డిఫరెంట్ మూవీస్‌ని చేస్తూ హీరోగా తనదైన ఇమేజ్ సంపాదించుకున్న కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్. సంయుక్తా మీనన్, మాళవికా నాయర్ హీరోయిన్స్. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా దర్శక నిర్మాతగా ఈ సినిమాను రూపొందించారు. డిసెంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా సినిమా భారీ ఎత్తున విడుదలవుతుంది.ఈ సందర్భంగా సంగీత దర్శకుడు హర్షవర్దన్ రామేశ్వర్ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విశేషాలివే.. * డెవిల్ సినిమా విషయంలో సంగీతం, నేపథ్య సంగీతానికి ఈ స్థాయిలో స్పందన వస్తుందని అనుకోలేదు. అందరికీ నచ్చుతుందని అనుకున్నాం. కానీ ఈ రేంజ్‌లో ప్రశంసలు వస్తాయని అనుకోలేదు. అందరూ ఫోన్లు చేసి ప్రశంసిస్తున్నారు. * అర్జున్ రెడ్డి తరువాత నన్ను బ్యాక్ గ్రౌండ్ స్పెషలిస్ట్ చేశారు. కానీ నాకు పాటలకు…