రకుల్ ప్రీత్ సింగ్ తన కెరీర్ ను కాపాడుకోవడంలో ఎప్పటికప్పుడు ఆచి తూచి అడుగులు వేస్తోంది. కెరీర్ పరంగా మరో రెండేళ్ల పాటు ఎలాంటి డోకాలేనన్ని ప్రాజెక్టులతో యమబిజీగా ఉంది. చాలామంది రకుల్ బాగా వెనకబడి పోయిందని దుమారం లేపారు. ఇండస్ట్రీ వర్గాల్లో ఇక ఆమె పని అయిపోయిందని కూడా రూమర్సు సృష్టించారు. దాంతో రకుల్ కు బాగా మండిపోయింది. రేస్ లో వెనకబడుతోందన్న కథనాల నడుమ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులకు సంతకాలు చేసి కెరటంలా రివ్వుమని దూసుకొచ్చింది. తనపై విమర్శలు వచ్చిన ప్రతిసారీ ఇదే రకంగా సమాధానమిస్తూ తన చాకచక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇటీవల ఓ సందర్భంలో రకుల్ రకరకాల విషయాలపై మనసు విప్పి మాట్లాడింది. ఈ భామ ఇప్పటికి పలు చిత్రాలతో బిజీగా ఉన్నానని చెప్పింది. రాబోయే రెండుమూడేళ్ల వరకు బిజీగానే ఉన్నానని అంది. అయితే రకుల్ కు సంబంధించి ఓ యువ హీరోతో డేటింగ్ వ్యవహారం ఇటీవల సోషల్ మీడియా బాగా చక్కర్లు కొడుతోంది. ఈ విషయం గురించి ఆమెని కదిలిస్తే.. “అవును.. నేనూ విన్నాను. ఇలాంటి రుమార్సు ఎందుకు పుట్టిస్తారో అర్థం కావడంలేదు. అతడెవరో చెబితే నేనూ ఓ లుక్కేస్తాగా. అతడితో ప్రేమలో మునిగితేలుతా. అంతే కాదు.. అతడే నా రియల్ హీరో అని అనుకుంటా (నవ్వుతూనే..). ఎవరెన్ని చెప్పినా నేను మాత్రం ప్రస్తుతం ఒంటరిగా ఉన్నా. కానీ ఏదో ఒకరోజు పెళ్లి చేసుకునేందుకు సిద్ధమే. ప్రేమ వివాహం అంటే కూడా ఇష్టమే” అని చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్ సింగ్!
రకుల్ ప్రీత్ సింగ్ రియల్ హీరో ఎవరో తెలుసా?
