నేచురల్ స్టార్ నాని మాసియస్ట్ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ‘దసరా’ మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కీర్తి సురేష్ కథానాయికగా, నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మించిన ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకులని నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోన్న దసరా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్ననేపధ్యంలో కరీంనగర్ లో ‘దసరా బ్లాక్ బస్టర్ దావత్’ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించిన దసరా దర్శకుడు శ్రీకాంత్ ఒదెలకు బిఎండబ్ల్యు కారుని బహుకరించారు నిర్మాత సుధాకర్ చెరుకూరి. అలాగే దసరా యూనిట్ సభ్యులందరికీ పది గ్రాముల గోల్డ్ కాయిన్స్…