‘సర్కార్ బాయి’ప్రారంభం

'Sarkar Bai' begins

తెలంగాణ సామాజిక నేపథ్యంతో రాబోతున్న చిత్రం ‘సర్కార్ బాయి’. శ్రీరామ్ నిర్మల, సాయి కీర్తన హీరో హీరోయిన్లుగా, లారా దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్కార్ బాయి’ చిత్రానికి సికింద్రాబాద్ గణేష్ టెంపుల్‌లో పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముహూర్తం కార్యక్రమంలో భాగంగా నిర్మాత తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, దర్శకురాలు లారా సీన్ డైరెక్షన్ చేశారు. ముహూర్తం షాట్‌ను తెలంగాణ ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారి దాస్య నాయక్ క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కు అతిథులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దర్శకురాలు లారా మాట్లాడుతూ.. 1985 సంవత్సరంలో జరిగిన నీటి సంఘటనలు, కుల వివక్షత వంటి అంశాలను ఆధారంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యలను ప్రతిబింబించే కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం రెండు తెలుగు…