దిల్ రాజు & శిరీష్‌ , ఆశిష్ & ఆదిత్య రావు గంగసాని #SVC60 టైటిల్ దేత్తడి – మాస్ అప్పీలింగ్ ఫస్ట్ లుక్ రిలీజ్

Dil Raju & Shirish’s #SVC60 Culturally Charged Drama With Ashish & Debut Director Aditya Rao Gangasani Titled DeThadi, Mass-appealing First Look Unveiled
Spread the love

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు , శిరీష్‌ తమ ప్రైడ్ ప్రాజెక్ట్ #SVC60 ను ఇటీవల ప్రకటించారు. “రౌడీ బాయ్స్”, “లవ్ మీ” సినిమాలతో అలరించిన యంగ్ స్టార్ ఆశిష్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంతో నూతన దర్శకుడైన ఆదిత్య రావు గంగసాని తన క్రియేటివ్ విజన్‌ను తెరపైకి తీసుకురానున్నారు. ఈ చిత్రం హైదరాబాద్ వీధుల్లో చోటుచేసుకునే కల్చర్ తో నిండిన, భావోద్వేగంతో కూడిన అనుభూతిని ప్రేక్షకులకు అందించనుంది.
ఆశిష్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను అధికారికంగా విడుదల చేసింది. మాస్‌కు నచ్చే స్టైల్లో “దేత్తడి” అనే టైటిల్ పెట్టారు. ఇది హై ఎనర్జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రామిస్ చేస్తోంది.
ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆశిష్ హైదరాబాద్ వీధుల్లో కనిపించే డప్పు వాద్యకారుడి గెటప్‌లో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. భుజాలపై డప్పు తగిలించుకుని రెండు స్టిక్స్‌తో బలంగా మోగిస్తుండగా, మూడో స్టిక్‌ను పళ్ల మధ్యలో పట్టుకుని, అతని ముఖం మొత్తం జోష్‌తో నిండిపోయి ఉంది. అతని దుస్తులు కూడా అతని క్యారెక్టర్‌ను ప్రజెంట్ చేస్తూ మాస్ ఫీల్‌ను ఇస్తున్నాయి.
బ్యాక్‌డ్రాప్‌లో డప్పులు మోగుతున్న గుంపు చుట్టూ జనం ఉత్సాహంగా డాన్స్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇది సినిమాకు ఎంత ఎనర్జీగా ఉంటుందో సూచిస్తోంది.
ఈ సినిమాలో మాస్ మేకోవర్‌లో కనిపించనున్న ఆశిష్, హైదరాబాదీ స్లాంగ్‌లో డైలాగులు చెప్పడం సినిమాకు మరో హైలైట్ కానుంది.
ఈ సినిమాకు సంగీతం మరో ప్రధాన బలంగా నిలవనుంది. దర్శకుడు స్వయంగా మ్యూజికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాడు కావడంతో సినిమాలో సౌండింగ్ ఇన్నోవేటివ్ గా ఉండబోతుంది. ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది.
ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.
తారాగణం: ఆశిష్
టెక్నికల్ టీమ్
దర్శకత్వం: ఆదిత్య రావు గంగసాని
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఇన్ అసోసియేషన్ విత్ రుతమ్ స్టోరి ల్యాబ్
సమర్పణ: శ్రీమతి అనిత
క్రియేటివ్ నిర్మాత: రుతమ్ సమర్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్ పార్ట్‌నర్: హ్యాష్‌ట్యాగ్ మీడియా

Related posts

Leave a Comment