కనుమరుగవుతున్న తెలుగు నేలకి చెందిన ఎన్నో జానపద గేయాలు ఇప్పుడిప్పుడే వెండితెరపై పురుడుపోసుకుంటున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇలాంటి కనుమరుగు అవుతున్న కలలని కూడా ఎప్పటికప్పుడు తన సినిమాలు ద్వారా పరిచయం చేస్తూ తనవంతూ బాధ్యతని నిర్వర్తిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేవలం హీరోగానే కాకుండా తానొక మల్టీ టాలెంటెడ్ మేన్ అని కూడా నిరూపించుకుంటున్నారు. ఇక ఇప్పుడు తన తాజా చిత్రం ‘బీమ్లా నాయక్’లో కూడా ఒక అదిరే పాటని పాడాడని మొదటి నుంచి కూడా కన్ఫర్మేషన్ ఉంది. మరి ఈ మాస్ సాంగ్ ని పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గానే రికార్డింగ్ కంప్లీట్ చేసేసుకున్నారనిసమాచారం. దీనికి సంబంధించిన ఒక ఫోటో కూడా బాగా వైరల్ అవుతోంది. ఈ ఫొటోని గమనిస్తే.. ఏదో పాట పాడినట్టుగానే కనిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో అనేది చూడాలి. ఇక ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. థమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సాగర్ కె చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే!
‘బీమ్లా నాయక్’లో పవన్ కళ్యాణ్ పాట!?
