Skip to content
Tuesday, September 29, 2026
  • facebook
  • instagram
  • linkedin
  • twitter
  • Home
  • FILM NEWS
  • Entertainment
  • INTERVIEWS
  • MOVIE REVIEWS
  • Politics
  • Gossips
  • Gallery
  • VIDEOS
  • YOUTUBE
  • E Paper

‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ మూవీని క్వాలిటీతో తీశాం.. అందరికీ నచ్చుతుంది

Posted on Jun 17, 2026Jun 17, 2026
We have made the movie ‘Transfer Trimurtulu’ with high quality; everyone will like it.
We have made the movie ‘Transfer Trimurtulu’ with high quality; everyone will like it.
Spread the love
     

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో, నిర్మాత వడ్డే నవీన్

వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే జిష్ణు సమర్ఫణలో వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. ఈ మూవీతో కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో వడ్డే నవీన్‌కి జోడిగా రాశీ సింగ్ నటించారు. ఈ చిత్రాన్ని జూన్ 19న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు, దామోదర్ ప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో..
వడ్డే నవీన్ మాట్లాడుతూ.. ‘‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ సినిమాకి టీం అంతా కలిసి ఎంతో ప్యాషన్‌తో పని చేశారు. డబ్బుల కోసం పని చేసినట్టుగా నాకు ఎక్కడా అనిపించలేదు. అందరూ ఇష్టపడి, కష్టపడి పని చేశారు. కేవలం స్క్రిప్ట్ కోసమే కమల్‌ను ఏడాది పాటుగా హింసించాను (నవ్వుతూ). కళ్యాణ్‌ని కూడా మ్యూజిక్ విషయంలో ఇబ్బంది పెట్టాను (నవ్వుతూ). ప్రతీ ఒక్కరూ ప్రాజెక్ట్ కోసం ఎంతో కష్టపడ్డారు. రాశీ సింగ్ గారికి మంచి టాలెంట్ ఉంది. ఆమె ఎప్పుడూ పర్‌ఫెక్షన్ కోసం ట్రై చేస్తుంటారు. ఈ పన్నెండేళ్లలో నేను సినిమాలు చేయకపోయినా అభిమానులు నా మీద ప్రేమను కురిపిస్తూనే ఉన్నారు. ఈ జర్నీలో మీడియా కూడా సపోర్ట్ చేస్తూనే వచ్చింది. సినిమా ఆరంభం నుంచే వేగంగా దూసుకుపోతోంది. క్లైమాక్స్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. మంచి క్వాలిటీతో మూవీని తీశాం. థియేటర్‌కు వచ్చి మా సినిమాని చూడండి. కచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.
కేఎస్ రామారావు మాట్లాడుతూ .. ‘వడ్డే రమేష్ గారితో నాకు ఎంతో మంచి అనుబంధం ఉంది. ఆయన దమ్మున్న నిర్మాత. నవీన్ చేసిన సినిమాల్లో దాదాపు అన్నీ హిట్టే అయ్యాయి. ఇన్నేళ్ల గ్యాప్ ఎందుకు తీసుకున్నారో నాకు తెలీదు. కానీ అప్పుడు చూసినట్టుగానే ఇప్పుడు కూడా కనిపిస్తున్నారు. టీజర్, ట్రైలర్ చాలా రిఫ్రెషింగ్‌గా కనిపించాయి. అందరూ నిజాయితీతో ఎంతో కష్టపడి, ఇష్టపడి తీశారనిపిస్తోంది. కమల్ చాలా గొప్పగా మాట్లాడారు. జూన్ 19న రాబోతోన్న ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంతో వడ్డే నవీన్ కమ్ బ్యాక్ ఇస్తుండటం ఆనందంగా ఉంది. ఈ పన్నెండేళ్లలో మంచి స్క్రిప్ట్ దొరకలేదని నవీన్ అన్నారు. మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
రాశీ సింగ్ మాట్లాడుతూ .. ‘‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ సినిమా జూన్ 19న రాబోతోంది. ఈ జర్నీలో నాకు వడ్డే నవీన్ గారు ఎంతో సపోర్ట్ చేశారు. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన కమల్ గారికి థాంక్స్. ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ చిత్రమిది. ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీని చూడండి. కచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు.
దర్శకుడు కమల్ తేజ నార్ల మాట్లాడుతూ.. ‘కొత్త దర్శకుడిని ఇంతలా నమ్మి అవకాశం ఇచ్చిన వడ్డే నవీన్ గారికి థాంక్స్. ఆయనే నాకు ఈ పునాది వేశారు. ఆయనతో చేసిన ఈ ప్రయాణం ఎప్పటికీ నాకు గుర్తుండిపోతుంది. కార్తిక్ మంచి విజువల్స్ ఇచ్చారు. కళ్యాణ్ అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చారు. భిక్షపతి గారు ఇచ్చిన బడ్జెట్‌లో ఎంతో గొప్పగా చేశారు. రాబిన్ సుబ్బు మాస్టర్, రామ్ సుంకర గారు మంచి ఫైట్స్ కంపోజ్ చేశారు. భాస్కర భట్ల గారి సాహిత్యం ఎంతో గొప్పగా ఉంటుంది. ఆర్టిస్టులంతా కూడా సింగిల్ టేక్‌లో నటించేశారు. ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ సినిమాకు పని చేసి ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ప్రతీ ఒక్కరూ మనసు పెట్టి మూవీకి పని చేశారు. గత 12 ఏళ్ల నుంచి వడ్డే నవీన్ గారిని అభిమానులు గుండెల్లో పెట్టుకున్నారు. ఆయన ఫ్యాన్స్ అంతా విజిల్స్ వేసేలా ఈ చిత్రం ఉంటుంది. వడ్డే నవీన్ గారి మీద ప్రేమతో సినిమాకి వస్తే.. త్రిమూర్తులు ఫ్యాన్‌గా బయటకు వెళ్తారు. జెన్ జీ కి కావాల్సిన కంటెంట్ కూడా ఇందులో ఉంటుంది.  జూన్ 19న మా సినిమాని చూసి ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
కెమెరామెన్ కార్తిక్ సుజాత సాయి కుమార్ మాట్లాడుతూ .. ‘‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రానికి అవకాశం ఇచ్చిన వడ్డే నవీన్ గారికి, కమల్ గారికి థాంక్స్. మా సినిమా జూన్ 19న రాబోతోంది. అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.
ఆర్ట్ డైరెక్టర్ భిక్షపతి మాట్లాడుతూ.. ‘‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ సినిమాలో మమ్మల్ని సపోర్ట్ చేసిన వడ్డే నవీన్ గారికి థాంక్స్. ఎంతో ఇష్టపడి, కష్టపడి పని చేశాం. ఇప్పటి వరకు వచ్చిన ప్రతీ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మా సినిమా అందరినీ మెప్పిస్తుంది’ అని అన్నారు.
కాస్ట్యూమ్ స్టైలీష్ట్ శ్రావ్య రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రానికి మాకెంతో సపోర్ట్ చేసిన వడ్డే నవీన్ గారికి థాంక్స్. ప్రతీ ఒక్క విషయాన్ని ఆయన ఎంతో నిశితంగా పరిశీలిస్తారు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా చిత్రం ఉంటుంది’ అని అన్నారు.
కె మ్యూజిక్ ప్రియాంక మాట్లాడుతూ.. ‘‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ ఆడియోని మాకు ఇచ్చిన వడ్డే నవీన్ గారికి థాంక్స్. మ్యూజిక్ చాలా బాగా వచ్చింది. నేను కూడా ఫ్యామిలీతో కలిసి ఈ మూవీని చూడబోతోన్నాను’ అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ నాయక్ మాట్లాడుతూ .. ‘వడ్డే నవీన్ గారికి మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది. అందుకే ఈ సినిమాలో మంచి మ్యూజిక్ వచ్చింది. ఆర్ఆర్ అద్భుతంగా వచ్చింది. కమల్ నన్ను సొంత బ్రదర్‌లా చూసుకున్నాడు. జూన్ 19న మా సినిమా రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
భాస్కర భట్ల మాట్లాడుతూ .. ‘వడ్డే నవీన్ గారు నా గురించి అడిగి, ఎంక్వైరీ చేయించి మరీ నాతో పాట రాయించుకున్నారు. కమల్ మంచి కథను రాసుకున్నారు. కళ్యాణ్ నాయక్ నాకు సొంత బ్రదర్‌లాంటి వాడు. ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

Post navigation

Previous: పర్సంటేజ్ సబ్ కమిటీ నుంచి సురేష్ బాబు, దిల్ రాజు తప్పుకోవాలి
Next: హీరో, నిర్మాత వడ్డే నవీన్ ఇంటర్వ్యూ: కథ నచ్చితే మల్టీస్టారర్ కు రెడీ..

Related Posts

The teaser of ‘Panch Minar’ is very interesting. After watching the teaser, I was confident that the film will be a big hit: Blockbuster director Maruthi at the teaser launch event
  • Entertainment
  • FILM NEWS

‘పాంచ్ మినార్’ టీజర్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. టీజర్ చూడగానే సినిమా మంచి హిట్ అవుతుందనే నమ్మకం కలిగింది: టీజర్ లాంచ్ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ మారుతి

  • M.D ABDUL
  • Apr 13, 2025
  • 0
Spread the love
     

Spread the love     యంగ్ ట్యాలెంటెడ్ రాజ్ తరుణ్ హీరోగా రామ్ కడుముల దర్శకత్వంలో […]

Nani has completed a career of 15 years!
  • Entertainment
  • FILM NEWS

15 ఏళ్ల కెరీర్‌ పూర్తి చేసుకున్న నాని!

  • M.D ABDUL - Tollywoodtimes
  • Sep 6, 2023
  • 0
Spread the love
     

Spread the love     ఎంచుకున్న పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే స్టార్స్‌ లో […]

హీరోయిన్ అవికాగోర్‌ ఇంటర్వ్యూ..
  • Entertainment
  • FILM NEWS

నా ఫోకస్‌అంతా ‘పాప్‌కార్న్’ మీదే : హీరోయిన్ అవికాగోర్‌ ఇంటర్వ్యూ..

  • M.D ABDUL - Tollywoodtimes
  • Feb 9, 2023
  • 0
Spread the love
     

Spread the love     అవికాగోర్‌ మనకు ‘చిన్నారి పెళ్లికూతురు’గా బాగా తెలుసు. ‘ఉయ్యాలా జంపాలా’ […]

Live Update

View All
I want to do good performance-oriented characters in Telugu - Bollywood actress Hema Sharma
  • INTERVIEWS

I want to do good performance-oriented characters in Telugu – Bollywood actress Hema Sharma

  • M.D ABDUL
  • Sep 23, 2026
  • 0

Bollywood actress Hema Sharma, who gained good recognition by acting in films like Yamla Pagla…

I want to play good performance-oriented roles in Telugu: Bollywood actress Hema Sharma.
  • INTERVIEWS

తెలుగులో మంచి పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది : బాలీవుడ్ నటి హేమ శర్మ

  • M.D ABDUL
  • Sep 23, 2026
  • 0

బాలీవుడ్ లో యమ్లా పగ్లా దీవాన ఫిర్ సే, వన్ డే జస్టిస్ డెలివెరడ్, దబాంగ్ 3 వంటి చిత్రాల్లో…

Mahendragiri Varahi Movie Review... A Suspense-Filled Devotional Thriller!
  • MOVIE REVIEWS

మహేంద్రగిరి వారాహి మూవీ రివ్యూ.. సస్పెన్స్ డివోషనల్ థ్రిల్లర్!

  • M.D ABDUL
  • Sep 21, 2026
  • 0

సుమంత్‌.. చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుంటాడు. ఒకప్పుడు పక్కా మాస్‌ కమర్షియల్‌ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ అక్కినేని హీరో..…

Hatah Will Surprise Audiences With Every Scene: Kiran Abbavaram at Teaser Launch Event
  • FILM NEWS

“హతః” క్రేజీ ఫిలిం, ప్రతి సీన్ సర్ ప్రైజ్ చేస్తుంది, ఈ దీపావళికి ఒక కొత్త మూవీ అందించబోతున్నాం – టీజర్ లాంఛ్ ఈవెంట్ లో ప్రొడ్యూసర్ కిరణ్ అబ్బవరం

  • M.D ABDUL
  • Sep 18, 2026
  • 0

నవంబర్ 6న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "హతః" సినిమా పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్…

Hatah Will Surprise Audiences With Every Scene: Kiran Abbavaram at Teaser Launch Event
  • Entertainment

Hatah Will Surprise Audiences With Every Scene: Kiran Abbavaram at Teaser Launch Event

  • M.D ABDUL
  • Sep 18, 2026
  • 0

Kiran Abbavaram's Hatah, produced under KA Productions in association with Pournami Entertainments, is gearing up…

“PremaneOorilo Will Bring Recognition to Everyone Who Worked on the Film and Good Profits to the Producers” – Actress Kamakshi Bhaskarla
  • FILM NEWS

‘ప్రేమనే ఊరిలో’ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు రావాలని, నిర్మాతకు మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను :సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో కామాక్షి భాస్కర్ల

  • M.D ABDUL
  • Sep 18, 2026
  • 0

మహారత్న ప్రొడక్షన్స్, ఎస్‌కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా…

Copyright © 2024 Tollywoodtimes.in Powered by LikhiMedia Theme: National News By Adore Themes.