“తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం” అధ్యక్షుడు.. వై. కాశీ విశ్వనాథ్, దర్శకుల సంఘం జనరల్ సెక్రటరీ.. వి.యన్ ఆదిత్య, ట్రెజరర్.. భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ కమ్ యాక్టర్ మాదాల రవి సహకారంతో, ‘మెడికవర్’ హాస్పటల్స్‌చే తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ మెంబర్స్‌కు ఫ్రీ మాస్టర్ హెల్త్ చెకప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నటుడు డాక్టర్ మాదాల రవి, మెడికోవర్ క్లస్టర్ హెడ్ డాక్టర్ దుర్గేష్ శివ (మెడికోవర్ క్లస్టర్ హెడ్), డాక్టర్ రిచా నిరాల (మెడికోవర్ సెంట్రల్ హెడ్), సంతోష్ శుక్లా (ఏ.జి.యమ్ మార్కెటింగ్ హెడ్), మరియు ” నాంది” డైరెక్టర్ విజయ్ కనకమేడల.. దర్శకులు.. రవి కుమార్ చౌదరి, వీరశంకర్, చంద్రమహేష్, సముద్ర, వీరభద్రం చౌదరి, దొరైరాజ్, నటుడు, నిర్మాత.. సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన పాత్రికేయుల…
Category: FILM NEWS
సామ్రాట్ : ఒక పచ్చని జ్ఞాపకం!
మా హీరో కొడుకు ఎంట్రీ అంటే మాకెంత జోష్ ఉండాలి? అభిమానమంటే అభిమానమే. నాకు సూపర్ స్టార్ కృష్ణ అంటే పిచ్చి అభిమానం. ఎందుకో మరి… చిన్నప్పటి నుంచి ఉన్న ఆ అభిమానాన్ని మాటల్లో చెప్పలేను. ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నదనుకోండి. కృష్ణ వ్యక్తిత్వం కూడా ఈ అభిమానానికి కారణం కావొచ్చు. ఇక అభిమానమంటే ఒక్క ఆ హీరోకే పరిమితం కాదు. ఆ హీరో కుటుంబం నుంచి ఇంకొకరు సినీ ఎంట్రీ ఇస్తే వాళ్ళ మీదా పొంగుకొచ్చే గొప్ప అభిమానమన్నమాట. ఇది నా బాల్యంలో రమేష్ బాబుకూ, ఇప్పుడు మహేష్ కూ వర్తిస్తున్న అభిమానమే. నిన్న రమేష్ బాబు చనిపోయాడనే వార్త చెవిన పడగానే అతడితో అల్లుకున్న ఓ జ్ఞాపకం మళ్ళీ తాజా తాజాగా కదలాడసాగింది. ఈ జ్ఞాపకం జీవితాంతం వదలని జ్ఞాపకాల్లో ఒకటి. రమేష్ బాబు అనగానే…
‘హైదరాబాద్స్ ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీ బిగ్గెస్ట్ ఫిల్మ్ అండ్ బ్రాడ్ కాస్ట్ ఎక్స్ పో’ పోస్టర్ విడుదల
వివిధ రంగాలకు చెందిన పలు పరిశ్రమలకు మన హైదరాబాద్ అడ్డాగా మారింది. అందువల్ల అంతర్జాతీయంగా ఉన్న ఏ కంపెనీ అయినా… తన ప్రాడక్ట్స్ ను విక్రయించడానికి, వాటి ఉపయోగాలను తెలియచెప్పడానికి హైదరాబాద్ ను ఓ ప్రధాన కేంద్రంగా భావిస్తున్నాయి. ఇదే సమయంలో హైదరాబాద్ లోని నవతరం, అలానే సాంకేతిక నిపుణులు, పెద్ద ఇండస్ట్రీకు సంబంధించిన వారు..ఆ నవీన ఆవిష్కరణల గురించి తెలుసు కోవాలని, తమని తాము అప్ డేట్ చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో కొంతకాలంగా ఎన్నో రకాల ఎక్స్ పోస్ గ్రాండ్ గా జరుగుతున్నాయి. పాన్ ఇండియా మూవీస్ కారణంగా యావత్ భారతదేశం మనవైపు చూస్తోంది. ఇక్కడి సాంకేతికతను గురించి, సాంకేతిక నిపుణుల ప్రతిభ గురించి ఆరా తీస్తోంది. అందుకే మనవాళ్ళు సైతం హాలీవుడ్ టెక్నాలజీని అర్థం చేసుకుని, లేటెస్ట్ ఇన్నోవేషన్స్ ను…
వరుస చిత్రాలతో క్రేజీ కొరియోగ్రాఫర్ గా దూసుకెళ్తున్న పోలాకి విజయ్
టాలెంట్ ఉంటే ఫిల్మ్ ఇండస్ట్రీ నెత్తిన పెట్టుకుంటుంది. మన స్టార్స్ నుంచి ఎంకరేజ్ మెంట్ కు కొదవేం ఉండదు. అలా ఈ మధ్య అల్లు అర్జున్, సమంత లాంటి స్టార్స్ తో ప్రశంసలు అందుకుంటున్నారు యంగ్ కొరియోగ్రాఫర్ పోలాకి విజయ్. ప్యాన్ ఇండియా సెన్సేషన్ పుష్ప ఫంక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొరియోగ్రాఫర్ విజయ్ పోలంకి గురించి ప్రశంసిస్తూ మాట్లాడారు. అలాగే పుష్ప లో సమంత చేసిన ఊ అంటావా, ఉ ఉ అంటావా సాంగ్ కు కూడా పోలాకి విజయ్ యే డాన్స్ మాస్టర్. ఇతని వర్క్ సమంతా కు బాగా నచ్చింది.అందుకే బెస్ట్ విశెస్ చెబుతూ ఎంకరేజ్ చేసింది. రీసెంట్ గా విజేత, కొబ్బరిమట్ట, తిప్పరా మీసం, పలాస 1978, అల్లుడు అదుర్స్, శశి లాంటి అనేక చిత్రాలకు బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ…
Vijay Deverakonda announces 100 ‘DeveraSanta’ winners
Rowdy star Vijay Deverakonda follows a customary Christmas tradition of helping out those in need. He named this philanthropic program ‘DeveraSanta’. This Christmas, Vijay vowed to provide a financial aid or Rs 10,000 to 100 different individuals who are in great need of the same. This year, Vijay’s DeveraSanta program received thousands of requests on social media. Now, Vijay has announced the 100 individuals whom he’ll be helping out. “My loves, check for your names. @TeamDeverakonda will Reach out. And the money transfers will follow : Love, Vijay,” Vijay tweeted.
ఆ నలుగురు ప్రభుత్వాలను తప్పుదోవ పట్టిస్తున్నారు : టియఫ్‌ఫ్ సీసీ చైర్మన్ డా.లయన్ ప్రతాని రామకృష్ణగౌడ్
ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ల రేట్ల విషయంలో పునరాలోచించాలి తెలుగు సినీ పరిశ్రమలో మాఫియా ఇజం జరుగుతోంది తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం మాఫియా ఇజం జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం టికెట్ల రేట్ల విషయంలో ఇటీవల కొత్త జీవో విడుదల చేసింది. దీనివల్ల చిన్న చిత్రాల నిర్మాతలు ఇబ్బందిపడుతున్నారు అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు టియఫ్‌ఫ్ సీసీ చైర్మన్ డా.లయన్ ప్రతాని రామకృష్ణగౌడ్. ఇటీవల రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చిన కొత్త బిల్లు నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా డా.లయన్ ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ…“ గ్రామ పంచాయితీకి ఒక రేటు, మున్సిపాలిటీకి ఒక రేటు జిల్లా స్థాయిలో ఒకరేటు అనే సిస్టమ్ ఉంటే తప్ప చిన్న చిత్రాలు బతికి బట్టకట్టలేని పరిస్థితి.…
`కొత్త కొత్తగా..`ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
ఫన్ ఫిల్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా బిజి గోవిందరాజు సమర్పణలో ఎం. మురళీధర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం `కొత్త కొత్తగా`..హనుమాన్ వాసంశెట్టి దర్శకుడు. అజయ్, విర్తి వఘాని,ఆనంద్ ప్రధానల పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు అనిల్‌రావిపూడి విడుదలచేసి చిత్ర యూనిట్‌కి బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీత దర్శకత్వం వహిస్తుండగా ప్రవీణ్ పూడి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. తారాగణం: అజయ్, విర్తి వఘాని, ఆనంద్, కాశీ విశ్వనాథ్, తులసి, కళ్యాణ్ నటరాజన్, పవన్ తేజ్, ఈ రోజుల్లో ఫేమ్ సాయి సాంకేతిక వర్గం: బ్యానర్: ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణ: బిజి గోవిందరాజు నిర్మాత: మురళీధర్ రెడ్డి ముక్కర దర్శకత్వం: హనుమాన్ వాసంశెట్టి సంగీతం: శేఖర్ చంద్ర ఎడిటర్: ప్రవీణ్ పూడి డీఓపి: వెంకట్…
సమంత ‘యశోద’ సెకండ్ షెడ్యూల్ మొదలు…
సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. హరి – హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ రోజు (గురువారం, జనవరి 6) సెకండ్ షెడ్యూల్ మొదలైంది. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ “సమంత ప్రధాన పాత్రలో మా సంస్థలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ రోజు సెకండ్ షెడ్యూల్ మొదలైంది. ఈ నెల 12 వరకూ ఈ షెడ్యూల్ లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించేలా ప్లాన్ చేశాం. సంక్రాంతి తర్వాత మూడో షెడ్యూల్ స్టార్ట్ చేస్తాం. మార్చి నెలాఖరుకు చిత్రీకరణ పూర్తి అవుతుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏక…
‘లాలాగూడా అంబర్ పేట మల్లేపల్లి మలక్ పేట..’ అంటూ పాటందుకున్న ‘డిజె టిల్లు’
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహాశెట్టి నాయికగా టాలీవుడ్ లోని ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం ‘డిజె టిల్లు’. ఈ చిత్రానికి సంభందించిన ఓ గీతం ఈ రోజు విడుదల అయింది. గాయకుడు రామ్ మిరియాల స్వయంగా ఆలపిస్తూ, స్వరాలు సమకూర్చిన ఈ గీతం విడుదల ఆయన క్షణం నుంచే చార్ట్ బస్టర్ లో దూసుకు వెళుతోంది. సామాజిక మాధ్యమాలలో సైతం స్పందన డీజే స్థాయిలో హోరెత్తుతోంది. పాట వివరాలు, విశేషాలలోకి వెళితే….. “లాలాగూడా అంబర్ పేట మల్లేపల్లి మలక్ పేట టిల్లు అన్న డీజే పెడితే డిల్లా డిల్లా ఆడాల మల్లేశన్న దావత్ ల బన్ను గాని బారాత్ ల టిల్లు అన్న దిగిండంటే డించక్ డించక్ దుంకాల” అనే ఈ పల్లవి గల గీతాన్ని గీతా రచయిత…
ఒమిక్రాన్ దెబ్బకు అజిత్ ‘వాలిమై’ విడుదల వాయిదా
అజిత్ కుమార్ మొదటి ప్యాన్ ఇండియాగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న అజిత్ ‘వాలిమై’ ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల కావాల్సివుంది. కాగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లిష్ట పరిస్థితులు.. రోజు రోజుకి పెరిగిపోతున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసుల నేపథ్యంలో.. ఈ భారీ చిత్రాన్ని థియేటర్స్‌లో ఎంజాయ్ చేయడానికి మరికొన్ని రోజుల సమయం పడుతుందని నిర్మాత బోనీకపూర్ తెలియచేసారు. ఈ సందర్భంగా నిర్మాత బోనీకపూర్ మాట్లాడుతూ: “అభిమానులు, సినీ ప్రేక్షకజనం ఎంతో ఆసక్తి గా మీరు ఎదురుచూస్తున్న ‘వాలిమై’ చిత్రాన్నివాయిదా విడుదల వేసినందుకు మేము చాలా చింతిస్తున్నాము. ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్యా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. థియేటర్లలో మాత్రమే చూడాల్సిన చిత్రం. మీరు సురక్షితంగా, ఎంతో ఆనందంగా థియేటర్లలో స్వేచ్ఛగా వీక్షించాల్సిన అవసరాన్ని దృష్టిలో…
