సంక్రాంతికి సినిమాలు లేవనే కొరతను ‘హీరో’ తీరుస్తుంది : ఆదిశేషగిరి రావు

Hero Movie

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనళ్లుడు ,గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో గల్లా పద్మావతి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 15న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ.. ‘ఈ రోజు మనం అశోక్ గురించి మాట్లాడాలి. అతని గురించి ఎవ్వరికీ తెలియదు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి గల్లా జయదేవ్ పార్లమెంట్ సభ్యుడిగా పదేళ్ల నుంచి వేసిన ముద్ర అందరికీ తెలిసిందే. ఆయన నానమ్మ గల్లా అరుణ గారు ఎమ్మెల్యేగా సేవలు…

‘అతిథి దేవో భవ’ ఏ ఒక్కరినీ నిరాశ పరచదు: ‘అఖండ’ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి

Aadi-Sai-Kumar-s-Atithi-Devo-Bhava-movie-Pre-release-event

ఆది సాయి కుమార్ హీరోగా నువేక్ష హీరోయిన్‌గా ‘అతిథి దేవో భవ’ అనే సినిమాను డైరెక్టర్ పొలిమేర నాగేశ్వర్ తెరకెక్కించారు. రాం సత్యనారాయణ రెడ్డి సమర్ఫణలో శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్ మీద రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల నిర్మించిన ఈ చిత్రం జనవరి 7న విడుదల కాబోతోంది. ఈ సందర్బంగా చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో.. మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మా ఫ్యామిలీ మెంబర్స్ సినిమా తీస్తే మంచిదే తీస్తారు.. చెడ్డది తీయరని నాకు తెలుసు. మొన్నే ఈ సినిమాను తీశాను. డీసెంట్ ఇన్నోసెంట్ లవ్ స్టోరీ. మంచి ఎంటర్టైన్మెంట్ కామెడీ ఉంది. సప్తగిరి గారు సినిమాను వేరే లెవెల్‌కు తీసుకెళ్తారు. ఓ రెండు మూడు నిమిషాలుండే దొంగ కారెక్టర్ చాలా బాగుంది. రోహిణి గారు బాగా చేశారు.…

‘అతిధి దేవోభవ’ అందరినీ మెప్పిస్తుంది: ఆది సాయి కుమార్

Aadisaikuamar interview

ఆది సాయి కుమార్ కథానాయకుడిగా నటించిన ‘అతిథి దేవోభవ’ జనవరి 7న థియేటర్లలో విడుదల కానుంది. శ్రీనివాస సినీ క్రియేషన్స్‌పై రాజబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల నిర్మించారు. పొలిమెర నాగేశ్వర్ దర్శకత్వం వహించిన ఇందులో నువేక్ష కథానాయిక. బుధ‌వారంనాడు హీరో ఆది చిత్రం గురించి ప‌లువిష‌యాలు తెలియ‌జేశాడు. – నా నటన అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను. స్క్రిప్ట్‌లో అంతర్లీన భావోద్వేగ అంశం ఉంది. నా రాబోయే సినిమాలు డిఫరెంట్ జోనర్‌లకు చెందినవి. సినిమాలు బాగా చేస్తాయనే నమ్మకం ఉంటేనే ఒప్పుకుంటున్నాను. – నా సినిమాల్లో కొన్ని రిలీజ్ డేట్ ఆల‌స్యం కారణంగా నష్టపోయాయి. ‘రఫ్’, ‘చుట్టాలబ్బాయి’ చిత్రాలకు సరైన డేట్స్ వచ్చాయి. – ఇక తాజా సినిమా ఎగ్జిక్యూషన్ పార్ట్‌ని దర్శకుడు చాలా బాగా హ్యాండిల్ చేసిన ‘అతిథి దేవోభవ’పై నాకు నమ్మకం ఉంది. పాటలు…

రాజశేఖర్ ‘శేఖర్’ ఫస్ట్ సింగిల్ ‘లవ్ గంటే మోగిందంట..’ విడుదల

Rajashekar first singile love ghanta mogindhanta..relese

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘శేఖర్’. హీరోగా ఆయన 91వ చిత్రమిది. దీనికి జీవితా రాజశేఖర్ దర్శకురాలు. స్క్రీన్ ప్లే కూడా ఆమె సమకూర్చారు. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో, పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. బుధవారం (జనవరి 5న) ఈ సినిమా మొదటి పాటను ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు. “ఒరేయ్ నీ లవ్ స్టోరీ ఒకటి చెప్పురా” అనే వాయిస్ ఓవర్ తో పాట మొదలవుతుంది. మ్యూజిక్ సెన్సేషన్ అనూప్ రూబెన్స్ ఇచ్చిన క్యాచీ ట్యాన్ కి చంద్రబోస్ గారి సాహిత్యంతో ప్రేమ కథని అత్యద్భుతంగా ఆవిష్కరించారు. ఈ పాటని విజయ్ ప్రకాష్,…

నంద‌మూరి బాల‌కృష్ణ‌ # NBK107లో వ‌ర‌లక్ష్మీ శ‌ర‌త్ కుమార్‌

Varalakshmi-Sharathkumar

‘అఖండ’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత న‌టిసింహా నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా ‘క్రాక్’ వంటి సక్సెస్‌ఫుల్ మూవీని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ప‌క్కా మాస్ క‌మ‌ర్షియ‌ల్ మూవీ రూపొందుతోంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది. బాల‌కృష్ణ స‌ర‌స‌న శృతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ చిత్రంలో ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌ ద్వారా క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్ తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. బాలకృష్ణ 107వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం వ‌ర‌లక్ష్మీ శ‌ర‌త్ కుమార్‌ ని ఎంపిక చేసుకున్నారు. ఇదే విషయాన్ని చిత్ర బృందం బుధవారం అధికారికంగా ప్రకటించింది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ‘క్రాక్’ చిత్రం న‌టిగా వరలక్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌ కి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. దీంతో టాలీవుడ్ లో పవర్…

‘ట్రిపుల్ ఆర్’కు ఎన్టీఆర్ పారితోషికం ఎంతో తెలుసా? ​

RRR Movie || NTR Still

టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా ఇమేజ్ కోసం తెగ ఆరాటపడుతున్నారు. ఆ ఇమేజ్ కోసం దేనికైనా రెడీయే అంటున్నారు. అలాంటి ఇమేజ్ వస్తే వంద కోట్లకు పైగా పారితోషికం వస్తుందని కలలుగంటున్నారు. కానీ అదే సమయంలో పరుగెడుతున్న కాలం గురించి మాత్రం మరచిపోతున్నారు. తాజాగా ఎన్టీఆర్ ‘ట్రిపుల్ ఆర్’ విషయానికొద్దాం.. పాన్ ఇండియా ఇమేజ్ కోసం చూసుకుంటే ఈ సినిమాకు సంబంధించి అతడికి నాలుగేళ్ల కాలం వృధా అయిపోయిందిట. కనీసం ఈ సమయంలో ఆరేడు సినిమాలు చేసినా రెండు నుంచి మూడు వందల కోట్ల పారితోషికం అయినా వచ్చి వుండేదని ట్రేడ్ వర్గాలు లెక్కలు చెబుతున్నాయి. పైగా ఆ సినిమాల్లో ఏ రెండో మూడో బ్లాక్ బస్టర్ అయినా ఈ పారితోషికం మరి కాస్త ఎక్కువే అయి వుండేదని అంటున్నారు. అయితే.. డి.వి.వి సినిమాస్ బ్యానర్ పై…

జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలి: టీయూడబ్ల్యూజే డైరీ ఆవిష్కరణలో మంత్రి హరీష్ రావు

Journalists Dairy

కోవిడ్ ను దృష్టిలో పెట్టుకొని  జాగ్రత్తలు తీసుకుంటూ జర్నలిస్టులు విధులు నిర్వర్తించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావు సూచించారు. బుధవారం నాడు కోకాపేట్ లోని తన నివాసంలో ఆయన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) రూపొందించిన మీడియా డైరీ-2022ని ఆవిష్కరించి మాట్లాడారు. కోవిడ్ మొదటి, రెండవ వేవ్ లలో పలువురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. రాబోవు 45రోజుల్లో వైరస్ వ్యాప్తి మరింత ఉధృతంగా ఉండే అవకాశం ఉన్నందున విధిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. జర్నలిస్టులు నిత్యం ప్రజల మధ్యే ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నందున గతంలో తమ ప్రభుత్వం ప్రత్యేక  క్యాంపులను నిర్వహించి వేలాది మంది జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు కోవిడ్ వాక్సిన్ ఇచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే…

OMG ! Telegu Actress Heena Was Bitten By A Scorpion | Check What Happened Next

OMG ! Telegu Actress Heena Was Bitten By A Scorpion | Check What Happened Next

Telugu actress Heena braved scorpion bites filming in the jungles of Telangana for the music video Kala. but She Saved Treated Immediately. To Elaborate on more About shooting and this incidence Heena Said “At The Time Of Shooting there were snakes in the jungle and I was trying to avoid them but unfortunately was bitten by a scorpion. I was rushed to the hospital and given an antidote and taken back to the shoot. The makers wanted to give me a break, but I preferred to shoot and virtually gave…

అదిరిపోయే ‘ఆచార్య’ స్టెప్పులు!

Acharya Megastar chiranjivi dance

మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్‌ కలిసి నటించిన సినిమా ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రం ఫిబ్రవరి 4న ప్రేక్షకులముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రం నుంచి చిరంజీవి, రెజీనాలపై చిత్రీకరించిన ప్రత్యేక గీతం ‘కల్లోలం కల్లోలం.. ఊరు వాడా కల్లోలం’ అనే పాటని మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ‘సానా కష్టం వచ్చిందే మందాకినీ.. చూసేవాళ్ల కళ్లు కాకులెత్తుకు పోనీ..’ అంటూ జోరుగా ఎంతో హుషారుగా సాగిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించగా, రేవంత్‌, గీతామాధురి ఆలపించారు. ప్రేమ్‌ రక్షిత్‌ నృత్యరీతులు సమకూర్చారు. నైట్‌ ఎఫెక్ట్‌లో పాటని చిత్రీకరించిన విధానం, బీట్‌కి తగ్గట్లుగా మెగాస్టార్ వేసిన హుషారైన స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.…

నాగ చైతన్య-సమంతకు మళ్లీ దగ్గరవుతున్నారా!?

Nagachaithanya-Samantha

సమంత నుంచి విడిపోయాక నాగచైతన్య మళ్లీ ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడా?.. సామ్ ను మరచిపో లేకపోతున్నాడా?.. సమంత మదర్ కు ఫోన్ చేసిన నాగ చైతన్య తన భాదంతా వెళ్లగక్కడా ? ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవ్వరినోటవిన్నా ఇవే ప్రశ్నలు. నాగ చైతన్య -సమంత విడిపోయారన్నవార్తను అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు తెగపోస్టులు పెడుతూ హల్ చల్ సృష్టిస్తున్నారు. నాగ చైతన్యకు భార్యగా అక్కినేని ఫ్యామిలీలో ఎంటర్ అయిన తర్వాత సమంత క్రేజ్ మరింత పెరిగిందనడంలో సందేహం లేదు. టాలీవుడ్ స్టార్ కపుల్స్ లో సామ్-చైతూ జంట అప్పట్లో అందరికీ ఫేవరెట్ గా ఉండేది. వీరిద్దరూ ప్రేమించి మరీ పెళ్లి చేసుకోవడంతో సహజంగానే అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే.. వీరి పెళ్లి ఎంతోకాలం నిలవలేదు. పెళ్లి పీటలెక్కి అన్యోన్యంగా దాంపత్య…