ఆద్యంతం ఆసక్తికరంగా ‘బిచ్చగాడు 2’ థీమ్ సాంగ్

Here’s the official word – Vijay Antony is the Anti-Bikili in 'Bichagadu 2'
Here’s the official word – Vijay Antony is the Anti-Bikili in 'Bichagadu 2'
Spread the love

విజయ్ ఆంటోనీని స్టార్ హీరోగా మార్చిన సినిమా ‘బిచ్చగాడు’. ఈ చిత్రానికి ప్రస్తుతం ‘బిచ్చగాడు 2’ పేరుతో సీక్వెల్ రూపొందుతోంది. ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు విజయ్ ఆంటోనీ. ఆయన దర్శకత్వంతో పాటు సంగీతాన్ని అందిస్తూ ఎడిటింగ్ బాధ్యతలూ వహిస్తుండటం విశేషం. కావ్య థాపర్ నాయికగా నటిస్తోంది. తాజాగా ‘బిచ్చగాడు 2’ థీమ్ సాంగ్ ను విడుదల చేశారు. ఆ థీమ్ సాంగ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ సినిమా కాన్సెప్ట్ ఎలా ఉండబోతోంది అనే హింట్ ఇచ్చింది.
ఈ థీమ్ సాంగ్ చూస్తే …రోల్స్ రాయిస్ కారులో నుంచి స్టార్ హోటల్ దగ్గర దిగిన కథానాయకుడు అక్కడ బిచ్చగాడిలా మేకప్ వేసుకుంటాడు. ఆటోలో బయటకు వెళ్తాడు. అతను వెళ్తున్నది యాంటీ బికిలీ మిషన్ మీద అనేది తర్వాత తెలుస్తుంది. ఈ మిషన్ ఏంటి అనేది సినిమాలో చూడాలి. చరిత్రను సంపన్నులు రాశారు. పేదల బతుకులు వాళ్లకు తెలియదు. వస్తున్నాడు చరిత్రను మార్చి రాసేందుకు అంటూ యాంటీ బికిలీ లక్ష్యమేంటో థీమ్ సాంగ్ లో చెప్పేశారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ధర్మసంస్థాపనార్దయా సంభవామి యుగే యుగే శ్లోకం నేపథ్యంగా వినిపించింది ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన బిచ్చగాడు 2 థీమ్ సాంగ్ ఆసక్తిరేపుతోంది.
దేవ్ గిల్, హరీష్ పెరడి, జాన్ విజయ్, రాధా రవి, మన్సూర్ అలీ ఖాన్, వైజీ మహేంద్రన్, రాజా కృష్ణమూర్తి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – విజయ్ మిల్టన్, ఓం ప్రకాష్, నిర్మాత – ఫాతిమా విజయ్ ఆంటోనీ, బ్యానర్ – విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, రచన, సంగీతం, ఎడిటింగ్, దర్శకత్వం – విజయ్ ఆంటోనీ.