రామ్ చరణ్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ఓవైపు ‘గేమ్ ఛేంజర్’తో బిజీగా ఉంటూనే.. మరోవైపు బుచ్చిబాబు సినిమాకి సంబంధించిన కథా చర్చల్లో పాలు పంచుకొంటున్నాడు. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో కథానాయికగా సాయి పల్లవిని ఎంచుకొనే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇది వరకు శ్రీలీల పేరు బయటకు వచ్చింది. ఆమె స్థానంలోకి సాయి పల్లవి వచ్చిందా? లేదంటే ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలా? అనే సంగతి తెలియాల్సివుంది. 1980 నేపథ్యంలో సాగే పిరియాడిక్ చిత్రమిది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించనున్నారు. రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. చెన్నైలో ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. 2024 సంక్రాంతికి ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.
Related posts
-
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ అందరినీ అలరిస్తుంది :నిర్మాత దిల్ రాజు
Spread the love దిల్‌రాజుగారితో కలిసి ‘గేమ్ చేంజర్’ సినిమాను తమిళంలో విడుదల చేయబోతుండటం ఆనందంగా ఉంది – ఆదిత్యరామ్ మూవీస్... -
Shankar’s Game Changer featuring global star Ram Charan will universally captivate everyone – Dil Raju.
Spread the love I am delighted to be releasing Game Changer in Tamil in collaboration with Dil... -
ఆ పార్టీలకు వెళితేనే బాలీవుడ్లో ఛాన్సులు వస్తాయ్ : రెజీనా
Spread the love సినిమాల్లోకి వచ్చి దాదాపు 20 ఏళ్లు కావొస్తుండగా బాలీవుడ్ ఎంట్రీ ఎందుకు ఆలస్యమైందని ఎదురైన ఓ ప్రశ్నకు రెజీనా...