్నాడని ఆ మధ్య కాలంలో వార్తలు వచ్చాయి . మదరాసు నుంచి ఆంధ్ర ప్రదేశ్ విడిపోయిన సందర్భంలో కథా నేపథ్యం నడుస్తుందని కూడా వార్తలు వచ్చాయి . ధనుష్ పుట్టిన రోజు సందర్భంగా అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. అయితే ధనుష్ మొదటి తెలుగు సినిమాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా తాజాగా మొదలయింది . సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు. మరి ధనుష్ శేఖర్ కమ్ముల సినిమా మొదట ఎందుకు ప్రారంభం కాలేదని చాలా మందిలో సందేహం వచ్చింది. శేఖర్ కమ్ముల కథ రెడీ చేయలేదేమోనని చాలా మంది భావించారు. కాని వాస్తవానికి హీరో ధనుష్ కి – ఆ చిత్ర నిర్మాతలకు మధ్య పారితోషికం విషయంగా ఏర్పడిన అభిప్రాయ భేదాల కారణంగా ముందు వెంకీ…

సమంత ‘శాకుంతలం’ ఎప్పుడు?

Samantha Shakuntalam

సీనియర్ డైరెక్టర్ గుణ శేఖర్ ‘రుద్రమ దేవి’ సినిమా తర్వాత – ఏడేళ్ళ గ్యాప్ తీసుకొని సొంతంగా నిర్మించి డైరెక్ట్ చేస్తున్న చిత్రం ‘శాకుంతలం ‘. సమంత శకుంతలగా నటిస్తున్న ఈ పౌరాణిక చిత్రంలో దుష్యంతుడి పాత్రను మళయాళ నటుడు దేవ్ మోహన్ పోషిస్తున్నారు . లోగడ తెలుగులో ‘శకుంతల‘ సినిమాలో ఎన్.టి.ఆర్, ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ లో బాలకృష్ణ పోషించారు. తెలుగులో నటిస్తున్న మొదటి సినిమాలోనే దేవ్ మోహన్ కి దుష్యంతుడి పాత్ర దొరకడం అదృష్టమనే చెప్పాలి . అలాగే ‘ఫ్యామిలీ మాన్’ వెబ్ సిరీస్ తో, ‘పుష్ప’లో ఐటమ్ సాంగ్ తో జాతీయ స్థాయిలో పాపులర్ అయిన సమంతకి ఈ పాన్ ఇండియా మరింత ప్లస్ అనే చెప్పాలి . కబీర్ బేడీ , మోహన్ బాబు కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.…

త్రివిక్రమ్ క్లాప్ తో ధనుష్ – వెంకీ అట్లూరి ద్విభాషా చిత్రం‌ ‘సార్‌’ ప్రారంభం

Dhanush's Telugu-Tamil bilingual SIR/Vaathi, directed by Venky Atluri, produced by Sithara Entertainments and Fortune Four Cinemas, formally launched

ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలోని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్)తో కలిసి నిర్మిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత స్టార్ యాక్ట‌ర్‌ ‘ధనుష్’తో తెలుగు, తమిళంలో నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం ‘సార్'(తెలుగు) ‌’వాతి’,(తమిళం) నేడు 10 గంటల 19 నిమిషాలకు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఆత్మీయ అతిథుల మధ్య వైభవంగా జరిగింది. ఇటీవ‌ల‌ ‘రంగ్‌దే’ చిత్రానికి దర్శకత్వం వహించిన యూత్‌ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర నాయకా,నాయికలు ధనుష్, సంయుక్త మీనన్ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సుప్రసిద్ధ దర్శకుడు త్రివిక్రమ్ క్లాప్ ఇచ్చారు. ప్రముఖ పారిశ్రమికవేత్త సురేష్ చుక్కపల్లి, ప్రముఖ నిర్మాత డా: కె.ఎల్.నారాయణ కెమెరా స్విచాన్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణ…

మరోసారి దాన గుణం చాటిన మెగాస్టార్ చిరంజీవి

Megastar Chiranjivi news

చిరంజీవి మరోసారి తన దాన గుణం చాటుకున్నారు. ఈసారి ఒకరో ఇద్దరికో కాకుండా, మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో వున్నా అన్ని క్రాఫ్ట్స్ లో పనిచేస్తున్న అందరికి లైఫ్ టైం హెల్త్ కార్డులు ఇష్యూ చేసారు ఇంకా చేస్తున్నారు. చిరంజీవి ఆధ్వర్యంలో వున్న చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా యోదా డయాగ్నసిస్ సెంటర్ ద్వారా ఈ కార్డులు ఇష్యూ చేసారు. కరోనా మహమ్మారి వాళ్ళ వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయి, ఆర్ధికంగా చాలామంది ఛిద్రం అయ్యారు. ఆర్ధికంగా అయితే పరవాలేదు, మల్లి నిలదొక్కుకోవచ్చు కానీ చాలామంది మిత్రులను, శ్రేయోభిలాషులను కోల్పోయాం. ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు కదా, అప్పుడు అనిపించింది ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నేను ఇండస్ట్రీ కి ఏమి చెయ్యగలను అని ఆలోచించా. అప్పుడే యోదా డయాగ్నసిస్ కి వెళ్ళినప్పుడు వాళ్ళతో మన సినిమా ఇండస్ట్రీ లో…

అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు ప్రారంభం :ఘనంగా సూపర్ స్టార్ కృష్ణకు సన్మానం

Alluri seetharamarju jayanthi

హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ క్లబ్‌లో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. జూలై 4, 2022 ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా జరపబోయే శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతి జాతీయ వేడుకల ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. అందులో భాగంగా అల్లూరి సీతారామరాజు సినిమా తీసిన సూపర్‌ స్టార్‌ కృష్ణకు సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, తెలంగాణ, ఏపీ మంత్రులు, శ్రీనివాస్‌ గౌడ్, అవంతి శ్రీనివాస్, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు, కృష్ణ సోదరుడు-నిర్మాత ఆదిశేషగిరి రావు, సినీనటుడు మోహన్‌ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా గుర్తింపు పొందిన స్వాతంత్ర్య సమరయోధులను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.…

జీవో నెం.120ని స్వాగ‌తిస్తున్నాం : తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ప్రెసిడెంట్ సునీల్ నారంగ్

GO NO 120 news

సినిమా టికెట్ రేట్ల విధానంపై ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జీవోనెం120 అంద‌రికీ ఆమోద యోగ్యంగా ఉంది. ఈ సంద‌ర్భంగా మా తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ త‌రుపున తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌గారికి, కేటీఆర్‌గారికి, సినిమాటోగ్ర‌ఫి మంత్రులు త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ గారికి ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాం అన్నారు ప్ర‌ముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూట‌ర్, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ప్రెసిడెంట్ సునీల్ నారంగ్ (ఏషియ‌న్ సునిల్‌). ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ – “చిన్న సినిమాలు 50 -150 రూపాయ‌ల వ‌ర‌కూ టికేట్ రేటుకి అమ్ముకోవ‌చ్చు. నిర్మాత‌లంద‌రినీ విజ్ఞ‌ప్తి చేస్తున్నాం అధిక ద‌ర‌ల‌కు టికెట్లు విక్ర‌యించ‌కూడ‌దు. ఈ రోజు కొన్ని థియేట‌ర్స్‌లో టికెట్ రేట్లు ఎక్కువ రేటుకి అమ్మ‌డం మా దృష్టికి వ‌చ్చింది. మేం వెంట‌నే స్పందించి ఆ…