టాలీవుడ్ లో ‘ప్రేమ కావాలి’ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన ఇషా చావ్లా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే నటసింహ నందమూరి బాలకృష్ణ సరసన ఆమె ‘శ్రీమన్నారాయణ’ చిత్రంలో నటించింది. సునీల్ సరసన ‘పూలరంగడు’ , ‘Mr. పెళ్ళికొడుకు’ అనే రెండు చిత్రాలలో నటించింది. అయితే ఈ మధ్యకాలంలో ఈ భామ ఎక్కడా కనిపించలేదు. తెలుగు సినిమాలు కూడా చేయడం లేదు.అయితే తాజాగా ఆమె మరోసారి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది, తాజాగా కొన్ని లేటెస్ట్ ఫొటోలు, వీడియో బైట్ ప్రెస్కు రిలీజ్ చేసింది. ఈసందర్బంగా ఇషా చావ్లా మాట్లాడుతూ – ”మరోసారి మీ ముందకు రాబోతున్నాను , తెలుగులో రెండు సినిమాలు కమిట్ అయ్యాను వివరాలు త్వరలోనే మీకు తెలియజేస్తాను” అని అన్నారు.
మరోసారి రీఎంట్రీకి ఇషా చావ్లా రెడీ!
![eshachawla ready for ree entry](https://tollywoodtimes.in/wp-content/uploads/2021/06/Esha-chawla-6-scaled.jpg)