రామ్ హీరోగా నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంలో కథానాయికగా నటించిన నభా నటేష్ ఈ చిత్రంలో మాస్ లుక్‌తోనే కాదు తన బాడీ లాంగ్వేజ్‌తోనూ యువత హృదయాలను కొల్లగొట్టింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అటు రామ్ కు, ఇటు పూరీ జగన్నాథ్ కే కాదు.. ఈ ఇస్మార్ట్ పోరీ నభా నటేష్ కు కూడా కలిసొచ్చింది. నభా పర్ఫార్మెన్సు మంచి మార్కులే పడ్డాయి. ఆమె నటనకు ప్రతి ఒక్కరు మంత్ర ముగ్దులయ్యారు. తాజాగా ‘అల్లుడు అదుర్సు’ అనే చిత్రంలో నటించిన నభా ఈ సినిమాతోను ప్రేక్షకులకు మంచి వినోదం అందించనుందని అంటున్నారు. అయితే రెగ్యులర్‌గా ఫొటో షూట్ లతో పిచ్చెక్కించే నభా తాజాగా ఎరుపు రంగు డ్రెస్‌లో హోయలు పోతూ నెటిజనుల మతిపోగోడుతుందట. ఆమె ఫొటోలతో పిచ్చెక్కించింది. ప్రస్తుతం నభా హాట్ ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అయితే.. ఇలాంటి హాట్ ఫొటోలు ఇస్మార్ట్ పోరీని గట్టెక్కిస్తాయా?! అని అంటున్నారు టాలీవుడ్ పెద్దలు. మూడు వారాల వ్యవధిలోనే రెండు చిత్రాల్లో హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకొస్తున్న నభా ఇప్పుడు తెగ ముచ్చట్లు చెబుతోంది. ‘అందరికీ 2020 కష్టంగా గడిచింది. కొవిడ్ వల్ల అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఏడాది ఆఖరున ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రంతోనే థియేటర్లలో పెద్ద తెలుగు సినిమాల విడుదల ప్రారంభమైంది. ఆ చిత్రం హిట్ కావటం చాలా సంతోషం కలిగించింది. ఈ ఆనందాన్ని ‘అల్లుడు అదుర్స్’ కొనసాగిస్తుంది. ఇది ఫక్తు కమర్షియల్ సినిమా. ఇస్మార్ట్ శంకర్‌లో తెలంగాణ అమ్మాయి పాత్ర చేశాను. కాబట్టి అందరూ నేను ఆ తరహా పాత్ర చేస్తున్నాననుకుంటున్నారు. కానీ ఈ పాత్రలో వైవిధ్యం ఉంది. ఇప్పటి దాకా నేను చేసిన పాత్రలకు భిన్నమైనది.. కొన్ని పాత్రలకు మాత్రమే పరిమితమవకుండా రకరకాల పాత్రలు పోషించాలనేది నా కోరిక. నటనలో వేరియేషన్ చూపించాలనేది నా భావన. గతేడాదంతా తెలుగు చిత్రాల షూటింగ్‌లతోనే గడిచింది. అందువల్లే ఇతర భాషా చిత్రాలలో నటించలేదు. నా కెరీర్ తొలిరోజుల్లోనే పెద్ద నటులతో కలిసి నటించే అవకాశం లభించింది. ఆ విధంగా చూస్తే నేను చాలా లక్కీగాళ్ ని ‘అని చెప్పుకొచ్చింది ఇటీవల ఓ సందర్భంలో.
హాట్ ఫొటోలతో ఇస్మార్ట్ పోరి మతిపోగోడుతోంది!?
