ఆర్కే టెలీ షో 25 ఏళ్ల వేడుకలో ‘సర్కారు నౌకరి’టీజర్ విడుదల

RK Tele Show 'Sarkaru Naukari' Teaser Released in Celebration of 25 Years

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మాణ సంస్థ ఆర్కే టెలీ షో స్థాపించి 25 ఏళ్లవుతున్న సందర్భంగా హైదరాబాద్ లో వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని సునీత కుమారుడు ఆకాష్ ను హీరోగా పరిచయమవుతున్న‘‘సర్కారు నౌకరి’’ సినిమా టీజర్ విడుదల చేశారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో భావనా వళపండల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆర్కే టెలీ షో 25 ఏళ్ల వేడుకలో నిర్మాతలు సురేష్ బాబు, మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, టీజీ విశ్వప్రసాద్,ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా… నిర్మాత డి.సురేష్ బాబు మాట్లాడుతూ – నిర్మాతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న రాఘవేంద్రరావు గారికి కంగ్రాట్స్ చెబుతున్నా. ఆర్కే టెలీ షో ద్వారా ఆయన రాజమౌళి లాంటి ఎంతోమందికి ఆయన బ్రేక్ ఇచ్చారు. అందులో…