Happy wedding Anniversary : ప్రేమకు ప్రతిరూపం విష్ణు – విరానిక

Happy wedding Anniversary Vishnu manchu-viranika

మంచు విష్ణు, విరానికా రెడ్డి.. ఈ రెండు పేర్లు వింటేనే ఆల్ టైం బెస్ట్ కపుల్ అని తెలుగు ప్రజలంతా గర్వంగా చెప్పుకుంటారు. ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట.. రాముడు, సీతలా.. అసలు సిసలు దాంపత్య జీవనానికి అద్దం పడుతున్నారు. వ్యక్తిగతంగానూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని, వివాహ బంధంలోనూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ధనం, పలుకుబడి ఉన్నా.. ఎలాంటి గర్వానికి పోకుండా సాదాసీదాగా జీవనం గడిపేస్తూ, హుందాతనం మెయింటైన్ చేస్తూ.. చూడముచ్చటైన జంటగా పేరొందారు. ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకుంటూ, తెలుగు ఇండస్ట్రీలో చూడముచ్చటైన జంటగా నిలిచారు. మంచు విష్ణు, విరనికా రెడ్డి పెళ్లి రోజు సందర్భంగా ఈ జంటకు బెస్ట్ విషెస్ చెప్తూ.. ఈ లవ్ బర్డ్స్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. రంగస్థలం నుంచి అన్ని రంగాల వరకు.. మంచు విష్ణు…