మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వినోదాత్మక మరియు వైవిధ్యమైన చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని మరియు భారీగా అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన తన తదుపరి చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కోసం రచయిత-దర్శకుడు కృష్ణ చైతన్య మరియు ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో చేతులు కలిపారు. ప్రకటన నుంచే ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుకుంటూ పోతోంది చిత్ర బృందం. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, అలాగే ‘సుట్టంలా సూసి’ అనే మెలోడీ గీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను పెంచేశాయి. ప్రముఖ నటి నేహా శెట్టి ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. సుప్రసిద్ధ, ప్రతిభావంతులైన నటి అంజలి ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం చీకటి ప్రపంచంలో…