మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాన్, రోషన్ మేక, శనయ కపూర్, జహ్రా ఖాన్‌లతో పాన్ ఇండియా వైడ్‌గా చేస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘వృషభ’. ఈ ప్రాజెక్టులోకి హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నిక్ తుర్లో భాగస్వామి అయ్యారు. మూన్ లైట్ (2016), థ్రీ బిల్‌బోర్డ్స్ అవుట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరీ (2017) వంటి ఎన్నో హాలీవుడ్ సినిమాలు నిక్ తుర్లో నిర్మించాడు. సహ నిర్మాతగా వ్యవహరించాడు. వృషభ టీంలోకి నిక్ తుర్లో రావడంతో ఈ సినిమా హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన 57 సెకన్ల వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో సినిమాలోని సెట్స్, ఎంత భారీగా తెరకెక్కించబోతోన్నారనే విషయాన్ని చూపించారు. హాలీవుడ్ స్టైల్‌ను ఫాలో అవుతున్న తీస్తోన్న మొదటి సినిమాకు వృషభ రికార్డులకు ఎక్కింది. హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నిక్ తుర్లో మాట్లాడుతూ..…