విశ్వకార్తికేయ, దీప ఉమావతి హీరోహీరోయిన్లుగా శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై చలపతి పువ్వల దర్శకత్వంలో ఏమ్. సుధాకర్ రెడ్డి నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం ‘కళాపోషకులు’. నటుడు జెమిని సురేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ రోజు హైదారాబాద్ ఫిలిం ఛాంబర్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఈ మూవీ టీజర్ ను మీడియా తరుపున సీనియర్ జర్నలిస్ట్ ప్రభు విడుదలచేసి చిత్ర విజయాన్నిఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో.. దర్శకుడు చలపతి పువ్వల మాట్లాడుతూ – ‘‘ముందుగా నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన మా నిర్మాత సుధాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. సుధాకర్ రెడ్డి గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించడం వల్లే ఔట్‌పుట్ ఇంతబాగా వచ్చింది. ఆ నలుగురు…