రియల్ హీరో సోనూసూద్ ట్విట్టర్ లో సరికొత్త రికార్డు!

Real Hero Sonusood Twitter record

రియల్ హీరో సోనూసూద్ గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. ఇటీవల కాలంలో కరోనా సమయంలో ఎంతో మంది పేద ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వారికి అండగా నిలిచాడు. కరోనా ఫస్ట్ వేవ్ లో వలస కూలీల కు అండగా నిలబడి… వారిని స్వగ్రామాలకు తరలించాడు. సహాయం అని అడిగిన ప్రతి ఒక్కరికి అండగా నిలబడ్డాడు. సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేశాడు. ఇప్పటికీ కూడా తన సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇక సోను పై ఉన్న అభిమానంతో చాలామంది ఫ్యాన్స్ గుడులను కూడా కట్టారు. ఇదిలా ఉండగా ట్విట్టర్ లో సరికొత్త రికార్డును సృష్టించాడు సోనూసూద్. ఆయనను ఫాలో అయ్యేవారి సంఖ్య 11 మిలియన్లను దాటింది. భారతదేశంలో అత్యధికంగా అనుసరించే ప్రముఖులలో సోనూసూద్ ఒకడిగా నిలవటం విశేషం!!

కొత్త జంటలపై ఆసక్తి !

new look jantalau

టాలీవుడ్ లో ఇప్పుడు అందరి దృష్టి 2022 ప్రారంభంలో తమ చిత్రాలద్వారా కనువిందు చేసే కొత్త జంటలపై పడింది. అందరినీ ఉత్తేజపరిచే ఈ ఆన్‌స్క్రీన్ జోడీలతో ఆసక్తి నెలకొంది. ఈ 2022 ఖచ్చితంగా బాలీవుడ్‌-టాలీవుడ్ లో కొత్త జంటలు మరియు కొత్త వెండితెర జోడీల సంవత్సరం కానుంది. థియేటర్ల పునఃప్రారంభం.. ఓటీటీ చలనచిత్రాల ప్రవాహం మునుపెన్నడూ లేని విధంగా కంటెంట్‌కు దారితీసింది. తద్వారా ఇంతకు ముందెన్నడూ చూడని నటులు, నటీమణులను వెండితెరపై వీక్షించబోతున్నాం. ఆ జంటలేమిటో ఓసారి లుక్కేద్దాం… రామ్ చరణ్- అలియా భట్ దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ‘ట్రిపుల్ ఆర్’లో రామ్ చరణ్- అలియా భట్ జంట కన్నులపంట కానుంది. ఈ జోడీ కోసం సినీ ప్రేక్షకులే కాదు.. అభిమానులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాఫ్ట్ అండ్ విధేయత కలిగిన అలియా…

Nidhi Agerwal: నిధి అగ‌ర్వాల్ రెమ్యూనరేష‌న్‌ పెంచేసింది!?

Nidhiagerwal

అందాలతార హాట్ బేబీ నిధి అగ‌ర్వాల్ సినిమాల స్పీడు పెంచడమే కాదు.. దాంతో పాటు తన రెమ్యూనరేష‌న్‌కూడా భారీగానే పెంచేసిందట. ఆకట్టుకునే న‌ట‌న‌, గ్లామ‌ర్‌తో యువతరాన్ని క‌ట్టిప‌డేస్తున్న ఈబ్యూటీ ‘స‌వ్య‌సాచి’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయినప్పటికీ నిధి అంద‌చందాల‌కు మాత్రం మంచి ప్రశంసలే లభించాయి. ఆ త‌ర్వాత ‘మిస్ట‌ర్ మ‌జ్ను’లో ఛాన్స్ ద‌క్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’తో కుర్ర‌కారు గుండెల్లో గూడుకట్టుకుంది. ఈ భామ తెలుగులో తాజాగా న‌టించిన చిత్రం ‘హీరో’. యంగ్ హీరో అశోక్ గ‌ల్లాతో జోడీ క‌ట్టిన నిధి ఈ సినిమా కోసం బాగానే డిమాండ్ చేసింద‌ట‌. ఇప్ప‌టివ‌ర‌కు రూ.50 నుంచి 80 ల‌క్ష‌ల రెమ్యూనరేష‌న్‌ అందుకున్న నిధి ఈ సినిమాకు మాత్రం ఏకంగా కోటిన్న‌ర తీసుకున్న‌ట్లు సమాచారం. త‌న కెరీర్‌లోనే తొలిసారిగా ఓ సినిమాకు…

ధనుష్‌, ఐశ్వర్యల విడాకులకు కారణం ఇదా!?

Dhanush-Iswarya

ధనుష్‌, ఐశ్వర్యలు కోలీవుడ్‌లో చూడచక్కని జంటగా పేరుతెచ్చుకున్నారు. అయితే హఠాత్తుగా వీళ్ళిద్దరూ విడిపోవడం సినీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ స్టార్‌ కపూల్‌.. విడాకులు తీసుకోవడం అభిమానుకులకు మింగుడుపడటం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరూ.. 18 ఏళ్ల తర్వాత తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు. స్నేహితులుగా, దంపతులుగా, తల్లిదండ్రులుగా, పరస్పర శ్రేయోభిలాషులుగా 18 ఏళ్లు కలిసి బతికామని, ఇప్పుడు విడిపోవాలని నిర్ణయం తీసుకున్నామని, తమ నిర్ణయాన్ని గౌరవించాలంటూ సోషల్‌ మీడియా వేదికగా ధనుష్‌, ఐశ్వర్య అభిమానులకు విజ్ఞప్తి చేశారు. అయితే వివాదాలకు చాలా దూరంగా ఉండే ఈ జంట.. అకస్మాత్తుగా విడిపోవడానికి కారణం ఇవేనంటూ కొన్ని వార్తలు షికారు చేస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం జరిగిన సుచిలీక్స్ ఉదంతంలో ధనుష్ ఫొటోలు కూడా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే…

ఇక తెలుగు సినిమాల జాతర షురూ..!

Tollywood Cinemala jatara shuroo...!!

తెలుగుచిత్రసీమలో తదుపరి సినిమాల జాతర షురూ కాబోతోంది. పవర్ స్టార్ పవ కళ్యాణ్ ధైర్యం చేయడంతో ఫిబ్రవరి నుంచి సమ్మర్‌ వరకు `ఆర్‌ఆర్‌ఆర్‌, `రాధేశ్యామ్‌`, `సర్కారువారిపాట`, `భీమ్లా నాయక్‌`, `ఆచార్య’ చిత్రాలు ప్రేక్షకులకు కనువిందు చేయబోతున్నాయి. కరోనా ప్రభావంతో సినిమాలన్నీ వరుసగా వాయిదా పడుతూ వస్తున్నాయి. గత రెండేళ్లుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతికి విడుదల కావాల్సిన `ఆర్‌ఆర్‌ఆర్‌`, `భీమ్లా నాయక్‌`, `సర్కారు వారి పాట`, `రాధేశ్యామ్‌` చిత్రాలు వాయిదా పడ్డసంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త రిలీజ్‌ డేట్లు సోషల్‌ మీడియాలో తాజాగా వైరల్‌ అవుతున్నాయి. ఫిబ్రవరి నెల నుంచి ప్రేక్షకులకి సినిమా పండగ తెచ్చేందుకు రెడీ అవుతున్నాయి. అందులో భాగంగా సంక్రాంతికి రావాల్సిన పవన్‌ కళ్యాణ్‌ `భీమ్లా నాయక్‌` వాయిదా పడిన విషయం తెలిసిందే. `ఆర్‌ఆర్‌ఆర్‌`,…

జీ 5 ఒరిజినల్ సిరీస్ ‘లూజర్ 2’ ప్రి రిలీజ్ ఈవెంట్… 21న సిరీస్ స్ట్రీమింగ్!

pre-release of ZEE5 Originals LOSER Season 2 Web Series.

వినోదాత్మక సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, డైరెక్ట్‌-టు-డిజిటల్‌ రిలీజ్‌లతో అన్ని భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకులకు వినోదాన్ని అందిస్తూ ‘జీ`5 ఓటీటీ’ అంటే ‘వినోదం మాత్రమే కాదు, అంతకు మించి’ అన్నట్లు దూసుకు పోతోంది.అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకునేలా జాగ్రత్తలు తీసుకుంటూ అందరి కళ్లూ తనవైపు తిప్పుకుంటోంది. స్పోర్ట్స్ డ్రామా జాన‌ర్‌లో రూపొందిన ఒరిజినల్ సిరీస్ ‘లూజర్’తో వీక్షకుల మనసులు గెలుచుకుంది.ప్రజల కోరిక మేరకు తాజాగా ప్రియదర్శి, ధన్యా బాలకృష్ణన్, కల్పికా గణేష్, శశాంక్, పావనీ గంగిరెడ్డి, హర్షిత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ‘జీ 5’ ఒరిజినల్ సిరీస్ ‘లూజర్ 1 ఏంతో ప్రేక్షాదరణ పొందింది’.ఆ హిట్ సిరీస్ కు సీక్వెల్ గా ”లూజర్ 2′ ను తీసుకువస్తోంది.తొలి సీజన్ అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో  తెరకెక్కింది. ‘లూజర్ 2’కు అభిలాష్ రెడ్డి, శ్రవణ్ మాదాల దర్శకత్వం…

వినూత్నమైన వినోదంతో ఉర్రూతలూగించడానికి వచ్చిన మరో ఓటిటి “సన్ షైన్ ఓటిటి”

ఓటిటి రంగంలో సరికొత్త వినోద విప్లవం ఆవిష్కరించేందుకు సమాయత్తమైన “సన్ షైన్ ఓటిటి యాప్”.ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడిక ప్రపంచంలో ఎక్కడి నుంచైనా.. ఎవరైనా డౌన్ లోడ్ చేసుకుని అపరిమితమైన వినోదాన్ని ఆస్వాదించవచ్చు.ఈ ఓటిటి యాప్  లాంచ్ వేడుక హైదరాబాద్ లోని దస్ పల్లా హోటల్ లో ఘనంగా జరిగింది.ఈ ఓటిటి లాంచ్ వేడుకకు ప్రముఖ కన్నడ దర్శకుడు ప్రభాకర్,యువ హీరో రాం కార్తిక్ ల ముఖ్య అతిధులుగా వచ్చి సన్ షైన్ ఓటిటి ను లాంచ్ చేయడం జరిగింది. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంల ఓటిటి వ్యవస్థాపకుడు శివప్రసాద్ మాట్లాడుతూ..మా సన్ షైన్ ఓటిటి ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది.ఈ ఓటిటి లో సినిమా కంటెంట్ మాత్రమే కాకుండా వెబ్ సిరీస్, గేమ్స్,…

వెంకట్ ప్రభు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న `మ‌న్మ‌థ‌లీల` పోస్ట‌ర్ విడుద‌లైంది

Manmadaleela

చెన్నై 28, ది లూప్‌, మ‌న‌క‌థ` చిత్రాల ఫేమ్ వెంకట్ ప్రభు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ద్విబాషా చిత్రం రూపొందుతోంది. తమిళం)లొ మన్మథలీలై, తెలుగులో మన్మదలీల పేరును ఖ‌రారు చేశారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ఆదివారంనాడు చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ చిత్రం వెంక‌ట్ ప్ర‌భుకు 10వ చిత్రం కావడం విశేషం. అందుకే `వెంకట్ ప్రభు క్వికీ` అనే టాగ్ పెట్టారు. తమిళ నటుడు ‘పిజ్జా 2’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అశోక్ సెల్వన్ హీరోగా నటిస్తుండ‌గా ఆయ‌న స‌ర‌స‌న సంయుక్త హెగ్డే, స్మ్రుతి వెంకట్, రియా సుమన్ నాయిక‌లుగా నటిస్తున్నారు. గ‌తంలో క‌మ‌ల్‌హాస‌న్‌, శింబు చిత్రాల‌కు ఇదేపేరుతో స‌క్సెస్ సాధించారు. ఇప్పుడు మ‌రోసారి మ‌న్మ‌థ‌లీల పేరుతో వెంక‌ట్ ప్ర‌భు చేయ‌డం విశేషం. ఈ తాజా సినిమాను రాక్‌ఫోర్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌పై…

స్టూడియో గ్రీన్ బ్యానర్ లో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తదుపరి చిత్రం

Director Kalyan Krishna Next Film Under Studio Green

నాగార్జున, నాగ చైతన్య నటించిన `బంగార్రాజు`తో సంక్రాంతి బ్లాక్బస్టర్ అందించిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తన తదుపరి చిత్రం అగ్ర నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్ లో చేయనున్నారు. కెఇ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రానికి నిర్మాత. దక్షిణాది చలనచిత్ర రంగంలో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన స్టూడియో గ్రీన్, స్టార్ హీరోలతో హై బడ్జెట్ ఎంటర్టైనర్లను నిర్మించడమే కాకుండా కంటెంట్ రిచ్ సినిమాలను నిర్మిస్తోంది. తెలుగులో కూడా అంతే ప్రజాదరణ పొందిన ఈ బ్యానర్పై నిర్మించిన పలు చిత్రాలు ఇక్కడ డబ్ చేసి విడుదలయ్యాయి. ఈ సందర్భంగా కెఇ జ్ఞానవేల్ రాజా సోమవారంనాడు మాట్లాడుతూ, సంక్రాంతికి బ్లాక్బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో మా బేనర్లో భారీ సినిమా చేయనున్న విషయాన్ని సంతోషంగా ప్రకటిస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో…

Director Kalyan Krishna Next Film Under Studio Green

Director Kalyan Krishna Next Film Under Studio Green

Director Kalyan Krishna who delivered Sankranthi blockbuster with Nagarjuna and Naga Chaitanya starrer Bangarraju will be collaborating with KE Gnanavel Raja of Studio Green production house for his next directorial venture. One of the popular production houses in south India, Studio Green has been making content rich movies, besides producing high budget entertainers with star heroes. Equally popular in Telugu, several films made under the banner were dubbed and released in here. “Happy to Announce, we have collaborated with Telugu Sankranti BLOCK BUSTER #Bangarraju Director @kalyankrishna_k for his next Big…