రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న ‘శశివదనే’ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

sashivadane Movie

రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా గౌరీ నాయుడు సమర్పణలో ఎస్వీఎస్ కన్‌స్ట్రక్షన్స్ ప్రై.లి. భాగస్వామ్యంతో ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న చిత్రం ‘శశివదనే’. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. సంగీత దర్శకుడు – నటుడు రఘు కుంచె, తమిళ నటుడు శ్రీమాన్, కన్నడ నటుడు దీపక్ ప్రిన్స్, ‘రంగస్థలం’ మహేష్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయింది. త్వరలో రెండో షెడ్యూల్ స్టార్ట్ కానుంది. నిర్మాత అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ “ఇప్పటివరకూ 30 శాతం చిత్రీకరణ పూర్తయింది. అందులో రెండు మాంటేజ్ సాంగ్స్ కూడా ఉన్నాయి. ఈ షెడ్యూల్‌లో హీరో హీరోయిన్ల మీద ప్రేమ, వినోదాత్మక సన్నివేశాలు తీశాం. త్వరలో ప్రారంభం కానున్న రెండో షెడ్యూల్‌లో రఘు కుంచె గారు, శ్రీమాన్ గారు, ‘రంగస్థలం’…

ఫిబ్ర‌వ‌రి 11న ప్ర‌పంచ‌వ్యాప్తంగా నాలుగు భాష‌ల్లో విడుద‌ల కానున్న `మూన్ ఫాల్‌`

moon faall movie

హాలీ బెర్రీ, పాట్రిక్ విల్సన్, జాన్ బ్రాడ్లీ, మైఖేల్ పెనా ప్ర‌ముఖ తారాగ‌ణంతో రూపొందిన `మూన్ ఫాల్‌` సినిమా ఫిబ్ర‌వరి 11న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌కాబోతుంది. దర్శకుడు రోలాండ్ ఎమ్మెరిచ్ సైన్స్ ఫిక్ష‌న్ సినిమాల‌ను తెర‌కెక్కిచ‌డంలో దిట్ట‌. ‘2012’ , ది డే ఆఫ్టర్ టుమారో, ది పేట్రియాట్, మిడ్‌వే వంటి భిన్న‌మైన చారిత్రక ఇతిహాసాలు చిత్రాల‌ను రూపొందించారు. అతని స్క్రిప్ట్‌లు శక్తివంతమైన భావోద్వేగాలతో కూడిన అద్భుతమైన థీమ్‌లను కలిగి ఉంటాయి. తాజాగా రూపొందిన మూన్ ఫాల్ ప్రేక్ష‌కుల‌ను క‌నువిందు చేయ‌నుంది. $146 మిలియన్ల అంచనా బడ్జెట్‌తో మాంట్రియల్‌లో చిత్రీకరించబడింది. ఫిబ్రవరి 11, 2022న ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాష‌ల్లో విడుద‌కాబోతోంది. క‌థాప‌రంగా చెప్పాంటే, ఒక రహస్యమైన శక్తి చంద్రుడిని దాని కక్ష్య నుండి పడవేస్తుంది. దానిని భూమిపై ఒకదానిపైకి విసిరింది భూమితో పాటు మానవుల జీవితంతో…

ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే రోజు ‘రాధే శ్యామ్’ పార్టీ

radjeshyam party

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ విడుదల తేదీ సమీపిస్తున్న కొద్దీ కొత్తగా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పుడు తాజాగా వాలెంటైన్ వీక్ రావడంతో సినిమా ప్రమోషన్ మరింత ఆసక్తికరంగా చేయబోతున్నారట. సౌత్ ఇండస్ట్రీలోనే మొదటి సారిగా ఈ సినిమా కోసం థీమ్ పార్టీ చేయబోతున్నారని సమాచారం. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్యూట్ లవ్ స్టోరీపై అంచనాలు భారీగా ఉన్నాయి. వాటిని ఇంకా పెంచేస్తూ కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నారు‘రాధే శ్యామ్’ చిత్ర యూనిట్. ఫిబ్రవరి 14 రాత్రి 8 గంటల నుంచి హైదరాబాద్ కెమిస్ట్రీ క్లబ్బులో ఈ పార్టీ మొదలు కానుంది. దీనికోసం ప్రత్యేకంగా సెట్ కూడా వేస్తున్నారు. ఈ థీమ్ పార్టీకి యూనిట్ అంతా హాజరు కానున్నారు. విధికి, విధిరాతకు మధ్య జరిగే…

పూరీ ‘జన గణ మన’లో హీరో ఎవరో తెలుసా?!

purijagannadh director

టాలీవుడ్ లో ఎంత పెద్ద దర్శకుడు అయినా కూడా తన కెరీర్‌లో ఓ కలల ప్రాజెక్ట్ అయితే తప్పకుండా ఉండి ఉంటుంది. అలాగే సెన్సేషనల్ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్ కు కూడా ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. అదే ‘జన గణ మన’. పూరీకి ఎప్పట్నుంచో కోరిక ఈ ప్రాజెక్ట్ చేయాలని. ఈ సినిమాతో దేశానికి ఏదో చెప్పాలని ఎన్నో సంత్సరాలుగా ప్రయత్నిస్తున్నాడు. మూడేళ్ల క్రితం ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు పూరీ జగన్నాథ్. ఈ సినిమాతో ఈయన కోసం మళ్లీ స్టార్ హీరోలు వేచి చూస్తారేమో అనుకున్నారు కానీ అలాంటిదేం జరగలేదు. రామ్ హీరోగా నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ గొప్ప కథేం కాదు.. మామూలు రెగ్యులర్ మాస్ మసాలా సినిమా అంతే. అది విడుదలైన టైమ్‌లో సినిమాలేం లేవు కాబట్టి బ్లాక్ బస్టర్…

Ram Charan – Rashmika : రామ్ చరణ్‌ సెన్సేషనల్ ప్రాజెక్టులో రష్మిక మందన్న!!

Ramcharan-Rashmika manddanna

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక్కో సీజన్‌లో ఒక్కో హీరోయిన్ హవా నడుస్తుంటుంది. రకుల్ ప్రీత్ సింగ్..తర్వాత పూజాహెగ్డే.. ఇప్పుడు రష్మిక మందన్న. ఇలా ఒక్కోసారి ఒక్కో హీరోయిన్ వరస అవకాశాలు అందుకుంటూ క్రేజీ స్టార్ల లిస్టులో చోటు సంపాదిస్తుంటారు. ప్రస్తుతం ఈ హీరోని కదిపినా ఇప్పుడు రష్మిక మందన్న పేరే వినిపిస్తోంది. ముఖ్యంగా స్టార్ హీరోలు కూడా ఒక్కరితో నటించిందంటే చాలు.. వరసగా అంతా అవకాశాలు ఇస్తుంటారు. ఇప్పుడు రష్మిక విషయంలో కూడా ఇదే జరుగుతోంది. తొలిసారి రెండేళ్ల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబుతో రష్మిక చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ సక్సెస్ కావడంతో.. వరసగా ఆమెకు స్టార్స్ పిలిచి మరీ ఛాన్సులిస్తున్నారు. ఈ రెండేళ్లలో రష్మిక కెరీర్ గ్రాఫ్ కూడా ఊపందుకుంది. ఊహించనంతగా బాగా పెరిగిపోయింది.తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ వరస సినిమాలు చేస్తున్న ఈ…

‘ఇట్లు అమ్మ’కు లభిస్తున్న ఆదరణ అనూహ్యం అపూర్వం!!

Amma Movie Still

-ఇట్లు బొమ్మకు మురళి -బొమ్మకు క్రియేషన్స్ కు బ్రహ్మాండమైన బ్రాండింగ్ -వరుసగా పలు చిత్రాల నిర్మాణం ‘అంకురం’ ఫేమ్ సి.ఉమామహేశ్వరావు దర్శకత్వంలో సుప్రసిద్ధ నటి రేవతి టైటిల్ పాత్రలో ఫారిన్ రిటర్నెడ్ బిజినెస్ మేన్ డా: బొమ్మకు మురళి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘ఇట్లు అమ్మ’ ఓటిటి ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. రివార్డులతోపాటు అవార్డులు కూడా వెల్లువెత్తుతున్నాయి. సోనిలివ్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రానికి ఇప్పటికీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. బొమ్మకు క్రియేషన్స్ పేరు మారుమ్రోగుతోంది. ఈ ఉత్సాహంతో వరుసగా పలు చిత్రాల నిర్మాణం జరుపుతోంది బొమ్మకు క్రియేషన్స్. చిత్ర నిర్మాత-బొమ్మకు క్రియేషన్స్ అధినేత డా: బొమ్మకు మురళి మాట్లాడుతూ…”రేవతి గారి నటన, ఉమామహేశ్వరావు దర్శకత్వ ప్రతిభ, మధు అంబట్ ఛాయాగ్రహణం, ప్రవీణ్ పూడి ఎడిటింగ్, సన్నీ ఎమ్.ఆర్ సంగీతం, గోరేటి వెంకన్న గానం-సాహిత్యం, సుచిత్ర చంద్రబోస్…

అనసూయ ‘దర్జా’ ఫస్ట్ లుక్ వచ్చేసింది

అనసూయ ‘దర్జా’ ఫస్ట్ లుక్ వచ్చేసింది

కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ రవి పైడిపాటి. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శనివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో నిర్మాత కేఎల్ నారాయణ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఫస్ట్ లుక్ కూడా ‘దర్జా’గా ఉందని, ఈ సినిమా కూడా దర్జాగా ఆడి, అందరికీ మంచి పేరు తీసుకురావాలని.. చిత్రయూనిట్‌కు ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ హెల్త్ మినిస్టర్ కామినేని శ్రీనివాస్, కెఎల్ నారాయణ, సునీల్, అనసూయ, పృథ్వీ, షకలక శంకర్‌‌తో పాటు చిత్రయూనిట్ మొత్తం పాల్గొంది. ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ఫస్ట్ లుక్ ఆవిష్కరించి, ఆశీస్సులు అందించిన…

Senior Producer KL Narayana Unveiled The First Look of Anasuya’s DARJA

Senior Producer KL Narayana Unveiled The First Look of Anasuya's DARJA

‘Darja’ starring Sunil and Anasuya Presented by Kamineni Srinivas in PSS Entertainment’s Banner is being made as a Fiction and Action Entertainer. Salim Malik is Directing this film while Shivashankar Paidipati is Producing it. Ravi Paidipati is the executive producer. The first look of the film is launched by Senior Producer KL Narayana in an event on Saturday at Hyderabad. KL Narayana wished the entire team by saying that the ‘Darja’ First Look seems Darja and he wish the film to become a big success and bring fame to the…

నవ్విస్తూ… సినిమాపై ఆసక్తి కలిగించిన కిరణ్ అబ్బవరం ‘సెబాస్టియన్ పిసి524’ టీజర్ 

Kiran-Abbavaram-s-Sebastian-P-C-524

టాలెంట్‌ ఉన్నోళ్లకు టాలీవుడ్‌ ఎప్పుడూ వెల్కమ్‌ చెబుతుంది. కథానాయకుడిగా పరిచయమైన ‘రాజావారు రాణిగారు’ సినిమాతో కంటెంట్‌ ఉన్న కుర్రాడని కిరణ్‌ అబ్బవరం పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’తో మరో సాలిడ్ సక్సెస్ అందుకున్నారు. క్లాసు – మాసు, యూత్ – ఫ్యామిలీ… అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ అందుకోవడానికి రెడీ అవుతున్నారు. ‘సెబాస్టియన్ పిసి 524’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘సెబాస్టియన్‌ పిసి524’. కోమలీ ప్రసాద్‌, నువేక్ష (నమ్రతా దరేకర్‌) హీరోయిన్లు. ఎలైట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో జ్యోవిత సినిమాస్ పతాకంపై సిద్ధారెడ్డి బి, రాజు, ప్రమోద్ నిర్మించారు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ నెల 24న సినిమా విడుదల కానుంది. ఈ రోజు టీజర్ విడుదల చేశారు. ‘నీకు రేచీకటి…

‘సకల గుణాభి రామ ట్రైలర్ విడుదల

'Sakala Gunabhi Rama' trailer released by star director Anil Ravipudi and hero Vishwak Sen

E.I.P.L పతాకంపై వి.జే సన్నీ,,శ్రీ తేజ్, ఆషిమా నర్వాల్, తరుణీ సింగ్, నటీనటులు గా వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో సంజీవ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం “సకల గుణాభి రామ”. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకువిడుదలకు సిద్ధమైన సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని వెస్టిన్ హోటల్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ , దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి లు ఈ చిత్రంలో ని పాటలను విడుదల చేయగా..దర్శకుడు అనిల్ రావిపూడి, హీరో విశ్వక్ సేన్ లు చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.ఇంకా ఈ కార్యక్రమంలో కమెడియన్ శివారెడ్డి, బిగ్ బాస్ అల్ సీజన్స్ కాంటెస్టెంట్స్ పాల్గొని చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ తెలియజేస్తూ..టీం అందరికీ అల్ ద బెస్ట్ తెలిపారు..అనంతరం..…