మరోసారి రీఎంట్రీకి ఇషా చావ్లా రెడీ!

eshachawla ready for ree entry
eshachawla ready for ree entry
Spread the love

టాలీవుడ్ లో ‘ప్రేమ కావాలి’ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన ఇషా చావ్లా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే నటసింహ నందమూరి బాలకృష్ణ సరసన ఆమె ‘శ్రీమన్నారాయణ’ చిత్రంలో నటించింది. సునీల్ సరసన ‘పూలరంగడు’ , ‘Mr. పెళ్ళికొడుకు’ అనే రెండు చిత్రాలలో నటించింది. అయితే ఈ మధ్యకాలంలో ఈ భామ ఎక్కడా కనిపించలేదు. తెలుగు సినిమాలు కూడా చేయడం లేదు.అయితే తాజాగా ఆమె మరోసారి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది, తాజాగా కొన్ని లేటెస్ట్ ఫొటోలు, వీడియో బైట్ ప్రెస్‌కు రిలీజ్ చేసింది. ఈసందర్బంగా ఇషా చావ్లా మాట్లాడుతూ – ”మరోసారి మీ ముందకు రాబోతున్నాను , తెలుగులో రెండు సినిమాలు కమిట్ అయ్యాను వివరాలు త్వరలోనే మీకు తెలియజేస్తాను” అని అన్నారు.