‘హరిహరవీరమల్లు’ జూన్‌ 12న విడుదల

'Hari Hara Veera Mallu' to release on June 12th
'Hari Hara Veera Mallu' to release on June 12th
Spread the love

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న భారీ చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఎట్టకేలకు శుభవార్త అందింది. అన్ని అడ్డంకులను దాటుకొని జూన్‌ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాకు సంబంధించిన మొత్తం షూటింగ్‌ ఇప్పటికే పూర్తయింది. ఈ చిత్రం పాన్‌ఇండియా స్థాయిలో విడుదల అవుతుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పెద్దఎత్తున విడుదల కానుంది. అమెజాన్‌ ప్రైమ్‌ దీని డిజిటల్‌ రైట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ‘హరి హర వీరమల్లు’ సినిమా గత కొన్నేళ్లుగా ఆలస్యమవుతూ వచ్చింది. హీరో పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాల కారణంగా ఈ సినిమా షూటింగ్‌ నిరవధికంగా ఆగిపోవడంతో ఆలస్యం అయ్యింది. కానీ ఎట్టకేలకు పవన్‌ కళ్యాణ్‌ సినిమా షూటింగ్‌ లో పాల్గొని పూర్తి చేశారు. మే 6, 2025న సినిమా చిత్రీకరణ ముగిసినట్లు నిర్మాతలు ప్రకటించారు. గతంలో ఈ సినిమా మార్చి 28, మే 9 తేదీలలో విడుదల అవుతుందని \వార్తలు వచ్చినా.. పలు కారణాల వల్ల వాయిదా పడింది.