‘రమణికళ్యాణం’ మంచి ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ తో మనసుని హత్తుకునే సినిమా

'Ramanikalyanam' is a heart-touching film with good emotions and entertainment.
Spread the love

మే22న అందరూ థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేయాలని కోరుతున్నాం
ట్రైలర్ & ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో సూర్య వశిష్ట & టీ

సూర్య వశిష్ట, దీప్షిక హీరో హీరోయిన్స్ గా విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ రమణి కళ్యాణం. కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్ పై విజయ్ ఆదిరెడ్డి, మనోజ్ చింతిరెడ్డి. శ్రీనాథ్ పసుపులేటి, సంజయ్ వెంపరాల నిర్మిస్తున్నారు. కోర్ట్ మూవీ ఫేం రామ్ జగదీష్ డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ సినిమా టీజర్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మే 22న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ అండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ట్రైలర్ లాంచ్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో సూర్య వశిష్ట మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. దర్శకుడు విజయ్ గారు ఎంతో ప్యాషన్‌తో ఈ సినిమా చేశారు. తొలి సినిమాకే ఇలాంటి కథను ఎంచుకోవడం మామూలు విషయం కాదు. చాలా గట్స్ కావాలి. అలాంటి స్క్రిప్ట్‌ను ఎంచుకున్న విజయ్ గారికి ధన్యవాదాలు. రామ్ జగదీష్ గారు అద్భుతమైన డైలాగ్స్ రాశారు. సూరజ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. పాటలన్నీ కూడా అద్భుతమైన హిట్స్ అయ్యాయి. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. మేము చాలా మంచి ప్రయత్నం చేశాం. మీరందరూ సినిమాను ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. మే 22న అందరూ థియేటర్లలో ఈ సినిమా చూసి సపోర్ట్ చేయాలని కోరుతున్నాను.
హీరోయిన్ దీప్షిక చంద్రన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ట్రైలర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ సినిమా గురించి మంచిగా మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి మంచి కథలో నాపై నమ్మకం పెట్టి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. విజయ్ గారి విషయంలో నాకు చాలా గర్వంగా ఉంది. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ సినిమాతో నాకు చాలా ఎమోషనల్ కనెక్షన్ వుంది. మేమంతా ఎంతో ప్రేమతో ఈ సినిమా చేశాం. ప్రేక్షకులు కూడా ఆ ప్రేమను అందిస్తారని ఆశిస్తున్నాను. ఈ సినిమా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అందరూ ఈ సినిమాకు తమ బెస్ట్ ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది.
దర్శకుడు విజయ్ ఆదిరెడ్డి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మే 22న అందరూ తప్పకుండా ఈ సినిమాను థియేటర్లలో చూడాలి. సూరజ్ ఈ సినిమాకు సోల్‌ఫుల్ సాంగ్స్ ఇచ్చారు. పెళ్లి పాట అందరి ఫేవరెట్‌గా మారింది. సినిమా చివరి 20 నిమిషాల్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంటుంది. యువరాజ్, జగదీష్ ఈ సినిమాకు రెండు పిల్లర్లలా సపోర్ట్ చేశారు. నేను అనుకున్న దానికి వాళ్లు ప్రాణం పోశారు. డైలాగ్స్‌కు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. పూర్ణ అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు. ఇందులోని అన్ని పాటలు మీనింగ్‌ఫుల్‌గా ఉంటాయి. మా ఫ్రెండ్స్ ఈ సినిమా నిర్మాణంలో ఎంతో సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అరవింద్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. సూర్య ఈ కథ వినగానే చేద్దాం అన్నారు. ఆయన పర్ఫార్మెన్స్‌ను బిగ్ స్క్రీన్‌పై చూడడానికి ఎదురుచూస్తున్నాను. దీప్షిక తన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయింది. ఈ బ్లైండ్ క్యారెక్టర్ కోసం ఆమె చేసిన హోమ్‌వర్క్‌కు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఈ సినిమాతో ఆమెకు చాలా మంచి పేరు వస్తుంది. ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి గారు చాలా డిఫరెంట్ రోల్ చేశారు. ఆయన పాత్రతోనే సినిమా అంతా నడుస్తుంది. ఇది చాలా మంచి కథ. మంచి ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటాయి. సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ప్రేక్షకుల మనసును హత్తుకుంటుంది. ప్రేక్షకులు మంచి ఫీలింగ్‌తో థియేటర్ నుంచి బయటకు వస్తారు.
శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. దర్శకుడు కథ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. ఇందులో నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. సినిమాలో మనసుకు తగిలే డైలాగ్స్ ఉన్నాయి. రైటింగ్ చాలా బాగుంది. విజయ్ గారు చాలా ప్యాషన్‌తో ఈ సినిమా చేశారు. దీప్షిక చాలా డెడికేషన్‌తో ఈ క్యారెక్టర్ చేసింది. సూర్య కూర్చుని యాక్ట్ చేయడం అంత మామూలు విషయం కాదు. మే 22న ఈ సినిమా విడుదలవుతోంది. థియేటర్లకు వచ్చి ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాను. ఇది చాలా మంచి సినిమా. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది.
అలీ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. దర్శకుడు విజయ్ తన తొలి సినిమాకే చాలా అరుదైన కథను ఎంచుకున్నాడు. ఈ సినిమాకు నేషనల్ అవార్డు రావాలని ఆశీర్వదిస్తున్నాను. విజయ్‌కు సపోర్ట్ చేసిన ఆయన కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు. తను ఈ కథకు పూర్తి న్యాయం చేశాడు. మే 22న ప్రేక్షకులు కూడా ఆయన ప్రయత్నానికి తగిన ఫలితం ఇస్తారని నమ్ముతున్నాను. వశిష్ట మంచి ఆర్టిస్ట్. ఈ సినిమా క్యారెక్టర్‌ను చాలా చక్కగా చేశాడు. ఈ చిత్ర యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్. తప్పకుండా ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
మ్యూజిక్ డైరెక్టర్ సూరజ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు విజయ్ గారికి థ్యాంక్యూ. విజయ్ గారు చాలా ప్యాషన్ ఉన్న వ్యక్తి. చాలా మంచి హ్యూమన్ బీయింగ్. ఈ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి టీమ్‌తో కలిసి ఈ సినిమా చేశాం. అందరూ అద్భుతంగా పనిచేశారు. మే 22న అందరూ థియేటర్లలో ఈ సినిమాను చూసి ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాను.
దర్శకుడు రామ్ జగదీష్ మాట్లాడుతూ.. రమణీ కళ్యాణం చాలా స్పెషల్ ఫిల్మ్. తొలి సినిమా దర్శకుడు ఇలాంటి కథ చేయాలంటే చాలా ధైర్యం కావాలి. విజయ్ అలాంటి ధైర్యంతో ముందుకు వచ్చాడు. ఇలాంటి ఐడియాను స్క్రీన్ మీదకు తీసుకురావడం మామూలు విషయం కాదు. యువరాజ్‌తో కలిసి ఈ సినిమాను రాయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ ఐడియా వచ్చినప్పుడే మేము షాక్ అయ్యాం. కళ్లులేని అమ్మాయి, కాళ్లు లేని అబ్బాయి.. వీరిద్దరి మధ్య లవ్ స్టోరీ అంటే స్క్రీన్‌పై ఎలా ఉంటుందో అనిపించింది. దాన్ని చాలెంజ్‌గా తీసుకుని సినిమా చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుంది.
రైటర్ యువరాజ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. రమణీ కళ్యాణం సినిమా చాలా బాగుంటుంది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అందరూ ఎంతో కష్టపడి పనిచేశారు. మా దర్శకుడు చాలా ప్యాషన్ ఉన్న ఫిల్మ్‌మేకర్. ఆయనకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్యూ. సూర్య, దీప్షిక అందరూ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మనసుపెట్టి పనిచేశారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. ఈ వేడుకలో మూవీ యూనిట్ అందరూ పాల్గొన్నారు.

Related posts