శంకర్ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయమా?

Ramcharan Movie
Spread the love

సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ -కియారా అద్వానీ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఓ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రొడ్యూసర్స్ దిల్ రాజు-శిరీష్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. భారీ పాన్ ఇండియా చిత్రమిది. డైరెక్టర్ శంకర్ భారీ బడ్జెట్ సినిమాలు చేస్తుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే.. ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా ఇదే కాబట్టి ఈ మూవీ పైన భారీ అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా, ముఖ్యమంత్రిగానూ కనిపించబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో తీవ్రంగా హల చల్ చేస్తున్నాయి. అయితే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి భారీ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’ లో నటించారు. జనవరి 7 న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడటంతో అభిమానులు నిరుత్సాహపడ్డారు. ఇటీవలే మార్చ్ 18న లేదా ఏప్రిల్ 28న మూవీని రేలీజ్ చేస్తామంటూ ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ టీం ప్రకటించారు. డైరెక్టర్ శంకర్ – రామ్ చరణ్ చిత్రానికి సంబంధించిన మరో షాకింగ్ అప్డేట్ బాగా చక్కర్లు కొడుతోంది. .శంకర్ సినిమా అంటే మొదటి నుంచి గ్రాండీయర్ లుక్ ఉంటుంది. తన సినిమాలలో పాటల కి పెద్దపీట వేస్తారు అన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతి సినిమాలో పాటలకు చాలా ఖర్చు అవుతుంది కానీ ఈసారి ఏకంగా దాదాపు 25 కోట్లు పెట్టబోతున్నారట. తక్కువ బడ్జెట్ లో సినిమాలు తీసే దిల్ రాజు ఒక్క పాటకి ఇంత పెద్దమొత్తంలో కోట్లు వెచ్చించడం అనేది అందరూ చర్చించుకుంటున్నారు. ఇదే 25 కోట్లతో దిల్ రాజు ఒక సినిమాని తీస్తాడు. అలా తీసిన ఎన్నో సినిమాలు మంచి విజయాలను సాధించాయి. పెద్ద హీరోలతో సినిమాలు చేసినప్పటికీ దిల్ రాజు ఇప్పటి వరకూ మరీ భారీ బడ్జెట్ సినిమాలు తీసింది లేదు. కానీ ఒక్కసారిగా శంకర్ తో ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేపట్టడం…అటువైపు శంకర్ ఏ విషయం లో తగ్గకపోవడంతో సినిమా ఎలా ఉండబోతోంది అన్నది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనప్పటికీ రామ్ చరణ్ అభిమానులకు ఈ చిత్రంపై ఎన్నో అంచనాలున్నాయి. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని దర్శకుడు చెబుతున్నారట! అదీ..విషయం!!

Related posts

Leave a Comment