‘ఆ నలుగురు’ చిత్రంతో రచయితగా గుర్తింపు పొంది, ఆపై దర్శకుడిగా మారిన మదన్ (రామిగని మదన్ మోహన్ రెడ్డి) శనివారం నవంబర్ 20 తెల్లవారుజామున 1 గంట 41 నిమిషాలకి కన్నుమూశారు. తెలుగులో అనేక సినిమాలుకు దర్శకుడిగా వ్యవహరించిన మదన్ హఠాన్మరణం పాలవడంతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. మదన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో నాలగు రోజుల కిత్రం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. అయితే పరిస్థితి విషమించడంతో శనివారం తుదిశ్వాస విడిచారు. చిత్తూరు జిల్లా మదనపల్లె లో జన్మించిన మదన్ పూర్తి పేరు ఆర్.మదన్ మోహనరెడ్డి. రాజేంద్రప్రసాద్ హీరోగా రూపొందిన ఆ నలుగురు (2004) చిత్రంతో ఆయన రచయితగా పరిచయమయ్యారు. ఆ తర్వాత జగపతిబాబు, ప్రియమణి జంటగా నటించిన పెళ్లయిన కొత్తలో(2006), చిత్రంతో దర్శకుడిగా మారారు. ఉదయ్‌కిరణ్ హీరోగా…