ఎన్టీఆర్‌ నెగెటివ్‌ షేడ్‌లో ‘వార్‌-2’

NTR in a negative shade in 'War-2'
Spread the love

బాలీవుడ్‌లో ఇదివరకు సంచలన విజయం అందుకున్న యాక్షన్‌ స్పై థ్రిల్లర్‌ ‘వార్‌‘కు సీక్వెల్‌గా రాబోతున్న చిత్రం ’వార్‌ 2’. 2019లో విడుదలైన మొదటి భాగంలో హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌ యాక్షన్‌ సీన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేశారు. ఇప్పుడు ఈ సీక్వెల్‌కి మరింత క్రేజీగా రూపొందించడానికి పాన్‌ ఇండియా స్టార్‌ ఎన్టీఆర్‌ రంగంలోకి దిగాడు. ఇది ఎన్టీఆర్‌కి బాలీవుడ్‌లో తొలి చిత్రం కావడంతోనే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని ’బ్రహ్మాస్త్ర’ వంటి విజువల్‌ వండర్‌ని తెరపైకి తీసుకొచ్చిన అయాన్‌ ముఖర్జీ డైరెక్ట్‌ చేస్తున్నారు. యశ్‌ రాజ్‌ ఫిలిమ్స్‌ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్‌ చిత్రానికి సరికొత్త మేకింగ్‌ కథాంశం ఉండబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్ర ఎలా ఉండబోతుందనేది అభిమానుల్లో పెద్ద క్యూరియాసిటీగా మారింది. కొన్ని లీకుల ప్రకారం, ఆయన నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించనున్నారని, అయితే అది పూర్తిగా విలన్‌ కాదని.. గ్రే షేడ్స్‌ కలిగిన పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌ అని సమాచారం. కొత్త లుక్‌లో ఎన్టీఆర్‌ స్కీన్ర్‌పై ఎలా కనిపిస్తాడన్నదే ఇప్పుడు ప్రధాన చర్చాంశం. ఇక ఈ సినిమాకు సంబంధించి టీజర్‌ విషయానికి వస్తే.. ఎన్టీఆర్‌ పుట్టినరోజు మే 20 సందర్భంగా చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేయాలనే ప్లాన్‌లో ఉంది.

Related posts

Leave a Comment