పిల్లా నువ్వులేని జీవితం, ఈడోరకం, ఆడోరకం వంటి హాస్య ప్రధాన చిత్రాలతో రచయితగా తనదైన ముద్రవేసుకున్న డైమాండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందుతున్న హిలేరియస్ ఎంటర్ టైనర్ ‘అన్ స్టాపబుల్’. ‘అన్ లిమిటెడ్ ఫన్’ అన్నది ఉపశీర్షిక. బిగ్ బాస్ విన్నర్ విజె సన్నీ, సప్తగిరి హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లు. ఎ2 బి ఇండియా ప్రొడక్షన్ లో రజిత్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలియన్ ‘అన్ స్టాపబుల్’ టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘అన్ స్టాపబుల్’ మ్యూజికల్ ప్రమోషన్స్ ని సమొదలుపెట్టారు మేకర్స్. ధమాకా కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ బుల్ బుల్ అన్ స్టాపబుల్ ని మాచో స్టార్ గోపీచంద్ లాంచ్ చేశారు. ఈ పాటని ఫుట్ ట్యాపింగ్ డ్యాన్సింగ్…